అన్వేషించండి

Turkey Earthquake: భూకంపం వస్తుందని ముందుగానే చెప్పిన పరిశోధకుడు - ఎగతాళి చేసిన నెటిజన్లు

Turkey Syria Earthquake: టర్కీలో తీవ్ర భూకంపం రాబోతుందని పరిశోధకులు ముందుగానే ప్రకటించినప్పటికీ ప్రజలంతా ఎగతాళి చేయడంతోనే భారీ ప్రాణ నష్టం జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

Turkey Syria Earthquake: సోమవారం టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం కారణంగా ఇప్పటి వరకు 4500 మందికిపైగా ప్రజలు మరణించగా.. 14 వేల మందికిపైగా గాయపడ్డారు. అయితే ఇంతటి విపత్తును పరిశోధకులు ముందుగానే అంచనా వేయలేదా అని చాలా మందికి అనుమానం కల్గి ట్విట్టర్ లో వెతకగా.. ఈ ట్వీట్ వెలుగులోకి వచ్చింది. భూకంపం రావడానికి మూడ్రోజుల ముందే భారీ భూకంపం రాబోతున్నట్లు ప్రకటించిన ఓ ట్వీట్ కనిపించింది.

భూకంపాలను  అధ్యయనం చేసే సోలార్ సిస్టమ్ జామెట్రీ సర్వే (SSGEOS) పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్‌ బీట్స్ మూడు రోజుల ముందుగానే ట్విట్టర్‌లో ఈ రోజు కాకపోతే రేపు తీవ్ర భూకంపం వస్తుందని చెప్పారు. దక్షిణ మధ్య టర్కీ (టర్కీ), జోర్డాన్, సిరియా  లెబనాన్ ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం వస్తుందంటూ ట్వీట్ చేశారు. అయితే ఆయన చేసిన ఈ ట్వీట్‌ను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. అంతేకాదండోయ్ విపరీతంగా ఎగతాళి కూడా చేశారు. మీరు చెప్పేవన్నీ అవాస్తవాలే అంటూ కామెంట్లు చేశారు. మీరు గతంలో ప్రకటించిన ఏ ఒక్క అంచనా కూడా నిజం కాలేదంటూ వెక్కిరించారు. 

రెండో రోజు కూడా ప్రజలను అప్రమత్తం చేసిన ఫ్రాంక్ హూగర్‌ బీట్స్ 

ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సోమవారం భూకంపం సంభవించిన తర్వాత ఫ్రాంక్ హూగర్‌ బీట్స్ తన పరిశోధనా సంస్థ ఎస్ఎస్జీఈఓఎస్ చేసిన పోస్ట్‌ను రీట్వీట్ చేశారు. ఇందులో మరోసారి భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని వివరించారు. ఈ ట్వీట్ చేసిన మూడు గంటల తర్వాత టర్కీలో రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. అటువంటి పరిస్థితిలో హూగర్‌ బీట్స్ రెండో అంచనా కూడా నిజమని నిరూపితమైంది.  

ప్రమాదం తర్వాత సంతాపం వ్యక్తం చేసిన హూగర్ బీట్స్

భారీ భూకంపం వచ్చి వేలాది మంది మృతి చెందడం, వందలాది భవనాలు పేక మేడల్లా కూలిపోవడం చూసిన హూగర్ బీట్స్.. ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. “సెంట్రల్ టర్కీలో సంభవించిన భారీ భూకంపం వల్ల ప్రభావితమైన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి. 115, 526 సంవత్సరాల తరహాలోనే ఈ ప్రాంతంలో కూడా భూకంపం వస్తుందని ముందే చెప్పాను. "

గేళీ చేసిన నెటిజెన్లు..!

మూడు రోజుల క్రితం భూకంపం వస్తుందని హూగర్ బీట్స్ ట్వీట్ చేసినప్పుడు నెటిజెన్లు ఆయనను ఎగతాళి చేసారు. కొంతమంది అతని అంచనాల గురించి కూడా తీవ్ర విమర్శలు చేశారు. హూగర్ బీట్స్ లెక్కల ఆధారంగా భూకంపాలను అంచనాలు వేస్తున్నారని.. చాలా వరకు అవన్నీ తప్పుడు అంచనాలే అని ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు. "భూకంప శాస్త్రవేత్తలు తమ పనిని తప్పు దారి పట్టించే, తప్పుడు అంచనాలు చేయడం, భూకంపాలను అంచనా వేయడానికి కచ్చితమైన మార్గం కూడా వారి దగ్గర లేదంటూ" మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
Cockfight: కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
Rayudu Vs Kohli: రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Haimendorf Museum Tour Marlawai | గిరిజనుల పాలిట దేవుడు హైమన్ డార్ఫ్ జీవిత ప్రయాణం ఒకచోటే | ABPKhanapur MLA Vedma Bojju Interview | Haimendorf చేసిన సేవలు ఎన్ని తరాలైన మర్చిపోలేం | ABP DesamSobhan Babu Statue In Village | చిన నందిగామ లో శోభన్ బాబుకు చిన్న విగ్రహం పెట్టుకోలేమా.? | ABP DesamAjith Kumar Team Wins in 24H Dubai Race | దుబాయ్ కార్ రేసులో గెలిచిన అజిత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ - సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా దేవాన్ష్, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
Cockfight: కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
కోళ్ల పందెంలో గెలిస్తే విజేతకు మహేంద్ర థార్ - పందెల బరులకు వెళ్లిన రఘురామ, గంటా
Rayudu Vs Kohli: రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
రాయుడుని సాగనంపింది కోహ్లీనే.. తనకిష్టం లేదని ప్రపంచ కప్ నుంచి ఔట్.. త్రీడీ ప్లేయర్ వివాదంపై మాజీ క్రికెటర్ సరికొత్త వాదన
Viral Video: రూ.10 కోసం ఇంత దారుణమా? - విశ్రాంత ఐఏఎస్‌పై బస్ కండక్టర్ దాడి, వైరల్ వీడియో
రూ.10 కోసం ఇంత దారుణమా? - విశ్రాంత ఐఏఎస్‌పై బస్ కండక్టర్ దాడి, వైరల్ వీడియో
Kumbh mela: గత జన్మలో భారత్‌లో పుట్టానేమో- కుంభమేళాలో విదేశీ భక్తురాలి ఆసక్తికర వ్యాఖ్యలు
గత జన్మలో భారత్‌లో పుట్టానేమో- కుంభమేళాలో విదేశీ భక్తురాలి ఆసక్తికర వ్యాఖ్యలు
TTD News: 'సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు నమ్మొద్దు' - సమన్వయ లోపం ప్రచారం ఖండించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
'సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు నమ్మొద్దు' - సమన్వయ లోపం ప్రచారం ఖండించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
Sobhan Babu Birthday: సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?
సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?
Embed widget