Top 5 Earthquakes In World: ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన 5 అతిపెద్ద భూకంపాలు ఇవే
Biggest Earthquakes In World: రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు భూమి కంపించింది. అయితే పెద్దగా ఆస్థి, ప్రాణ నష్టం జరగలేదు. ఈ సందర్భంగా ప్రపంచంలో సంభవించిన అతి పెద్ద ఐదు భూకంపాల వివరాలు ఇలా ఉన్నాయి.
5 biggest earthquakes in the world | భూమి పొరల్లో సంభవించే ఒత్తిడి వల్ల భూకంపాలు సంభిస్తాయి. దీని వల్ల ఆస్థి, ప్రాణ నష్టం అపారం. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. అయితే పెద్దగా ఆస్థి, ప్రాణ నష్టం జరగలేదు. కాని అయితే ఈ నేపధ్యంలో ప్రపంచంలో సంభవించిన అతి పెద్ద ఐదు భూకంపాల కోసం తెలుసుకుందాం.
అతి పెద్ద భూకంపం చీలీలో
1960 వ సంవత్సరం మే 22వ తేదీన చిలీ దేశంలోలో అతి పెద్ద భూకంపం (Valdivia Earthquake) జరిగింది. ఇది రిక్టర్ స్కేలు పై 9.5 గా నమోదు అయింది. చీలీలో వాల్డివీయా నగరం భూకంప కేంద్రంగా ఉంది. పది నుండి 20 నిముషాల సేపు ఈ ప్రకంపనలు సాగాయి. దాదాపు ఐదు వేల మందికి పైగా చనిపోయారు. సుమారు 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పెద్ద ఎత్తున భవన నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. ఈ భూకంప ప్రభావం వలన సునామీ ఏర్పడి హవాయి, జపాన్, ఆస్ట్రేలియా దేశాలను ప్రభావితం చేసింది. ఇదే చరిత్రలో నమోదయిన అతి పెద్ద భూకపం
రెండో అతిపెద్ద భూకంపం ఇండోనేషియాలో..
2004 డిసెంబర్ 26వ తేదీన ఇండోనేషియా సునామీ భూకంపం (Sumatra-Andaman Earthquake) ప్రపంచంలో రెండో అతి పెద్ద భూకంపంగా గుర్తించబడింది. ఇది రిక్టర్ స్కేలు పై 9.1 నుండి 9.3 గా నమోదయింది. దాదాపు 10-15 నిముషాల సేపుఈ భూకంప ప్రకంపనలు ఉన్నాయి. దీని ప్రభావం వల్ల సునామి 14 దేశాలకు విస్తరించింది. ముఖ్యంగా ఇండోనేషియా, శ్రీలంక, ఇండియా, ధాయ్ లాండ్, మలేసియా, ఫిలిప్ఫీన్స్ లపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ దేశాలతో సహా 14 దేశాల్లో ఈ భూకంప సునామి కారణంగా 2 లక్షల 30 వేల మంది మరణించారు. ఊహించని స్థాయిలో ఆస్థి నష్టం జరిగింది. సముద్ర తీర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపిన భూకంపం ఇది.
మూడో అతి పెద్ద భూకంపం జపాన్ లో..
2011 మార్చి 11వ తేదీన జపాన్ భూకంపం (Tohoku Earthquake) ప్రపంచ చరిత్రలో మూడో అతి పెద్ద భూకంపంగా గుర్తించబడింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలు పై 9.0 గా నమోదయింది. దాదాపు 6-7 నిముషాల పాటు ఈ ప్రకంపనలు ఉన్నాయి. జపాన్ తీరంలో ఈ అతి పెద్ద భూకంప కేంద్రం ఉండటంతో సముద్రంలో సునామీ ఏర్పడింది. దీని కారణంగా ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ లో అణు ప్రమాదం జరిగింది. సుమారు 15 వేల మంది మృత్యువాత పడ్డారు. సుమారు 2500 మంది జాడ తెలియరాలేదు. జపాన్ ప్రభుత్వ అంచనాల ప్రకారం 235 బిలియన్ డాలర్ల ఆస్థి నష్టం జరిగింది. పెద్ద ఎత్తున భారీ భవనాలు ధ్వంసమయ్యాయి.
నాలుగో అతి పెద్ద భూకంపం రష్యాలోని కమ్చట్ కా ద్వీపంలో
1952 నవంబర్ 4వ తేదీన రష్యాలోని కమ్చట్ కా ద్వీపంలో జరిగిన భూకంపం ప్రపంచ చరిత్రలో నాలుగో అతి పెద్ద భూకంపంగా గుర్తించారు. ఈ భూకంపం బలమైన సునామీకి కారణమయింది. రిక్టర్ స్కేలు పై ఇది 9.0 గా నమోదయింది. దాదాపు ఐదు నుంచి పది నిముషాల సేపు భూ ప్రకంపనలు ఉన్నాయి. ఈ భూకంపం ద్వీపంలో ఏర్పడటం, సునామి సంభవించడం వల్ల పెద్ద స్థాయిలో ఆస్థి, ప్రాణ నష్టాలు జరగలేదు. సముద్ర తీర ప్రాంతాలకు మాత్రం కొద్ది స్థాయిలో నష్టం జరిగింది.
ఐదో అతి పెద్ద భూకంపం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో..
1906 ఏప్రిల్ 18వ తేదీన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన అతి పెద్ద భూకంపం ప్రపంచ చరిత్రలో ఐదో అతి పెద్ద భూకంపంగా గుర్తించారు. ఇది రిక్టర్ స్కేలుపై 7.8 గా రికార్డయింది. దాదాపు 40-45 సెకన్లు మాత్రమే ఇది జరిగింది. ఈ భూకంపం వల్ల 3 వేల మంది మరణించారు. దాదాపు 400 మిలియన్ డాలర్ల ఆస్థి నష్టం జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కోలో దాదాపు 80 శాతం భవన నిర్మాణాలు నేల మట్టమయ్యాయి. అంతే కాకుండా అగ్ని ప్రమాదాలకు ఈ భూకంపం కారణమైంద. శాన్ ఫ్రాన్సిస్కో నగరంపై ఈ భూకంపం తీవ్ర ప్రభావం చూపింది.
ఈ ఐదు భూకంపాలు ప్రపంచ చరిత్రలో రిక్టర్ స్కేలుపై నమోదయిన తీవ్రత, అదే రీతిలో ఎంత సమయం ఈ భూకంపం సంభివించింది. అదే రీతిలోజరిగిన ప్రాణ, ఆస్థి నష్టాల ఆధారంగా చరిత్రలో నమోదయింది.