అన్వేషించండి

Russia Sanctions Bill: భారత్‌పై సుంకాల కత్తి.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ఆమోదం

Russia Sanctions Bill: రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం సుంకాలు విధించేందుకు ఈ చట్టం అధ్యక్షుడు ట్రంప్ నకు అధికారం ఇస్తుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇంధన సేకరణ జాతీయ ప్రయోజనాలపై ఆధారపడుతుందని భారత్ స్పష్టం చేసింది.

Russia Sanctions Bill: భారత్‌పై మరోసారి అమెరికా సుంకాల కత్తి వేలాడుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలు విధించేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమైంది. అమెరికా ప్రతినిధుల సభ రష్యాపై ఆంక్షల బిల్లును 262-159 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఈ బిల్లు.. రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే ఐదు అగ్ర దేశాలపై 100% వరకు సుంకాలు విధించే అధికారాన్ని ట్రంప్ ప్రభుత్వానికి కల్పిస్తుంది. అధికారికంగా 'లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026'గా పిలిచే ఈ బిల్లు చైనా, స్లోవేకియా, హంగరీ, అజర్‌బైజాన్‌లను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బిల్లుకు సెనేట్‌లో భారీ మెజారిటీ లభించింది. అంటే ఇప్పుడు ఇది చట్టంగా మారడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కోసం ఆయన వద్దకు వెళ్లనుంది.  

మధ్యంతర ఎన్నికల వేళ 

మెజారిటీ రిపబ్లికన్ పార్టీ సభ్యులు ఈ వివాదాస్పద బిల్లును ఓటింగ్‌కు తీసుకురావడంతో.. ఆమోదం పొందింది. నవంబర్‌లో జరగబోయే కీలక మధ్యంతర ఎన్నికలకు ముందు, సుంకాలు విధించేందుకు అధ్యక్షుడు ట్రంప్‌కు మరింత అధికారం ఇవ్వడంపై రిపబ్లికన్, ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీల మధ్య విభేదాలు నెలకొన్నాయి.  కేవలం వారం క్రితం వరకు ఈ బిల్లుపై ఏ నిర్ణయం తీసుకోలేదు. సోమవారం హౌస్ రూల్స్ కమిటీ ఒక కీలకమైన అడ్డంకిని తొలగించి, ఈ బిల్లును ఓటింగ్‌కు తీసుకొచ్చింది. ఈ వారం బిల్లు ఆమోదం దిశగా వేగంగా ముందుకు కదిలింది. మంగళవారం ఇద్దరు డెమోక్రటిక్ చట్టసభ్యులు రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా ఓటు వేయడంతో, ఆంక్షల బిల్లుపై బుధవారం ఫైనల్ ఓటింగ్‌కు 214-211 స్వల్ప తేడాతో ఆమోదం తెలిపింది. 

Also Read: మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?

యూరోపియన్ దేశాలకు మినహాయింపు

వాస్తవానికి రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై సుంకాలు విధించేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ను ఈ చట్టం విస్తృత అధికారులు కట్టబెట్టనుంది. అంతేకాకుండా, అమెరికా.. మిత్రదేశాలైన  యూరోపియన్ కంట్రీస్‌కు ఇవి  మినహాయింపు ఇస్తాయి. ఎందుకంటే ఆ దేశాలలో చాలా వరకు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని అమెరికా చెప్పుకొస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందడంలో ట్రంప్ వైట్ హౌస్ పాత్ర అస్పష్టంగానే ఉంది. అమెరికా కమాండర్-ఇన్-చీఫ్‌కు సుంకాల అధికారాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు కోరినప్పటికీ, ఈ బిల్లుకు అధ్యక్షుడు ట్రంప్ మద్దతు అంతమాత్రంగానే ఉందని గత నెలలో యూఎస్ రాయబారి సెర్గియో గోర్ పేర్కొన్నారు. అయితే, ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీకి చెందిన సభ్యులను ఈ చట్టానికి అనుకూలంగా ఓటు వేసేలా చేయడం ద్వారా, ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లడంలో వైట్ హౌస్ కీలక పాత్ర పోషించి ఉండొచ్చని యూఎస్ మీడియాలోని నివేదికలు చెబుతున్నాయి. 

Also Read: 241 మందితో వెళ్తున్న నౌక జావా సముద్రంలో అదృశ్యం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

భారత్ వైఖరి 

భారత్ ఇంధనాన్ని సమకూర్చుకునే విషయం జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. రష్యా ఆంక్షల బిల్లుకు సంబంధించిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విధంగా స్పందించారు. 

Also Read: బ్రిక్స్ వేదికగా భారత్ గ్లోబల్ సౌత్ గొంతుకగా, లీడర్‌గా ఎలా మారుతోంది ?

Frequently Asked Questions

రష్యా ఆంక్షల బిల్లు ఇప్పటికే చట్టంగా మారిందా?

లేదు, ఈ బిల్లు ప్రతినిధుల సభ మరియు సెనేట్‌లో ఆమోదం పొందింది. ఇది చట్టంగా మారడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కోసం వెళ్తుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Hot Stone Massage : హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Embed widget