అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

YSR Law Nestham: జూనియర్ లాయర్లకు గుడ్ న్యూస్ - బటన్ నొక్కి లా నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం జగన్

YSR Law Nestham: యువ న్యాయవాదులకు 2023–24 సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. 2,677 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 6,12,65,000 ను విడుదల చేశారు.

YSR Law Nestham: యువ న్యాయవాదులకు తొలి మూడు సంవత్సరాలు అండగా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్ లా నేస్తం నిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. 2023–24 సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 2,677 మంది జూనియర్‌ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5000 స్టైఫండ్‌ చొప్పున.. ఫిబ్రవరి 2023 – జూన్‌ 2023 (5నెలలు)కు ఒక్కొక్కరికి రూ.25,000 పంపిణీ చేశారు. ఇలా మొత్తం రూ. 6,12,65,000 ను క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి మరీ రిలీజ్ చేశారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నడుస్తోందని... ఈ ఏడాదికి సంబంధించి మొదటి విడతలో 2,677 మంది అడ్వకేట్‌లకు రూ.6,12,65,000 వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. న్యాయవాదులు లా కోర్సు పూర్తి చేసిన మొదటి మూడు సంవత్సరాల్లో ప్రాక్టీసు పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ అన్నారు. అప్పుడే చదువులు పూర్తి అయి, కోర్టుల్లో అడుగు పెడుతున్న పరిస్థితుల్లో వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు సాయం చేస్తున్నట్లు వివరించారు. జూనియర్ న్యాయవాదులకు తోడుగా నిలుస్తూ.. ప్రతి నెలా రూ.5వేలు, ఏడాదిలో రూ.60 వేలు ఇస్తున్నామన్నారు. మూడేళ్లలో ఇలా ఒక్కొక్కరికీ రూ.1.80లక్షలు ఇచ్చామని చెప్పారు. దీనివల్ల వృత్తిలో వాళ్లు నిలదొక్కుకుంటారని అన్నారు. ఈ సాయం వల్ల జూనియర్ న్యాయవాదులు ఇబ్బంది పడకుండా జీవితంలో ముందుకు వెళ్తారన్న మంచి ఆలోచనతోనే ఈ పథకం ప్రారంభించామని చెప్పుకొచ్చారు. 

4 ఏళ్లలో 5,781 మందికి రూ.41.52 కోట్లు సాయం..

ఇప్పటి వరకు 5,781 మంది జూనియర్‌ న్యాయవాదులకి మేలు చేశామని సీఎం జగన్ స్పష్టం చేశారు. 2019 నవంబరులో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో నాలుగేళ్లలో ప్రతి నెలా రూ.5వేల చొప్పున ఇస్తూ.. ఇంత వరకు మొత్తంగా రూ. 41.52 కోట్లు జూనియర్‌ లాయర్లకు ఇచ్చామన్నారు.

రూ.100 కోట్లతో వెల్ఫేర్ ట్రస్టు...

ఇలాంటి పథకం, ఇలాంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ నాయకుడూ చేయలేదన్నారు. కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇదొక్కటే కాకుండా అడ్వకేట్లకు అన్నిరకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో అడ్వకేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే వెల్ఫేర్‌ ట్రస్టును ఏర్పాటు చేశామని తెలిపారు. మెడిక్లెయిమ్ కాని న్యాయవాదుల అవసరాలకు రుణాలు వంటి వాటికి, ఈ నిధుల నుంచి రూ.25 కోట్లు సహాయం చేయడం జరిగిందన్నారు. ఈ రెండు కార్యక్రమాల ద్వారా నాలుగేళ్ల కాలంలో అడ్వకేట్లకు రాష్ట్ర ప్రభుత్వం నిజంగా తోడుగా ఉందనే సంకేతం వెళ్లిందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి డిసెంబరు నాటికి ఆరు నెలలు అవుతుందని.. 6 నెలలకు ఒకేసారి మొత్తంగా రూ.30వేలు వస్తే.. ఇంగా బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యంతో క్రితం సారి మార్పు చేశామని పేర్కొన్నారు. మరలా డిసెంబరులో ఈ ఏడాదికి సంబంధించిన రెండో దఫా కార్యక్రమం జరుగుతుందన్నారు. వీటన్నింటివల్లా న్యాయవాదులకు మంచి జరగాలని కోరుకుంటున్నాను అని సీఎం జగన్ వివరించారు. 

పేదల పట్ల మమకారం చూపండి..!

ఇంత మనసు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని.. ప్రభుత్వం తరపు నుంచి న్యాయవాదులను కోరేది ఒక్కటేనని తెలిపారు. జూనియర్లుగా ఉన్న న్యాయవాదులు ప్రతి ఒక్కరికీ కూడా దీనివల్ల మంచి జరిగితే.. వీరు స్థిరపడ్డాక ఇదే మమకారం వీళ్లు పేదలపట్ల చూపిస్తారని ఒక విశ్వాసం ఉందన్నారు. ప్రభుత్వం తరపు నుంచి ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా వారి దగ్గర నుంచి తాను ఆశిస్తుంది ఇదేనని వివరించారు. దేవుడి దయ వల్ల మంచి జరుగుతుందన్నారు. దీన్ని ఎప్పుడూ మరిచిపోవద్దని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మంచిని ప్రతి పేదవాడికి తిరిగి బదిలీ అయ్యేటట్టుగా జూనియర్ లాయర్లు చేయాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Embed widget