Dallas Brutal Murder: డల్లాస్‌లో దారుణం.. భార్య, కుమారుడి ముందే భారతీయుడి తల నరికివేత
Dallas Murder: డల్లాస్‌లో భారతీయుడు చంద్రమౌళి నాగమల్లయ్య దారుణ హత్యకు గురయ్యాడు Yardanis Cobos Martinez అనే క్యూబన్ వ్యక్తి, నాగమల్లయ్య భార్యా బిడ్డల ముందే అతనిని కత్తితో నరికి తలను వేరు చేశాడు..

యుఎస్‌లోని డల్లాస్ అత్యంత కిరాతకమైన హత్య జరిగింది. స్థానికంగా ఉండే భారతీయుడు చంద్రమౌళి నాగమల్లయ్యను (Chandramouli Nagamallaih) 50 అతని వద్ద పనిచేసే వ్యక్తి దారుణంగా చంపేశాడు. డల్లాస్ లోకల్ టైమ్ ప్రకారం సెప్టెంబర్ 10 బుధవారం ఉదయం 9.30 గంటలకు ( భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 8PM) ఈ దుర్ఘటన జరిగింది. పదునైన కత్తితో నరికేయడంతో 50ఏళ్ల భారతీయుడైన చంద్రమౌళి తల తెగిపడిందని డల్లాస్ పోలీసులు రిపోర్ట్ చేశారు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడం ఈ హత్యకు కారణమని చెప్పారు. హత్యకు గురైన చంద్రమౌళి నాగమల్లయ్య కర్ణాటకకు చెందిన వాడు. చాలా కాలంగా యుఎస్‌లో స్థిరపడ్డారు. డల్లాస్ డౌన్‌టౌన్‌లోని ఓ మోటెల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అదే మోటల్‌లో పనిచేసే 37ఏళ్ల Yardanis Cobos Martinez అనే క్యూబన్ వ్యక్తి హత్య చేశాడు.
భార్యా బిడ్డల ముందే దారుణ ఘటన
చంద్రమౌళి ఈ హోటల్‌లో చాలా కాలంగా మేనేజర్ గా పనిచేస్తున్నారు. అందరూ స్థానికంగా అతన్ని Bob అని పిలుస్తుంటారు. Bob కు స్థానికంగా సౌమ్యుడు అనే పేరుంది. అదే మోటల్‌లో Yardanis Cobos Martinez కూడా వర్క్ చేస్తున్నాడు. అయితే దుర్ఘటన జరిగిన రోజు ఇద్దరి మధ్యా వాగ్వాదం ఈ హత్యకు దారితీసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారని CBC TV రిపోర్ట్ చేసింది. మోటల్ ఉద్యోగులు, భార్యాబిడ్డల ముందే ఈ ఘోరమైన ఘటన జరిగినట్లు చెప్పారు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కోపంతో రగిలిపోయిన మార్టినెజ్ ఓ పెద్ద కత్తిని తీసుకుని చంద్రమౌళిని చంపడానికి వచ్చాడు. అతను తప్పించుకునేందుకు పరిగెత్తినా వదల్లేదు. చంద్రమౌళి సమీపంలోని స్టాఫ్ క్వార్టర్స్ వద్దకు వెళ్లాడు. అక్కడ అతని భార్య, 18 ఏళ్ల కొడుకు ముందే మార్టినెజ్ విచక్షణారహితంగా నరికేశాడు. వాళ్లిద్దరూ అడ్డుపడినా.. వాళ్లని పక్కకి నెట్టి చంపేశాడు. ఆ తర్వాత అని తలను వేరు చేశాడు. ఎంత కిరాతకంగా వ్యవహరించాడంటే.. తలను వేరు చేసి.. ఆ తర్వాత దానిని కాలితో తన్నాడు.. నాగమల్లయ్య దగ్గర సెల్‌ఫోన్, కీ కార్డ్ తీసుని.. ఆ తర్వాత ఆ తలను తీసుకెళ్లి డస్ట్‌బిన్‌లో వేశాడు. హత్య జరిగిన ప్రాంతం భయానకంగా మారింది. పోలీసులు ఆ ప్రదేశాన్ని సీజ్ చేశారు.
నేరుగా మాట్లాడలేదని నరికేశాడు
చంద్రమౌళి తనతో నేరుగా మాట్లాడనందుకు చంపేశాడని.. హత్యకు దారితీసిన పరిస్థితులపై Fox TV రిపోర్ట్ చేసింది. బుధవారం ఉదయం మార్టినెజ్, మరో మహిళ రూమ్ శుభ్రం చేస్తుండగా.. చంద్రమౌళి వచ్చి పాడైపోయిన వాషింగ్ మెషిన్ వాడొద్దు అని మార్టినెజ్‌కు చెప్పారు. అయితే అతనితో ఆ విషయం నేరుగా చెప్పకుండా.. ఈ మహిళను ట్రాన్సలేట్ చేసి అతనికి చెప్పాలని సూచించారు. తనతో నేరుగా మాట్లాకుండా మరో మహిళతో ఆదేశాలు ఇప్పించడంతో మార్టినెజ్ రగిలిపోయాడు కత్తి తీసుకొచ్చి.. వెంటాడి మరీ నరికేశాడు. ఆ తర్వాత కొంత సేపటికి పోలీసులు Martinezను అరెస్ట్ చేశారు.
మార్టినెజ్‌ది నేర చరిత్ర.. ఇప్పటికే హత్యకేసు
Cobos Martinez కు చాలా పెద్ద నేరచరిత్రే ఉంది. ఇప్పటికే హత్య కేసులో జైలుకు వెళ్లొచ్చాడు. అతని ఇమిగ్రేషన్ కూడా నిలుపుదల చేశారు. 2017లో కారులో నగ్నంగా వెళుతూ .. ఓ మహిళను కారు లోపలకు లాక్కునేందుకు ప్రయత్నించాడు. అందుకు ఏడాదిన్నర జైలు శిక్ష అనుభవించాడు. చిన్నపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసు కూడా ఉంది. తీవ్రమైన నేర స్వభావం, మానసిక స్థితి ఉన్న ఇతను విపరీతంగా ప్రవర్తిస్తాడు. అందుకే చిన్న వాగ్వాదానికే తల నరికి పక్కన పెట్టాడు. చంద్రమౌళి దారుణ హత్యకు గురికావడంపై ఇండియన్ కాన్సులేట్ స్పందించింది. వారి కుటుంబంతో మాట్లాడుతున్నామని అవసరమైన సాయాన్ని అందిస్తున్నామని చెప్పింది.





















