అన్వేషించండి
Mrunal Thakur - Kalki 2898 AD: ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు - 'కల్కి 2898 ఏడీ' గురించి మృణాల్ ఠాకూర్
'సీతా రామం'తో తెలుగులో అభిమానుల్ని సొంతం చేసుకున్న ఉత్తరాది అందాల భామ మృణాల్ ఠాకూర్. లేటెస్ట్ హిట్ 'కల్కి 2898 ఏడీ'లో ఆవిడ అతిథి పాత్రలో సందడి చేసింది. ఆ సినిమా గురించి ఆవిడ ఏమని చెప్పారంటే?
!['సీతా రామం'తో తెలుగులో అభిమానుల్ని సొంతం చేసుకున్న ఉత్తరాది అందాల భామ మృణాల్ ఠాకూర్. లేటెస్ట్ హిట్ 'కల్కి 2898 ఏడీ'లో ఆవిడ అతిథి పాత్రలో సందడి చేసింది. ఆ సినిమా గురించి ఆవిడ ఏమని చెప్పారంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/0e36582955610791c0c42fbcf8b83bd51719568115674313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మృణాల్ ఠాకూర్
1/6
![మృణాల్ ఠాకూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. 'సీతా రామం' సినిమాతో తెలుగులో ఎంతో మంది ప్రేక్షకులను తన అభిమానులను చేసుకున్నారు ఆవిడ. ఫోటోలో ఒక లుక్కులో ఆవిడ అందంగా ఉంటే... మరొక పాత్రలో డీ గ్లామరస్ లుక్కులో ఉన్నారు. ఆ లుక్ ఎందులోదో తెలుసా? 'కల్కి 2898 ఏడీ' సినిమాలోనిది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/d5344d17eff3a218507b0ba84955381eefb0a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మృణాల్ ఠాకూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. 'సీతా రామం' సినిమాతో తెలుగులో ఎంతో మంది ప్రేక్షకులను తన అభిమానులను చేసుకున్నారు ఆవిడ. ఫోటోలో ఒక లుక్కులో ఆవిడ అందంగా ఉంటే... మరొక పాత్రలో డీ గ్లామరస్ లుక్కులో ఉన్నారు. ఆ లుక్ ఎందులోదో తెలుసా? 'కల్కి 2898 ఏడీ' సినిమాలోనిది.
2/6
![రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ 'కల్కి 2898 ఏడీ' సినిమాలో మృణాల్ ఠాకూర్ అతిథి పాత్ర చేశారు. కాశీలో నివసించే అమ్మాయి దివ్యగా ఆమె కనిపించారు. గర్భవతి రోల్ చేశారు. ఆ రోల్ గురించి 'కల్కి 2898 ఏడీ' దర్శక నిర్మాతలు సంప్రదించినప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా 'ఎస్' చెప్పానని తెలిపారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/abb18325154b3ee99f460ea0119eefed50748.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ 'కల్కి 2898 ఏడీ' సినిమాలో మృణాల్ ఠాకూర్ అతిథి పాత్ర చేశారు. కాశీలో నివసించే అమ్మాయి దివ్యగా ఆమె కనిపించారు. గర్భవతి రోల్ చేశారు. ఆ రోల్ గురించి 'కల్కి 2898 ఏడీ' దర్శక నిర్మాతలు సంప్రదించినప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా 'ఎస్' చెప్పానని తెలిపారు.
3/6
![''నిర్మాతలు అశ్వినీదత్, స్వప్న దత్, ప్రియాంక దత్ మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. 'ఎస్' అని వెంటనే చెప్పేశా. మా కాంబినేషన్ లో వచ్చిన 'సీతా రామం' సక్సెస్ ఫుల్ ఫిల్మ్'' అని మృణాల్ ఠాకూర్ చెప్పారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/d3041313677e349697ae884a9f9402351e0f2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
''నిర్మాతలు అశ్వినీదత్, స్వప్న దత్, ప్రియాంక దత్ మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. 'ఎస్' అని వెంటనే చెప్పేశా. మా కాంబినేషన్ లో వచ్చిన 'సీతా రామం' సక్సెస్ ఫుల్ ఫిల్మ్'' అని మృణాల్ ఠాకూర్ చెప్పారు.
4/6
!['కల్కి 2898 ఏడీ' వంటి భారీ ప్రతిష్టాత్మక సినిమాలో తానొక భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని మృణాల్ ఠాకూర్ తెలిపారు. 'కల్కి' ట్రైలర్ విడుదలకు ముందు ఒక ట్రైలర్ లీక్ అయ్యింది. అందులో మృణాల్ కనిపించారు. కానీ, ఆవిడ లుక్ మాత్రం సరిగా కనిపించలేదు. సినిమా రిలీజ్ వరకు సర్‌ప్రైజ్‌గా ఉంచారు. సినిమా ప్రారంభంలో మృణాల్ ఠాకూర్ సన్నివేశాలు చూసి కొందరు సర్‌ప్రైజ్ అయ్యారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/9c05b40bfbbe0ee31756f53098625e6cc135d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'కల్కి 2898 ఏడీ' వంటి భారీ ప్రతిష్టాత్మక సినిమాలో తానొక భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని మృణాల్ ఠాకూర్ తెలిపారు. 'కల్కి' ట్రైలర్ విడుదలకు ముందు ఒక ట్రైలర్ లీక్ అయ్యింది. అందులో మృణాల్ కనిపించారు. కానీ, ఆవిడ లుక్ మాత్రం సరిగా కనిపించలేదు. సినిమా రిలీజ్ వరకు సర్‌ప్రైజ్‌గా ఉంచారు. సినిమా ప్రారంభంలో మృణాల్ ఠాకూర్ సన్నివేశాలు చూసి కొందరు సర్‌ప్రైజ్ అయ్యారు.
5/6
![తెలుగులో 'హాయ్ నాన్న', 'ది ఫ్యామిలీ స్టార్' సినిమాల్లో మృణాల్ ఠాకూర్ నటించారు. ప్రజెంట్ కొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజిలో ఉన్నాయట.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/0b0a78ffb1e7d94ddc67b96552dd3e2721f7b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో 'హాయ్ నాన్న', 'ది ఫ్యామిలీ స్టార్' సినిమాల్లో మృణాల్ ఠాకూర్ నటించారు. ప్రజెంట్ కొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజిలో ఉన్నాయట.
6/6
![మృణాల్ ఠాకూర్ ఇప్పుడు ఒక హిందీ సినిమా చేస్తున్నారు. దాని తర్వాత తెలుగు సినిమా చేసే అవకాశం ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/28/66a0ef69554aa9f2e8171eae32035589d4c59.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మృణాల్ ఠాకూర్ ఇప్పుడు ఒక హిందీ సినిమా చేస్తున్నారు. దాని తర్వాత తెలుగు సినిమా చేసే అవకాశం ఉంది.
Published at : 28 Jun 2024 05:00 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
రాజమండ్రి
విజయవాడ
గాసిప్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion