అన్వేషించండి
Crime Thriller Movies Telugu: తేడా బ్యాచ్ సమర్పణలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ 'ఎవోల్'... పెద్దలు మాత్రమే అని చెప్పిన సెన్సార్
EVOL movie gets A from Censor: బోల్డ్ లవ్ స్టోరీలతో తెరకెక్కుతున్న సినిమాలకు ప్రేక్షకాదరణ బావుంటోంది. 'అర్జున్ రెడ్డి', రీసెంట్ 'లవ్ మౌళి' ఆ లిస్టులో సినిమాలే. ఇప్పుడు ఆ కోవలో మరో సినిమా రాబోతోంది.
![EVOL movie gets A from Censor: బోల్డ్ లవ్ స్టోరీలతో తెరకెక్కుతున్న సినిమాలకు ప్రేక్షకాదరణ బావుంటోంది. 'అర్జున్ రెడ్డి', రీసెంట్ 'లవ్ మౌళి' ఆ లిస్టులో సినిమాలే. ఇప్పుడు ఆ కోవలో మరో సినిమా రాబోతోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/d14411c196cb6d934cc104bb01c70e7c1718970685812313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బోల్డ్ కథతో రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ 'ఎలోవ్'కు సెన్సార్ నుంచి ఎ సర్టిఫికెట్ లభించింది. దీనిపై దర్శక నిర్మాత ప్రెస్ మీట్ నిర్వహించారు.
1/6
![దర్శక నిర్మాతలు ఎంతో మంది తమ సినిమాలకు క్లీన్ 'యు' సర్టిఫికెట్ రావాలని కోరుకుంటారు. కానీ, కొందరు డిఫరెంట్‌గా ఆలోచిస్తారు. 'ఏ' సర్టిఫికెట్ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ కోవలోకి వచ్చే దర్శక నిర్మాత రామ్ యోగి వెలగపూడి. ఆయన తీసిన సినిమా 'ఎవోల్' (EVOL Movie). ఏ లవ్ స్టోరీ ఇన్ రివర్స్... అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు సెన్సార్ నుంచి 'ఎ' సర్టిఫికెట్ లభించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/5678b2598d7f34d201a2a096c876b9399e937.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
దర్శక నిర్మాతలు ఎంతో మంది తమ సినిమాలకు క్లీన్ 'యు' సర్టిఫికెట్ రావాలని కోరుకుంటారు. కానీ, కొందరు డిఫరెంట్‌గా ఆలోచిస్తారు. 'ఏ' సర్టిఫికెట్ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ కోవలోకి వచ్చే దర్శక నిర్మాత రామ్ యోగి వెలగపూడి. ఆయన తీసిన సినిమా 'ఎవోల్' (EVOL Movie). ఏ లవ్ స్టోరీ ఇన్ రివర్స్... అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు సెన్సార్ నుంచి 'ఎ' సర్టిఫికెట్ లభించింది.
2/6
!['ఎవోల్... ఏ లవ్ స్టోరీ ఇన్ రివర్స్' సినిమా దర్శక నిర్మాత రామ్ యోగి వెలగపూడి శుక్రవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... ''ఇద్దరు స్నేహితుల సాగే కథతో రూపొందిన సినిమా 'ఎవోల్'. భిన్నమైన అంశాలతో వాణిజ్య విలువలతో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది'' అని చెప్పారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/a8d5c0e92efa8e1560e762d49c69a66bdb45a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
'ఎవోల్... ఏ లవ్ స్టోరీ ఇన్ రివర్స్' సినిమా దర్శక నిర్మాత రామ్ యోగి వెలగపూడి శుక్రవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... ''ఇద్దరు స్నేహితుల సాగే కథతో రూపొందిన సినిమా 'ఎవోల్'. భిన్నమైన అంశాలతో వాణిజ్య విలువలతో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది'' అని చెప్పారు.
3/6
!['ఎవోల్' సినిమాలో సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు కథానాయకులుగా నటించారు. ఇందులో జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్. 'love'ని రివర్స్ చేస్తే... 'evol'. సో... ఈ సినిమాను రివర్స్ లవ్ స్టోరీగా కూడా చూడవచ్చని దర్శక నిర్మాత రామ్ యోగి వెలగపూడి తెలిపారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/f76486d8514e7248ac3a2f7ee4bdda138a65d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
'ఎవోల్' సినిమాలో సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు కథానాయకులుగా నటించారు. ఇందులో జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్. 'love'ని రివర్స్ చేస్తే... 'evol'. సో... ఈ సినిమాను రివర్స్ లవ్ స్టోరీగా కూడా చూడవచ్చని దర్శక నిర్మాత రామ్ యోగి వెలగపూడి తెలిపారు.
4/6
!['ఎవోల్' ట్రైలర్ కు వస్తున్న స్పందన తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని రామ్ యోగి వెలగపూడి తెలిపారు. తేడా బ్యాచ్ సినిమా సమర్పణలో నక్షత్ర ఫిల్మ్ ల్యాబ్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తామని ఆయన చెప్పారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/513cab9af552ba32fa96399beefc944fc42e2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
'ఎవోల్' ట్రైలర్ కు వస్తున్న స్పందన తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని రామ్ యోగి వెలగపూడి తెలిపారు. తేడా బ్యాచ్ సినిమా సమర్పణలో నక్షత్ర ఫిల్మ్ ల్యాబ్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తామని ఆయన చెప్పారు.
5/6
!['ఎవోల్' చిత్రీకరణను హైదరాబాద్, విశాఖ పరిసర ప్రాంతాల్లో చేసినట్టు రామ్ యోగి వెలగపూడి తెలిపారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/72d436f8e37e509d972b8ee18ac43ee24ee9c.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
'ఎవోల్' చిత్రీకరణను హైదరాబాద్, విశాఖ పరిసర ప్రాంతాల్లో చేసినట్టు రామ్ యోగి వెలగపూడి తెలిపారు.
6/6
![సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు, జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరో హీరోయిన్లుగా నటించిన 'ఎవోల్' చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, ఛాయాగ్రహణం: తేడా బ్యాచ్ సినిమా టీమ్, కూర్పు: విజయ్, కళా దర్శకత్వం: యోగి వెలగపూడి, నృత్య దర్శకత్వం: జిన్నా, కథ - కథనం - సంభాషణలు - నిర్మాణం - దర్శకత్వం: రామ్ యోగి వెలగపూడి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/8b857b02a107fbb6d46767ea94db3e6e2ca63.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు, జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరో హీరోయిన్లుగా నటించిన 'ఎవోల్' చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, ఛాయాగ్రహణం: తేడా బ్యాచ్ సినిమా టీమ్, కూర్పు: విజయ్, కళా దర్శకత్వం: యోగి వెలగపూడి, నృత్య దర్శకత్వం: జిన్నా, కథ - కథనం - సంభాషణలు - నిర్మాణం - దర్శకత్వం: రామ్ యోగి వెలగపూడి.
Published at : 21 Jun 2024 05:23 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion