Turkey Earthquake: టర్కీలో మరో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.4గా నమోదు - వణికిపోతున్న ప్రజలు
6.4 magnitude Earthquake hits southern Turkey: వరుస భూకంపాలతో వేలాదిగా ప్రాణ నష్టం సంభవించిన టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైందనట్లు అధికారులు తెలిపారు.
6.4 magnitude Earthquake hits southern Turkey: వరుస భూకంపాలతో వేలాదిగా ప్రాణ నష్టం సంభవించిన టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. సోమవారం (ఫిబ్రవరి 20)న టర్కీ - సిరియా దేశాల సరిహద్దులో మరోసారి పలుచోట్ల భూమి కంపించింది. అయితే రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైందనట్లు అధికారులు తెలిపారు. తీవ్రత 6కు మించి ఉండటంతో, తాజా భూకంపం కారణంగా దక్షిణ టర్కీలో మరింత ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
లటాకియాలో రెండుసార్లు దాదాపు 10 సెకన్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. భూకంప సమయంలో కొందరు ప్రజలు ఇండ్లు, హోటల్, భవనాల నుంచి ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. అంటాక్యాలో భూకంపం తర్వాత మరిన్ని భవనాలు కూలిపోయాయి.
A magnitude 6.3 earthquake at a depth of two km (1.2 miles) struck the Turkey-Syria border region, the European Mediterranean Seismological Centre (EMSC) said: Reuters
— ANI (@ANI) February 20, 2023
అంటాక్యా రెండు వారాల కిందట వరుస భూకంపాల బారిన పడింది. భవనాలు కుప్పకూలడంతో వాటి శిథిలాల కింద చిక్కుకుని చిన్నారులు, మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భూకంపం సంభవించినప్పుడు తాను అంటక్యా నగరంలోని ఒక పార్కులో ఒక టెంట్ కింద ఉన్నానని ఓ ప్రత్యక్ష సాక్షి రాయిటర్స్ కు తెలిపారు. భూకంపం సంభవించిన తర్వాత టర్కీ రెస్క్యూ టీమ్స్ వెళ్తుండగా చూసినట్లు మునా అల్ ఒమర్ చెప్పారు.
వణికిస్తున్న వరుస భూకంపాలు..
ఫిబ్రవరి 6న టర్కీ, పొరుగున ఉన్న సిరియా ఆగ్నేయ ప్రాంతంలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ వరుస భూకంపాలతో 45,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పది లక్షల మంది నిరాశ్రయలు అయ్యారు. తాజాగా ఆరుకు పైగా తీవ్రతతో దక్షిణ టర్కీలో భూ ప్రకంపనలు రావడంతో మిగిలిన ఇళ్లు కూలిపోయే అవకాశం ఉంది. టర్కీలో భూకంప బాధితుల మరణాల సంఖ్య మరింత పెరుగుతాయని స్థానికుల్లో భయాందోళన నెలకొంది. భూకంపం సంభవించిన టర్కీ, సిరియాలో 'ఆపరేషన్ దోస్త్'లో పాల్గొన్న భారత సైనికులతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమావేశయ్యారు. సహాయ, విపత్తు సహాయక బృందాల పనిని ప్రధాని మోదీ అభినందించారు.
భూకంప ధాటికి చెల్లాచెదురైన టర్కీకి పెద్ద ఎత్తున సాయం అందిస్తోంది భారత్. ఆపరేషన్ దోస్త్ పేరిట సహాయక చర్యల్లో పాల్గొంటోంది. NDRF బృందాలు అక్కడి రెస్క్యూ ఆపరేషన్‌కు సహకరిస్తున్నాయి. దీనిపై టర్కీ పౌరులు సంతోషం వ్యక్తం చేశారు. భారత్‌కు థాంక్స్ చెప్పారు. భారత్ నుంచి NDRFబృందాలు వచ్చి తమకు ఎంతో సాయం చేస్తున్నాయని, అండగా ఉంటున్నారని ఆనందంగా చెప్పారు.
"ఇప్పుడే ఇండియా నుంచి సహాయక బృందాలు వచ్చాయి. మాకు ఎంతో సాయ చేశాయి. మేం ఒంటరిగా మిగిలిపోతామేమో అని భయపడ్డాం. కానీ వీళ్లు వచ్చాక మాకు దైర్యం వచ్చింది. మీ మద్దతు మేమెప్పటికీ రుణపడి ఉంటాం. థాంక్యూ. గాడ్ బ్లెస్ యూ." -టర్కీ పౌరులు