డీ గ్లామర్ గా కనిపించాలన్నా, థియేటర్ ను హీటెక్కించాలన్నా సరిలేరు ఆమెకెవ్వరు. ఈ రోజు విద్యాబాలన్ బర్త్ డే
జనవరి 1, 1979లో ముంబైలో ఓ తమిళ కుటుంబంలో జన్మించింది. 16 ఏళ్ల వయస్సులో ఏక్తా కపూర్ షో ''హమ్ పాంచ్''లో రాధికాగా తన కెరీర్‌ని ప్రారంభించింది విద్యా. 2003లో బెంగాలీ నాటకం 'భలో తేకో'తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
'పరిణీత'తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ తొలిసినిమాకే ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత అత్యధిక వసూళ్లు చేసిన 'లగే రహో మున్నా భాయ్' లో హీరోయిన్ గా నటిచింది. ఆ తర్వాత హే బేబీ , కిస్మత్ కనెక్షన్ మంచి రిజల్ట్ ఇవ్వలేదు. ఇంకా ''పా'', ''ఇష్కియా'', ''నో వన్ కిల్డ్ జెస్సికా'' లో నటించింది. అయితే 2011లో వచ్చిన సిల్క్ స్మిత బయోపిక్ ''ది డర్టీ పిక్చర్'' తో విద్యా పేరు మారుమోగిపోయింది. 'డర్టీ పిక్చర్'తో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ గా మారింది. లకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా విద్యాబాలన్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.
2012లో కహాని తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 'కహానీ 2, దుర్గా రాణి సింగ్' (2016), తుమ్హారీ సులు (2017), మిషన్ మంగళ్ (2019), శకుంతల, బేగం జాన్ చిత్రాల్లో నటించింది.
జాతీయ చలన చిత్ర అవార్డు, ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులతో సహా అనేక అవార్డులను అందుకుంది. 2014లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. విద్యా... ఇండియన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌లో సభ్యురాలు, రేడియో షో నిర్వహిస్తోంది.
ప్రముఖ నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ని 2012లో వివాహం చేసుకున్న విద్యా... సాధారణంగా ప్రతి మగవాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందంటారు కానీ తన విజయం వెనుక సిద్ధార్థ్ ఉన్నాడంటూ గర్వంగా చెప్పుకుంటుంది.
విద్యాబాలన్ (Image Credit: Vidya Balan/ Instagram)

Jr NTR: అమిగోస్ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఎన్టీఆర్!
Honey Rose: ‘వీరసింహా రెడ్డి’ బ్యూటీ హనీ రోజ్ ట్రెండీ లుక్
Shraddha Kapoor Photos: పింక్ డ్రెస్‌లో శ్రద్ధా కపూర్ ని చూస్తే 'సాహో' అనాల్సిందే
Dethadi Harika: క్యాండిల్ లైటింగ్‌లో బిగ్‌బాస్ హారిక అందాల విందు
Adah Sharma: పొట్టి గౌనులో అందాల అదా శర్మ
Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్
Jr NTR: అప్డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!
Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్
AP SI Hall Tickets: ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో! పరీక్ష ఎప్పుడంటే?