US Iran War: ఇరాన్ చేతికి అణ్వాయుధాలు ఎన్నటికీ రావు.. త్వరలోనే హర్మూజ్ తెరుచుకుంటుంది: డొనాల్డ్ ట్రంప్
Donald Trump | ఇరాన్ తో జరిగిన చర్చలు విఫలం కావడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ చేతికి అణ్వాయుధాలు రాకుండా చూస్తామన్న ట్రంప్.. త్వరలోనే హర్మూజ్ తెరిపిస్తాం అన్నారు.

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధాన్ని ముగించేందుకు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. పాకిస్తాన్ ఆతిథ్యంలో సుమారు 21 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చల్లో ఎలాంటి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ తన అణు ఆకాంక్షలను వదులుకోవడానికి నిరాకరించడమే ఈ వైఫల్యానికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా 'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ స్పందించారు. ఇరాన్‌కు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. చర్చల సమయంలో ఇతర అంశాలపై కొంత పురోగతి ఉన్నప్పటికీ, అణ్వాయుధాల విషయంలో ఇరాన్ పట్టువీడలేదు. అస్థిరమైన, ఊహించని వ్యక్తుల చేతుల్లోకి అణు శక్తి వెళ్లడం ప్రపంచానికే ప్రమాదకరం. తన ప్రతినిధులు ఇరాన్ నేతలతో గౌరవప్రదంగా వ్యవహరించినప్పటికీ, కీలక అంశంలో రాజీ లేదు. ఇరాన్ వద్ద ఎప్పటికీ అణ్వాయుధాలు ఉండబోవు. సైనిక చర్యల కంటే చర్చలు మెరుగైనవే అయినప్పటికీ, అణు భద్రత విషయంలో వెనక్కి తగ్గేది లేదని’ ట్రంప్ స్పష్టం చేశారు.
ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చల్లో ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదరకపోవడంతో ట్రంప్ ఇప్పుడు ఏం చేయబోతున్నారని చర్చ మొదలైంది. ఆయన హర్మూజ్ జలసంధిపై పెద్ద యాక్షన్ ప్లాన్ గురించి చెప్పారు. హర్మూజ్‌ను తెరుస్తానని వాగ్దానం చేశాను. కానీ అలా చేయడంలో విఫలమయ్యాను. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు, పలు దేశాలలో ఆందోళన, గందరగోళం నెలకొన్నాయని డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇరాన్ ఆ నీటిలో మందుపాతరలు పెట్టామని చెబుతున్నారని, అయితే వారి మొత్తం నౌకాదళం, వారి మైన్‌లేయర్‌లలో ఎక్కువ భాగం పూర్తిగా నాశనం చేశామన్నారు.
ఇరాన్ ప్రతిష్టకు చెడ్డ పేరు
హర్మూజ్ విషయంలో ఇరాన్ వైఖరి ఆ దేశ ప్రతిష్టకు చాలా పెద్ద చెడ్డ పేరు తెచ్చిపెట్టిందని, శాశ్వతంగా నష్టం కలిగించిందని ట్రంప్ అన్నారు. ఇరాన్ నేతలకు సైతం చెడ్డ పేరు వచ్చింది. కానీ ఇప్పుడు మనం అన్ని దాటి ప్రయత్నిస్తున్నాం. వాగ్దానం చేసినట్లుగా, వీలైనంత త్వరగా ఈ హర్మూజ్ జలమార్గం తెరిచే ప్రక్రియను ప్రారంభించడం మంచిదన్నారు.
వారు అన్ని చట్టాలను ఉల్లంఘిస్తున్నారు
ఇరాన్ నేతలు ప్రతి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఇది ఎవరూ సహించరని అన్నారు. ఇస్లామాబాద్‌లో పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సమర్థవంతమైన నాయకత్వంలో జరిగిన సమావేశం గురించి ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ నాకు పూర్తి సమాచారం అందించారని ట్రంప్ తెలిపారు. వీరు చాలా అసాధారణమైన వ్యక్తులు. భారత్, పాక్ యుద్ధంలో 3 నుండి 5 కోట్ల మంది ప్రాణాలను కాపాడినందుకు వారు నిరంతరం నాకు కృతజ్ఞతలు చెబుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















