అన్వేషించండి

Ozempic: అసలు ఓజెంపిక్ ఏంటి? నిజంగా దీన్ని తీసుకుంటే బరువు తగ్గుతారా?

Ozempic: ఓజెంపిక్ అనేది టైప్ 2 డయాబెటిస్ ప్రభావం తగ్గించగల ఇంజెక్టెడ్ మెడిసిన్. దీనిని వారానికి ఒక సారి తీసుకుంటారు

Ozempic: ఓజెంపిక్..ఈ పేరు గత కొద్ది నెలలుగా వైరల్ అవుతోంది. అసలు ఓజెంపిక్ ఏంటి. దాని పని ఏంటో తెలుసుకుందాం. ఓజెంపిక్ వాస్తవానికి టైప్ 2 డయాబెటిస్ ప్రభావం తగ్గించగల ఇంజెక్టెడ్ మెడిసిన్. దీనిని వారానికి ఒక సారి వేసుకుంటారు. మెట్‌ఫార్మిన్‌ను తీసుకోలేనివారి దీనిని సొంతంగా ఉపయోగించుకోవచ్చు. ఒక పరిశోధనలో దాదాపు మూడు వంతుల మంది దీనిని వాడటం ద్వారా తమ శరీర బరువులో 10 శాతానికి పైగా తగ్గారని తేలడంతోపాటు అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది యాంటీ డయాబెటిక్ మెడిసిన్ అయినప్పటికీ అధిక బరువు తగ్గేంచే అద్భుత మైన ఔషధంగా జనాదరణ పొందింది.

ఓ టీవీ షోలో షారన్ ఓస్బోర్న్ బరువు తగ్గడానికి ఉపయోగించే టైప్ 2 డయాబెటిస్ డ్రగ్ అయిన ఓజెంపిక్ గురించి మాట్లాడారు. ఈ మందు పొట్టను తగ్గిస్తుందని, తరువాత ‘మిమ్మల్ని మారుస్తుంది’ అని ఆమె చెప్పింది.  టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న పెద్దలకు ఇది ఒక ఔషధం. ఇది ఆహారం, వ్యాయామంతో పాటు రక్తంలో చక్కెరను మెరుగుపరుస్తుంది. ఓజెంపిక్ బరువు తగ్గడానికి ఉద్దేశించినది కానప్పటికీ, ఇది కొంత బరువు తగ్గడానికి ప్రజలకు సహాయపడొచ్చని, ఓజెంపిక్ అనేది వారానికోసారి ఇంజెక్ట్ చేయగల మందు అని, అయితే ఇది అద్భుత ఔషధం కాదని నిపుణులు అంటున్నారు. 

ఓజెంపిక్ అనేది డానిష్ ఫార్మాస్యూటికల్ సంస్థ నోవో నార్డిస్క్ తయారు చేసిన యాంటీ డయాబెటిక్ డ్రగ్, ఇది ఇంజెక్ట్ చేయగల మెడిసిన్. మొదట్లో టైప్ 2 డయాబెటిస్‌ బాధితుల ట్రీట్‌మెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా దీనిని వినియోగించారు. ఈ ఔషధం శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి ఆకలి తగ్గించేస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. 2021 ప్రారంభంలో ఓజెంపిక్ ఔషధాన్ని ఉపయోగించిన దాదాపు మూడు వంతుల మంది తమ శరీర బరువులో 10 శాతానికిపైగా కోల్పోయిన అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ప్రీడ్ ప్రివ్యూ రీసెర్చ్ సంస్థ పరిశోధకులు కూడా అది బరువు తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొనడంతో ఓజెంపిక్ వాడకం దారి తప్పింది. డయాబెటిస్ పేషెంట్లు మాత్రమే కాకుండా అధిక బరువు ఉన్నవారు వాడటం ప్రారంభించారు. 

ఫోర్బ్స్ ఓజెంపిక్ ఔషధంపై వివరణాత్మక కథనం ప్రచురించింది. ఓజెంపిక్ అనేది గ్లూకోగాన్ లాంటి పెప్టైడ్-1 (GLP-1) రిసెప్టర్ అగోనిస్ అని పేర్కొంది. ఇది శరీరం అంతటా GLP-1 గ్రాహకాలను యాక్టివేట్ చేయడం, వాటి ప్రభావాలను మెరుగుపరచడంపై పనిచేస్తుందని తెలిపింది. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అయిన  క్రిస్టోఫర్ మెక్‌గోవన్ దీని గురించి మాట్లాడుతూ. ఓజెంపిక్ మెదడులోని ఆకలి కేంద్రాలను ప్రభావితం చేస్తుందని, అలాగే కడుపు ఖాళీ అయ్యే రేటును తగ్గించడం ద్వారా బరువును ప్రభావితం చేస్తుందని చెప్పారు. 

మొదటగా USలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ 2017లో డయాబెటీస్ చికిత్స కోసం ఇంజెక్ట్ చేయదగినదిగా ఈ మందులను మొదట ఆమోదించింది. తర్వాత, 2021లో ఊబకాయం చికిత్సకు ఓజెంపిక్ అధిక మోతాదుతో కూడిన ఔషధం ఆమోదించబడింది. అప్పటి నుంచి, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. అక్టోబర్ 2022లో ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ దృఢంగా, ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటని అడిగినప్పుడు వైగోవి బ్రాండ్ పేరుతో విక్రయించే ఓజెంపిక్ కలిగిన డ్రగ్ తీసుకుంటున్నట్లు చెప్పాడు. ప్రముఖ నటీనటులు, నిర్మాతలు ఈ డ్రగ్స్‌ గురించి మాట్లాడుకున్నట్లు ఒక న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. దీనిపై యుఎస్‌‌కు చెందిన ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ దిశా నారంగ్ దీనిపై స్పందిస్తూ.. ఓజెంపిక్‌పై ప్రజల్లో ఆసక్తి పెరిగిందన్నారు. ఆ మందును సూచించే వైద్యులను కనుగొనడం ప్రారంభించారు. అలాగే ఆన్‌లైన్‌లో ఓజెంపిక్‌  వెతకడం ప్రారంభించారని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
New Kia Seltos: అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
Dhandoraa OTT : ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Unbreakable Cricket Records : క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
Embed widget