అన్వేషించండి

Indonesia Ship Missing: 241 మందితో వెళ్తున్న నౌక జావా సముద్రంలో అదృశ్యం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

ఇండోనేషియాలో తూర్పు జావా నుంచి దక్షిణ కాళిమంతాన్‌కు 241 మందితో వెళ్తున్న నౌక ట్రాన్స్‌పోర్ట్ 8తో ఆదివారం తెల్లవారుజామున సంబంధం తెగిపోయింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇండోనేషియాలో 241 మంది ప్రయాణికులతో నౌకతో సంబంధాలు తెగిపోయాయి.
  • తూర్పు జావా నుంచి దక్షిణ కాళిమంతాన్‌కు నౌక ప్రయాణిస్తోంది.
  • ఆదివారం తెల్లవారుజామున సంబంధం తెగిపోగా, జావా సముద్రంలో ఆఖరి స్థానం.
  • ప్రతికూల వాతావరణం, భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.

ఇండోనేషియాలో విషాదం చోటుచేసుకుంది.  241 మంది ప్రయాణికులను తీసుకెళ్తున్న ఒక నౌక నావిగేషన్2తో సంబంధం తెగిపోవడంతో ఆదివారం భారీ స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అధికారుల ప్రకారం, వర్గో ట్రాన్స్‌పోర్ట్ 8 అనే నౌక తూర్పు జావా నుంచి దక్షిణ కాళిమంతాన్ ప్రావిన్స్ వైపు ప్రయాణిస్తోంది. ఈ సమయంలో జావా సముద్రంలో నౌకతో టెక్నికల్ లింక్ తెగిపోయింది. నౌక ఏమయ్యింది అని ఆందోళన నెలకొంది. ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం రాలేదు.

రాత్రి 2 రెండు గంటలకు నౌకతో తెగిన సంబంధం

దక్షిణ కాళిమంతాన్‌లోని బంజార్మాసిన్ సిటీలో ఉన్న రెస్క్యూ, రక్షణ కార్యాలయానికి ఆదివారం ఉదయం సుమారు 2 గంటలకు నౌకతో సంబంధం తెగిపోయినట్లు సమాచారం అందింది. సంబంధం తెగిపోయిన దాదాపు 2 గంటల తర్వాత ఈ ఘటన గురించి వారికి తెలిపారు. ఈ నౌక ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్స్‌లో రెండో అతిపెద్ద నగరం అయిన సురబాయా నుంచి బంజార్మాసిన్‌కు వెళ్తోందని అధికారులు తెలిపారు. దక్షిణ కాళిమంతాన్ రక్షణ కార్యాలయ అధినేత ఐ పుతు సుదాయనా వీడియో బ్రీఫింగ్‌లో మాట్లాడుతూ, నౌక ఆపరేటర్ అధికారులకు ఘటన గురించి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. నౌక ప్రతికూల వాతావరణంలో ప్రయాణించిందని ఆపరేటర్‌కు సమాచారం అందిందని చెప్పారు.

జావా సముద్రంలో లభించిన చివరి లోకేషన్

ప్రాథమిక సమాచారం ప్రకారం, నౌక చివరగా జావా సముద్రంలో బంజార్మాసిన్‌లోని ఒక పియర్ నుంచి సుమారు 148 కిలోమీటర్లు అంటే 92 మైళ్లు దూరంలో ఉందని గుర్తించారు. నౌక మానిఫెస్ట్ ప్రకారం, అందులో 241 మంది ప్రయాణికులు ఉన్నారు. నౌక ఆపరేటర్ పీటీ వర్గో యోయెల్ రిహీ కూడా సంబంధం తెగిపోయిన విషయాన్ని నిర్ధారించారు. కంపెనీ ప్రకారం, వర్గో ట్రాన్స్‌పోర్ట్ 8 శనివారం ఉదయం స్థానిక సమయం ప్రకారం 10:13 గంటలకు సురబాయా నుంచి బంజార్మాసిన్‌కు బయలుదేరింది.

చివరి లోకేషన్ వైపు వెళ్లిన రెస్క్యూ టీమ్స్

నౌక నావిగేషన్ లింక్ కోల్పోయిందని గురించి సమాచారం అందిన తర్వాత రెస్క్యూ టీంను బంజార్మాసిన్‌లోని బసిరిహ్ రెస్క్యూ, రక్షణ పియర్‌కు పంపారు. దీనితో పాటు ఒక నౌకను వర్గో ట్రాన్స్‌పోర్ట్ 8 అంచనా వేసిన చివరి తెలిసిన స్థానం వైపు పంపించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌ పర్యవేక్షిస్తున్న సుదాయనా మాట్లాడుతూ, నౌకలో భారీ సంఖ్యలో ప్రయాణికులు, సిబ్బంది ఉన్నందున అందుబాటులో ఉన్న మొత్తం సిబ్బంది, వనరులను సెర్చ్ ఆపరేషన్‌ కోసం వినియోగిస్తున్నామని తెలిపారు

 

Frequently Asked Questions

ఇండోనేషియాలో ఏ నౌకకు సంబంధించి విషాదం చోటుచేసుకుంది?

241 మంది ప్రయాణికులతో వెళ్తున్న వర్గో ట్రాన్స్‌పోర్ట్ 8 అనే నౌక జావా సముద్రంలో నావిగేషన్ సంబంధాన్ని కోల్పోయింది. దీనితో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.

వర్గో ట్రాన్స్‌పోర్ట్ 8 నౌక ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణిస్తోంది?

ఈ నౌక తూర్పు జావాలోని సురబాయా నుండి దక్షిణ కాళిమంతాన్‌లోని బంజార్మాసిన్‌కు వెళ్తోంది.

నౌకలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారు?

నౌక మానిఫెస్ట్ ప్రకారం, అందులో 241 మంది ప్రయాణికులు ఉన్నారు.

నౌకతో సంబంధం ఎప్పుడు తెగిపోయింది?

ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటలకు నౌకతో సంబంధం తెగిపోయినట్లు రెస్క్యూ కార్యాలయానికి సమాచారం అందింది.

నౌక చివరిగా ఎక్కడ గుర్తించబడింది?

ప్రాథమిక సమాచారం ప్రకారం, నౌక చివరిగా జావా సముద్రంలో బంజార్మాసిన్‌లోని ఒక పియర్ నుంచి 148 కిలోమీటర్లు దూరంలో ఉందని గుర్తించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Embed widget