అన్వేషించండి
Bhale Unnade New Release Date: రాజ్ తరుణ్ కొత్త సినిమా విడుదల... ఆరు రోజులు వెనక్కి, వినాయక చవితికి రావట్లేదండోయ్
Bhale Unnade Release Postponed: యువ హీరో రాజ్ తరుణ్ కొత్త సినిమా 'భలే ఉన్నాడే' విడుదల వాయిదా పడింది. తొలుత వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నా కుదరడం లేదు.

'భలే ఉన్నాడే'లో రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్
1/5

Raj Tarun New Movie Release Date: యువ కథానాయకుడు రాజ్ తరుణ్ నటించిన కొత్త సినిమా 'భలే ఉన్నాడే'. దీనికి జె శివ సాయి వర్ధన్ దర్శకుడు. రవికిరణ్ ఆర్ట్స్ పతాకం మీద ఎన్.వి. కిరణ్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలకు మంచి పేరు వచ్చింది. అయితే... ఇప్పుడు కొత్త విడుదల తేదీ వెల్లడించారు.
2/5

వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 7న 'భలే ఉన్నాడే' సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా వేసినట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. ముందుగా అనుకున్న తేదీ కంటే ఆరు రోజులు ఆలస్యంగా సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.
3/5

'భలే ఉన్నాడే' సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ రిలీజైన సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. రాజ్ తరుణ్, శేఖర్ చంద్ర కలయికలో 'సినిమా చూపిస్త మావా' వంటి హిట్ సినిమా వచ్చింది. ప్రజెంట్ మరో రెండు సినిమాలు చేస్తున్నారు.
4/5

రాజ్ తరుణ్ లాస్ట్ రెండు సినిమాలు 'పురుషోత్తముడు', 'తిరగబడర సామీ' ఆశించిన విజయాలు సాధించలేదు. అందుకని, ఇప్పుడు ఆయన విజయం అందుకోవడం చాలా అవసరం. 'భలే ఉన్నాడే' ప్రచార చిత్రాలు బావుండటంతో హిట్ అందుకునేలా ఉన్నారు.
5/5

రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్ జంటగా నటించిన 'భలే ఉన్నాడే'లో 'సింగీతం' శ్రీనివాస్, అభిరామి, 'అమ్ము' అభిరామి, లీలా శాంసన్, వీటీవీ గణేష్, 'హైపర్' ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, 'రచ్చ' రవి, సుదర్శన్, శ్రీనివాస్ వడ్లమాని, మణి చందన, పటాస్ ప్రవీణ్ ప్రధాన తారాగణం.
Published at : 02 Sep 2024 10:00 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
అమరావతి
బిజినెస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion