అన్వేషించండి

District Presidents YSRCP: వైసీపీలో భారీ మార్పులు- జిల్లాలకు కొత్త అధ్యక్షులు, సమన్వయకర్తలు- తెరపైకి ఊహించని పేర్లు !

AP District Presidents Of YSRCP: మొత్తం 26 జిల్లాలకు వైసీపీ అధ్యక్షులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్, మాజీ ఎమ్మెల్యేలను జిల్లాలకు పార్టీ అధక్షులుగా బాధ్యతలు అప్పగించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.

AP District Presidents YSR Congress Party: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో కీలక మార్పులు జరిగాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది వైసీపీ. మొత్తం 26 జిల్లాలకు వైసీపీ అధ్యక్షులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్, మాజీ ఎమ్మెల్యేలను జిల్లాలకు పార్టీ అధక్షులుగా భాద్యతలు అప్పగించారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

వివిధ జిల్లాల అధ్యక్షులు తప్పుకున్న వేళ వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాకు పరీక్షిత్‌ రాజును అధ్యక్షుడిగా నియమించారు. విశాఖ బాధ్యతలు పంచకర్ల రమేష్‌కు అప్పగించారు. గుంటూరును డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు, ప్రకాశంను జంకె వెంకట్‌రెడ్డికి.. కర్నూలును బీవై రామయ్యకు, అనంతపురం జిల్లాలనను పైలా నరసింహయ్యకు చిత్తూరు జిల్లాను మంత్రి నారాయణ స్వామికి, తిరుపతిని నేదురమల్లి రామ్‌కుమార్‌ రెడ్డికి అప్పగించారు. 

కుప్పం వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఎమ్మెల్సీ భరత్‌ను చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా తప్పించారు. అక్కడ మంత్రి నారాయణ స్వామిని నియమించారు. మాజీ మంత్రి పుష్పశ్రీవాణి, అవంతి శ్రీనివాస్‌, సుచరిత, బుర్రా భాస్కరరెడ్డిని జిల్లా బాధ్యతల నుంచి తప్పించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, కొడాలి నాని, అనిల్‌కుమార్‌లను కూడా ప్రాంతీయ సమన్వయ కర్తల బాధ్యతల నుంచి తొలగించారు.

సజ్జల, బుగ్గన చూసే కర్నూలు, నంద్యాల జిల్లాల వ్యవహారాలను ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డికి అప్పగించారు. తిరుపతి, కడప జిల్లా బాధ్యతల నుంచి అనిల్‌ కుమార్‌ను తప్పించి బాలినేని శ్రీనివాస రెడ్డికి అధనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు, కడప, తిరుపతి జిల్లాలను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. 

బాపట్ల జిల్లా సమన్వయ బాధ్యతను ఎంపీ బీద మస్తాన్‌రావుకు అప్పగించారు. పల్నాడు జిల్లాకు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి ఇచ్చారు. గుంటూరు జిల్లా బాధ్యతను మర్రి రాజశేఖరర్‌్కు అప్పగించారు. ఆయన ఇప్పటికే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలను చూస్తున్నారు. ఆయనకు సహాయంగా అయోధ్యరామిరెడ్డిని నియమించారు. విజయనగరం జిల్లా  బాధ్యతను మంత్రి బొత్స సత్యనారాయణ నుంచి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి మార్చారు. వైవీ నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాను బొత్సకు కేటాయించారు. 

తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి మరో కీలక పదవి అప్పగించారు. పార్టీ అనుబంధ విభాగాల సమన్వయకర్తగా నియమించారు. ఇప్పటికే అనుబంధ విభాగాల సమన్వయకర్తగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డికి సహాయకంగా చెవిరెడ్డి ఉంటారని వైసీపీ ప్రకటించింది. 

ఆయా జిల్లాలకు ప్రస్తుత అధ్యక్షులు వీళ్లే

జిల్లా పేరు   -      అధ్యక్షుడు / అధ్యక్షురాలు
1. శ్రీకాకుళం   -  ధర్మాన కృష్ణ దాస్, ఎమ్మెల్యే
2. విజయనగరం   -  మజ్జి శ్రీనువాసరావు (చిన్న శ్రీను)
3. పార్వతీపురం మన్యం   -  పరీక్షిత్ రాజు
4. అల్లూరి సీతారామ రాజు -  కొత్తగుల్లి భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే
5. విశాఖపట్నం   -  పంచకర్ల రమేష్, మాజీ ఎమ్మెల్యే
6. అనకాపల్లి   -  కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే
7. కాకినాడ   -  కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే
8. కోనసీమ   -  పొన్నాడ వెంకట సతీష్ కుమార్, ఎమ్మెల్యే
9. తూర్పు గోదావరి   -  జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే
10. పశ్చిమగోదావరి   -  చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు, ఎమ్మెల్యే
11. ఏలూరు   -  ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని), ఎమ్మెల్యే
12. కృష్ణా   -  పేర్ని వెంకటరామయ్య నాని (పేర్ని నాని), ఎమ్మెల్యే
13. ఎన్టీఆర్   -  వెలంపల్లి శ్రీనివాస్ రావు, ఎమ్మెల్యే
14. గుంటూరు   -  డొక్కా మాణిక్య వర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే
15. బాపట్ల   -  మోపిదేవి వెంకటరమణ, ఎంపీ
16. పల్నాడు  -   రామకృష్ణారెడ్డి పిన్నెల్లి, ఎమ్మెల్యే
17. ప్రకాశం   -  జంకె వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
18. SPSR నెల్లూరు   -  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, MP
19. కర్నూలు   -  బి వై రామయ్య, మేయర్
20. నంద్యాల   -  కాటసాని రామభూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే
21. అనంతపురం   -  పైలా నరసింహయ్య
22. శ్రీ సత్యసాయి   -  మాలగుండ్ల శంకర్ నారాయణ, ఎమ్మెల్యే
23. వైఎస్ఆర్ కడప   -  కొత్తమద్ది సురేష్ బాబు
24. అన్నమయ్య   -  గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే
25. చిత్తూరు   -  కె నారాయణ స్వామి, డిప్యూటీ సీఎం
26. తిరుపతి   -  నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Citroen Basalt: బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్నHardik Pandya vs Rohit Sharma: రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులుSiddhu Jonnalagadda Tillu Square Pre Release: ఈవెంట్ కు అనుపమ  ఎందుకు రాలేదో చెప్పిన సిద్ధుMalla Reddy Speech | కేటీఆర్ లేక రియల్ స్టేట్ పడిపోయిందంటున్న మల్లారెడ్డి | Abp Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Citroen Basalt: బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Naveen Polishetty: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
Varun Gandhi : వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు  బహిరంగ లేఖ
వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు బహిరంగ లేఖ
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Embed widget