Miracle Story in 1988: ఊడిన విమానం పైకప్పు-కట్ చేస్తే సేఫ్ ల్యాండింగ్, అసలేం జరిగింది
24వేల ఎత్తులో ఎగుతున్న విమానంలో ఫ్లైట్ పైకప్పు ఊడిపోయింది.. ప్రయాణికుల ప్రాణాలు గాల్లో ఉన్నాయి. అయినా ఎవరికీ ఏమీ కాలేదు... ? సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు. అదెలా..? 1988లో జరిగిన మిరాకిల్ స్టోరీ మీకోసం.
Aloha Airlines Flight 243: కింద పసిఫిస్ మహాసముద్రం... పైన 24 వేల అడుగులో ఎత్తులో విమానం వెళ్తోంది. ఉన్నట్టుంది విమానంలో పెద్ద శబ్దం వచ్చింది. చూస్తే... ఫ్లైట్ పైకప్పులో కొంతభాగం ఊడిపోయింది. ఎయిర్ ప్రెజర్ పెరగడంతో ప్రయాణికులకు సర్వ్ చేస్తున్న ఎయిర్ హోస్టెస్ కింద పడిపోయింది. చూస్తుండగా... పైకప్పులో చాలా భాగం ఊడిపోయింది. ప్రయాణికులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో.. వారంతా కుర్చీలకు అతుకుపోయారు. కానీ... క్షణక్షణం భయం.... ఏం జరుగుతుందో తెలిదు. విమనాం పసిఫిస్ మహాసముద్రంలో కూలితుందని.. మరణం ఖాయమని అనుకున్నారు ప్రయాణికులు. అందరూ కళ్లు మూసుకుని దేవుడిని ప్రార్థిస్తున్నారు. కానీ.. మిరాకిల్ జరిగింది.. .ప్రమాదం తప్పింది. పైకప్పు లేకుండా సముద్రంపై నుంచి ప్రయాణించిన ఆ విమానం... 13 నిమిషాల తర్వాత సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది.
ఏప్రిల్ 28, 1988న జరిగిన ఈ సంఘటన వైమానిక చరిత్రలోనే ఒక అద్భుతం. అంతేకాదు దిగ్భ్రాంతికరం కూడా. 988 ఏప్రిల్ 28న... యూఎస్‌కు చెందిన అలోహా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 243.. 89 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో బయలుదేరింది. ప్రయాణ సమయం 40 నిమిషాలు. అలోహా ఎయిర్‌లైన్స్ జెట్ పసిఫిక్ సముద్రంపై వెళ్తుండగా... పైకప్పు మధ్యలో విరిగిపోయింది. ఆ తర్వాత విమానంలో వాతావరణం భయానకంగా మారిపోయింది.
వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం... ట్విన్-ఇంజన్, 110-సీట్ బోయింగ్ 737-200 జెట్ విమానం 40 నిమిషాల ప్రయాణించాల్సి ఉంది. కానీ మధ్యలోనే బోయింగ్ 737 యొక్క పైకప్పు దెబ్బతినింది. పైకప్పులో కొంత భాగం విరిగిపోయింది. ఆ సమయంలో విమానం పసిఫిక్ మహాసముద్రంపై 24వేల అడుగులో ఉంది. బలమైన గాలులకు ప్రయాణీకులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆ ట్విన్ ఇంజిన్ ఫ్లైట్.. క్యాబిన్ ప్రెజర్ కోల్పోయింది. దీంతో ఆ విమాన ఫ్యూస్‌లేజ్ చాలా వరకు ఓపెన్ అయిపోయింది. విమానంలోని చాలా మంది ప్రయాణికులను పైకప్పు లేకుండా పోయింది.
పైకప్పు ఊడిపోయే సమయానికి ప్రయాణికులకు సర్వ్ చేస్తున్న ఎయిర్‌హోస్టెస్ క్లారాబెల్లె లాన్సింగ్... గాలుల తీవ్రతకు ఎగిరిపోయింది. దీంతో విమానంలోని ప్రయాణికులు భయపడిపోయారు. ప్రాణభయంతో కేకలు పెట్టారు. అయితే... వారంతా సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో వారంలో కుర్చీల్లోనే ఉండిపోయారు. ఇంతలో విమానంలోని రెండు ఇంజిన్‌ల్లో ఒక ఇంజిన్‌లో మంటలు అంటుకున్నాయి. కాసేపట్లో విమానం పసిఫిక్ మహా సముద్రంలో కలిసిపోతుందని భయపడిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. కానీ.. ఇక్కడే పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించారు. ప్రయాణికుల ప్రాణాలు నిలిపిన దేవుళ్లుగా చరిత్రలో నిలిచోపాయారు.
ట్విన్ ఇంజిన్ విమానంలో ఒక ఇంజిన్‌లో మంటలు అంటుకోవడంతో... మిగిలిన ఒక ఇంజిన్ సాయంతో... 24వేల అడుగుల ఎత్తు నుంచి విమానాన్ని మెల్లగా కిందికి దించారు. ఫస్ట్ ఆఫీసర్ నుంచి పైలట్ కంట్రోల్స్ తీసుకుని ఎమర్జెన్సీ డెసెంట్ చేశాడు. పైకప్పు లేకుండా 13 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత కహులూయి ఎయిర్‌పోర్టులో సేఫ్‌గా ఆ ఫ్లైట్‌ను ల్యాండ్ చేశారు. పైకప్పు ఊడిపోయిన దగ్గర నుంచి విమానం సేఫ్ ల్యాండింగ్ అయ్య వరకు పట్టిన సమయం 13 నిమిషాలు. ఆ 13 నిమిషాలు... ప్రయాణికులు నరకం చూశారు.
విమానం ల్యాండ్ అయిన తర్వాత... ఎమర్జెన్సీ సిబ్బంది దెబ్బతిన్న విమానం దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆ విమానం పరిస్థితి చూసి వారు అవాక్కయ్యారు. విమానంలోని వారంతా ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతమని చెప్పారు. విమానంలోని 95 మందిలో ఎయిర్‌హోస్టెస్ తప్ప... మిగిలిన వారంతా క్షేమంగా ఉన్నారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాల్లోకి ఎగిరిపోయిన ఎయిర్‌హోస్టెస్ మృతదేహం మాత్రం లభించలేదు. ఇది నిజంగా మిరాకిలే కదా..