అన్వేషించండి

Donald Trump on Pope Leo: పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అణ్వాయుధాలను వ్యతిరేకించరు.. ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్

Donald Trump | ఇరాన్‌తో వివాదం మధ్యలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యాథలిక్ పోప్ లియోపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. నేరాలు, అణ్వాయుధాల విషయంలో లియో తీరు తనకు నచ్చడం లేదని ఆయన పేర్కొన్నారు.

వాషింగ్టన్: అమెరికా- ఇరాన్ మధ్య ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చలు విఫలం కావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేయబోతున్నారని పలు దేశాల్లో ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ తాజాగా క్యాథలిక్ పోప్ లియో (Pope Leo XIV)ను టార్గెట్ చేసుకున్నారు. పోప్‌పై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కుతూ, నేరాలకు వ్యతిరేకమైన విషయంలో ఆయన చాలా వీక్ అని విమర్శించారు. ఆయనకు నేరాలంటే చాలా ఇష్టమని, అందుకు ఇరాన్ అణ్వాయుధ ప్రక్రియను వ్యతిరేకించడం లేదంటూ మండిపడ్డారు. పోప్ లియో నేరాల విషయంలోనే కాకుండా, విదేశాంగ విధానం పరంగా కూడా చాలా బలహీనంగా ఉన్నారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

ట్రంప్ పరిపాలన పట్ల భయం గురించి పోప్ మాట్లాడుతున్నారు. కానీ కోవిడ్ సమయంలో క్యాథలిక్ చర్చిలు, క్రైస్తవ సంస్థలు అనుభవించిన భయం గురించి పోప్ లియో ప్రస్తావించడం లేదని ట్రంప్ అన్నారు. చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించినందుకు, బయట 10-20 అడుగుల దూరం పాటించినప్పటికీ పాస్టర్లు, మంత్రులు, ఇతరులను అరెస్టు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ట్రంప్ గుర్తు చేశారు.

పోప్ సోదరుడంటే అమెరికా అధ్యక్షుడికి ఇష్టం
‘నాకు పోప్ లియో) సోదరుడు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే లూయిస్ పూర్తిగా MAGA (Make America Great Again) మద్దతుదారుడు. లూయిస్‌కు విషయాలు బాగా అర్థమవుతాయి. కానీ లియోకు ముఖ్యమైన విషయాలు సైతం అర్థం కావు. ఇరాన్ వద్ద అణు ఆయుధాలు ఉండటాన్ని సమర్థించే పోప్ నాకు అవసరం లేదు. నేరాలంటే ఇష్టపడే వ్యక్తి పోప్‌గా ఉండకూడదు. వెనిజులాపై అమెరికా దాడి చేయడం తప్పని భావించే పోప్ నాకు వద్దు. వెనిజులా భారీ మొత్తంలో డ్రగ్స్‌ను అమెరికా దేశానికి పంపిస్తోంది. వెనిజులా అక్కడి ఖైదీలను, హంతకులను, డ్రగ్ డీలర్లను అమెరికాలోకి పంపిస్తోందని’ ట్రంప్ పేర్కొన్నారు.

పోప్ లియో గురించి ట్రంప్ ఏమన్నారు?
పోప్ లియో తమ పట్ల కృతజ్ఞతతో ఉండాలని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. పోప్ అయ్యే జాబితాలో ఆయన పేరు ఎక్కడా లేదని, ఆయన ఒక అమెరికన్ కాబట్టే చర్చి ఆయనను పోప్‌గా ఎంపిక చేసిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాను వైట్ హౌస్‌లో లేకపోయి ఉంటే, లియో వాటికన్‌లో ఉండేవారు కాదని పేర్కొన్నారు. 

పోప్ లియో XIV తన బాధ్యతలు సరిగ్గా నిర్వహిస్తున్నారని అనుకోవడం లేదు. పరిస్థితి గమనిస్తే ఆయనకు నేరాలంటే ఇష్టం అనిపిస్తోంది. అణు ఆయుధాలు కలిగి ఉండటం సరైనదేనని  చెప్పే పోప్ మాకు అక్కర్లేదు. నేరాలు పెరిగినా పర్వాలేదని చెప్పే పోప్ మాకు వద్దు. అంటి పోప్ నాకు ఎన్నటికీ నచ్చరు. నేను పోప్ లియోకు అభిమానిని కాదు. ఆయన చాలా ఉదారవాద వ్యక్తి. నేరాలను అదుపు చేయాలని భావించని మనిషి ఆయన. ప్రపంచాన్ని నాశనం చేయడానికి అణ్వాయుధాలు కావాలనుకునే దేశంతో మనం పోరాటం చేయకూడదని ఆయన భావిస్తున్నారు. అందుకే నాకు పోప్ లియో అంటే ఇష్టం లేదు’ అని వ్యాఖ్యానించారు.

లియో ఒబామా మద్దతుదారుడైన డేవిడ్ ఆక్సెల్‌రోడ్‌ను కలవడం కూడా నచ్చలేదని ట్రంప్ అన్నారు. ఆక్సెల్‌రోడ్ ఒక ఓడిన వామపక్షవాది అని, ఆయన చర్చికి వెళ్లేవారిని, పాస్టర్లను అరెస్టు చేయాలని కోరుకునే వ్యక్తి అని విమర్శించారు. లియో తీవ్ర వామపక్షవాదులను సంతోషపెట్టడానికి బదులుగా, ఒక గొప్ప పోప్‌గా ఉండటంపై ఫోకస్ చేయాలని ట్రంప్ సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget