Viral News: పడుకునే బెడ్‌లో సగం అద్దెకిస్తూ లక్షలు సంపాదిస్తున్న మహిళ! మాజీ లవర్‌తో స్టార్ట్!
Viral News: కరోనా ఆమె జీవితాన్ని మార్చేసింది. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. అప్పుడే సరికొత్త వ్యాపార ఆలోచన వచ్చింది. తొలి ఆఫర్ మాజీ ప్రియుడికే ఇచ్చింది. డిమాండ్ పెరగడంతో రేట్లు పెంచేస్తోంది.

Viral News: ప్రపంచంలో డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాదని చాలా మంది నిరూపిస్తున్నారు. వారిని ఆలోచనలు చూస్తే ఇలా ఉన్నారేంట్రా అనిపిస్తుంది. కానీ ఆయా దేశాప్రాంతాలను బట్టి వారి చేసింది సరైందే అనకమానరు. ఇప్పుడు తెలుసుకోబోయే యువతి స్టోరీ అలాంటిదే. ఒక మహిళ తన బెడ్‌పై ఒక భాగాన్ని అపరిచితులకు అద్దెకు ఇచ్చి వారి నుంచి నెలకు వేల రూపాయలు తీసుకుంటోందని తెలిస్తే ఆశ్చర్యం కలగమానదు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వ్యాపారానికి ఒక పేరు కూడా ఉంది, దీనిని హాట్ బెడ్డింగ్ అంటారు. అసలు ఈ హాట్ బెడింగ్ అంటే ఏమిటో , దీని ద్వారా ఎవరు డబ్బు సంపాదిస్తున్నారో తెలుసుకుందాం.
ఆ మహిళ ఎవరు?
ది మింట్ నివేదిక ప్రకారం, ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు చెందిన 38 ఏళ్ల మోనిక్ జెర్మయా ఇటీవల ఒక విచిత్రమైన, ఆసక్తికరమైన ట్రెండ్‌తో వార్తల్లోకి ఎక్కింది. ఆమె ప్రతి నెలా దాదాపు AUD 985 లేదా 54,000 రూపాయలు సంపాదిస్తోంది, ఎందుకంటే ఆమె తన బెడ్‌లో ఒక భాగాన్ని అపరిచితులకు అద్దెకు ఇస్తుంది.
హాట్ బెడింగ్ అంటే ఏమిటి?
ఈ కాన్సెప్ట్‌లో ఇద్దరు వ్యక్తులు ఒకే బెడ్‌పై పడుకుంటారు, కానీ ఎటువంటి రొమాంటిక్ లేదా శారీరక సంబంధం పెట్టుకోరు. అంటే ఒకరి పక్కన ఉన్నారనే కాన్సెప్టుతో రాత్రి గడపడం దీని ప్రధాన లక్ష్యం.. తద్వారా ఇద్దరికీ కొంత స్నేహం లభిస్తుంది. అంతుకు మించి డబ్బు వస్తుంది. ఇది ఇద్దరు వ్యక్తులు ఒకరి వ్యక్తిగత స్పేస్‌ను గౌరవించి, నియమాలను పాటించినప్పుడే సమర్థవంతంగా ఈ వ్యాపారం సాగుతుందని మోనిక్ చెబుతోంది.
కరోనాలో కొత్త మార్గం
2020 సంవత్సరంలో మహమ్మారి సమయంలో ప్రపంచం లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు, మోనిక్ జీవితం పూర్తిగా దెబ్బతింది. ఆమె విద్య వ్యాపారం ఆగిపోయింది, ఒంటరితనం కూడా పెరిగింది. అదే సమయంలో ఆమె వేరే విధంగా ఆలోచించాలని నిర్ణయించుకుంది. ఆమె తన జీవితం తన చేతుల నుంచి జారిపోతోందని భయపడింది. అప్పుడే ఏదైనా కొత్తగా చేయాల్సిందని లేకుంటే పిచ్చి ఆలోచనలు వస్తున్నాయని అనుకుంది. అప్పుడే తన మనసులో హాట్ బెడింగ్ ఆలోచన వచ్చిందని చెబుతోంది.
ఎక్స్ కు మొదటి ఆఫర్
ఈ విచిత్రమైన కాన్సెప్టును మోనిక్ తన మాజీ ప్రియుడితో ప్రారంభించింది. ఒక సంవత్సరం తర్వాత అతను ఆమెకు అకస్మాత్తుగా ఫోన్ చేసి, మీరు నాతో గడపాలనుకుంటున్నారా అని అడిగాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆమె నుంచి సమాధానం 'అవును' అని వచ్చింది! అక్కడి నుంచి ఆమె వ్యాపారం ప్రారంభమైంది.
కేవలం కలిసి పడుకోవడమే
మోనిక్ స్పష్టంగా చెబుతోంది, ఇది సపియోసెక్సువల్‌గా ఉన్న వారికి అనుకూలమైన పద్ధతి. అంటే, మానసిక అనుబంధాన్ని శారీరక సంబంధాల కంటే ఎక్కువ ఇష్టపడేవారికి. ఆమె " శారీరక సంబంధం కంటే మరింత స్నేహాన్ని కోరుకున్నవాళ్లకు ఇది మంచి ఆలోచన అవుతుంది" అని చెబుతోంది. ఆమె గది ఫైవ్ స్టార్ హోటల్ కంటే పెద్దదిగా ఉంటుంది. అన్ని సౌకర్యాలు ఉంటాయి. తద్వారా ఇద్దరు వ్యక్తులకు తగినంత స్థలం లభిస్తుంది.
పెరిగిన అద్దె
మోనిక్ హాట్ బెడింగ్ వారపు అద్దెను 14,272 రూపాయలు చేయబోతున్నట్లు తెలిపింది. దీనికి కారణం ఆస్ట్రేలియాలో నిరంతరం పెరుగుతున్న ధరలు. ప్రస్తుతం హాట్ బెడింగ్ వంటి సైడ్ హస్సెల్స్ మాత్రమే ప్రజలకు ఉపశమనం కలిగించగలవని ఆమె చెబుతోంది.





















