Charlie Kirk Shot Dead : ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య- మాస్ కాల్పులపై మాట్లాడుతున్న టైంలో ఘటన
Charlie Kirk Shot Dead : ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. దీంతో అమెరికాలో సంతాప దినంగా ట్రంప్ ప్రకటించారు. జాతీయ జెండా అవనతం చేశారు.

Charlie Kirk Shot Dead : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, రైట్ వింగ్ కార్యకర్త చార్లీ కిర్క్ గురువారం నాడు హత్యకు గురయ్యారు. ఓ యూనివర్సిటీ ప్రోగ్రామ్‌లో పాల్గొని అమెరికాలో పెరిగిపోతున్న కాల్పుల ఘటనపై మాట్లాడుతుండగానే దుండగులు కాల్చేశారు. చార్లీ కిర్క్ హత్యపై అధ్యక్షుడు ట్రంప్ సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ ఘటన గురించి ఆయన స్వయంగా సమాచారం అందించారు. కిర్క్ మృతికి అమెరికాలో సంతాప దినాన్ని ప్రకటించారు.
కిర్క్ యూటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళాడు. ఈ సమయంలో, ఆయన ఒక శిబిరంలో మైక్ పట్టుకుని మాట్లాడుతుండగా, ఒక వ్యక్తి అతనిపై కాల్పులు జరిపాడు. కిర్క్ గొంతులోకి బుల్లెట్ తగిలింది. బుల్లెట్ తగలగానే కిర్క్ కిందపడిపోయాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు, కాని అప్పటికే కిర్క్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
US President Donald Trump posts, "In honour of Charlie Kirk, a truly Great American Patriot, I am ordering all American flags throughout the United States lowered to half mast until Sunday evening at 6 P.M." https://t.co/nL2iQNRts3 pic.twitter.com/U4oSyAuY8E
— ANI (@ANI) September 10, 2025
కాల్పులు జరపడానికి కొన్ని సెకన్ల ముందు, ప్రేక్షకుల నుంచి ఒక సభ్యుడు, “గత 10 సంవత్సరాలలో ఎంత మంది ట్రాన్స్‌జెండర్ అమెరికన్లు మాస్ షూటర్లుగా ఉన్నారో మీకు తెలుసా?” అని అడిగాడు. “చాలా ఎక్కువ మంది.” అని కిర్క్ సమాధానం ఇచ్చాడు.
అదే వ్యక్తి మరో ప్రశ్న సంధించాడు. “గత 10 సంవత్సరాలలో అమెరికాలో ఎంత మంది మాస్ షూటర్లు తయారయ్యారో మీకు తెలుసా?”
కిర్క్ ఇలా సమాధానమిచ్చాడు: “ముఠా హింసను లెక్కించాలా లేదా లెక్కించకూడదా?” అని సమాధానం పూర్తి అయ్యేలోపు తుపాకీ కాల్పుల జరిగాయి. వెంటనే కిర్క్ కిందపడిపోయారు.
విశ్వవిద్యాలయ ప్రాంగణంలో గందరగోళం
కిర్క్ తన మెడను పట్టుకుని ఉన్నట్లు ఆ వీడియోలో ఉంది. రక్తం కారుతోంది, భయాందోళనకు గురైన విద్యార్థులు కేకలు వేస్తూ పరుగులు తీయడం కనిపిస్తోంది. ఎమర్జెన్సీ సిబ్బంది సకాలంలో అక్కడకు చేరుకొని చికిత్స అందించినప్పటికీ కిర్క్ మృతి చెందారు.
కిర్క్ ప్రసంగం వినడానికి వేల మంది అక్కడకు వచ్చారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయినా సరే నిండు సభ సాక్షింగా కాల్పులు జరిగాయి. కిర్క్ ప్రసంగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులతో విశ్వవిద్యాలయ పూర్తిగా నిండిపోయింది. ఇలాంటి పరిస్థితిలో కాల్పులు జరగడం భయాందోళనలకు గురిచేసింది.
కిర్క్ 'అమెరికా యువత గుండె చప్పుడుగా' ట్రంప్ అభివర్ణించి సంతాపం వ్యక్తం చేశారు. కిర్క్ మరణ వార్తను డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. ఆయన తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో భావోద్వేగ నివాళి అర్పించారు. “గొప్ప, లెజెండరీ, చార్లీ కిర్క్ మరణించాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చార్లీ కంటే ఎవరూ యువకుల హృదయాన్ని బాగా అర్థం చేసుకోలేదు. ఆయనను అందరూ, ముఖ్యంగా నేను ప్రేమించాను, ఆరాధించాను. ఇప్పుడు ఆయన మనతో లేరు.”
తరువాత న్యూయార్క్ పోస్ట్‌తో మాట్లాడుతూ, ట్రంప్ కిర్క్‌ను "నాకు చాలా చాలా మంచి స్నేహితుడు, అద్భుతమైన వ్యక్తి" అని అభివర్ణించారు.





















