(Source: ECI/ABP News/ABP Majha)
HIV Positive అని తెలిసినా, ఆ పనితో 200 మందికి అంటించేసిన మహిళ! బాధితులు గగ్గోలు
US Ohio Hooker: అమెరికాలోని మహిళ కొంప ముంచేసింది. తనకు HIV ఉందని తెలిసినా కూడా 200మందితో శృంగారంలో పాల్గొంది. ఆమె చేసిన పనితో స్థానిక అధికారులు హెల్త్ అలెర్ట్ జారీ చేయాల్సి వచ్చింది.
US Ohio HIV positive woman in contact with over 200 clients: అమెరికాలోని ఓ సెక్స్ వర్కర్ చేసిన పని అధికారులను కంగారు పెట్టింది. ఆ సెక్స్ వర్కర్ చేసిన నిర్వాకం వందలమందిని భయం గుప్పెట్లోకి నెట్టింది. తనకు HIV ఉందని తెలిసినప్పటికీ ఏకంగా 200 మందికి పైగా వ్యక్తులతో శృంగారంలో పాల్గొంది. ఆమె చేసిన పనికి స్థానిక వైద్యాధికారులు హడలిపోయారు. ఇప్పుడు వారి ద్వారా ఎంత మందికి HIV వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు.
హెచ్‌ఐవీ పరీక్షల్లో పాజిటివ్
OHIOలోని మరియెట్టా ప్రాంతానికి చెందిన లిండా లెచాసే ఓ సెక్స్ వర్కర్. ౩౦ ఏళ్ల లిండా కొన్నాళ్లుగా స్థానికంగా వ్యభిచారం చేస్తోంది. తన వృత్తిలో భాగంగా అనేక మందితో లైంగిక సంబంధాలు పెట్టుకుంది. అయితే 2022లో చేయించుకున్న పరీక్షల్లో ఆమెకు HIV ఉన్నట్లు తెలిసింది. అయినప్పటికీ లిండా తన వృత్తి మానలేదు. ఆ తర్వాత కూడా పలువురితో ఈ సంబంధాలను కొనసాగించింది. మొత్తం మీద 211 మంది ఆమెతో లైంగిక సంబంధం కొనసాగించినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఎంత మంది రక్షణ లేని శృంగారం చేశారో.. వారిలో ఎంత మందికి వ్యాధి సంక్రమించిందో తెలీదు. వారి ద్వారా ఎంత మందికి వస్తుందో అన్న ఆందోళన కూడా ఉంది. లిండాతో సంబంధం పెట్టుకున్న వారందరూ వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అధికారులు పబ్లిక్ హెల్త్ నోటీస్ జారీ చేశారు.
రెండున్నరేళ్లుగా ఎంతో మందితో గడుపుతూ..
తనకు వైరస్ సోకిందని తెలిసినప్పటికీ లిండా రెండున్నరేళ్లుగా యథేచ్చగా ఈ పనిచేసింది. మరియెట్టా.. ఓహియోకు ఈశాన్య ప్రాతంలో.. వర్జీనియా రాష్ట్ర సరిహద్దుకు దగ్గరలో ఉన్న చిన్న పట్టణం. ఓహియో, వర్జీనియా రెండు రాష్ట్రాలకు చెందిన వారూ.. లిండా క్లైయింట్లుగా ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యభిచార కార్యకలాపాలపై మే 13న లిండాను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. పరీక్షల్లో ఆమెకు HIV ఉన్నట్లు కనుక్కున్నారు. అయితే ఈ విషయం లిండాకు ముందే తెలిసి కూడా తన వృత్తిని కొనసాగించిందని తెలుసుకుని పోలీసులు నిర్ఘాంతపోయారు.
లిండాతో సంబంధం ఉన్న వారు నిజాయతీగా స్థానిక వైద్యాధికారులను పోలీసులను సంప్రదించాలని... వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ప్రస్తుతం వైద్య పరంగా ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ ప్రజలను అప్రమత్తం చేయడం కోసం ఈ విషయాన్ని బహిరంగ పరిచామని.. ఆమెతో సంబంధం ఉన్నవారంతా వచ్చి సహకరించారలని అధికారులు కోరుతున్నారు.