By: ABP Desam | Updated at : 20 May 2022 03:45 PM (IST)
తాలిబన్ల పాలనలో యాంకర్లూ బురఖా వేసుకోవాల్సిందే !
ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు చెలరేగిపోతున్నారు. మహిళల్ని ప్రశాంతంగా బతకనివ్వకూడదని రూల్ పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా మహిళా టీవీ యాంకర్లపై కూడా తాలిబన్లు కఠిన ఆంక్షలను విధించారు. వార్తల ప్రసారం సమయాల్లో మహిళా టీవీ యాంకర్లు తమ ముఖాలు కనిపించకుండా కప్పుకోవాలని తాలిబన్లు హుకుం జారీ చేశారు. తాలిబన్లు ఇచ్చిన ఆదేశాలకు ఎదురుచెప్పే పరిస్థితి కానీ, వాటిపై బహిరంగచర్చించే పరిస్థితి గానీ అక్కడ ఎవరికీ లేదు. ఎవరైనా కాదంటే వారికి తూటానే సమాధానం చెబుతుంది.
The Death of Modern Journalism in Afghanistan—female anchor under the Taliban regime. pic.twitter.com/GXIUZXtf3D
— Hizbullah Khan (@HizbkKhan) May 19, 2022
ఇలాంటి ఆదేశాలే దేశంలోని అన్ని టీవీ, రేడియో నెట్‌వర్క్ సంస్థలకు వెళ్లాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మహిళా యాంకర్లు ముఖాలకు మాస్కులు ధరించి ప్రసారాలను కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కొందరు యాంకర్లు సోషల్ మీడియాలో పంచుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
The difference between TV anchors of Afghanistan, Qatar, KSA and Pakistan.
— Fazal Afghan 🇦🇫 (@fhzadran) May 19, 2022
meanwhile these are Taliban’s supporters countries too pic.twitter.com/6UVTZQUvmA
అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తరువాత అక్కడి మహిళలపై తాలిబన్ల ఆంక్షలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇప్పటికే అక్కడి బాలికల విద్యపై, మహిళల స్వేచ్ఛపై తాలిబన్లు కఠిన ఆంక్షలను విధించారు. తాలిబన్ల ఆదేశాలను ఎదిరించే పరిస్థితిలేని స్థితిలో అక్కడి మహిళలు స్వేచ్ఛగా కూడా బయటకు రాలేని దయనీయపరిస్థితి ఏర్పడింది. మహిళలపై తాలిబన్ల ఆంక్షలు మరింత ఎక్కువయ్యాయని ఇప్పటికే నివేదికలు వెలువడ్డాయి.
#Afg
— Wahid Haidari (@wahidhaidari95) May 19, 2022
The Taliban’s Ministry of Promoting Virtue and Preventing Evils #New_order compelled female TV anchors to wear face mask during TV shows while they had proper Hijab.
Our female colleagues are the 1st target of Taliban observation & this put them in high level #restriction. pic.twitter.com/GrOCElmAOK
ఇటీవల మహిళలు అందరూ బయటకు వస్తే తప్పనిసరిగా శరీరం మొత్తం కప్పి ఉంచే బురఖాలు ధరించాలని ఆదేశించారు. చివరికి కళ్లను కూడా కప్పే బురఖాలు ధరించాలన్నారు. లేకపోతే ఇంట్లో అందర్నీ శిక్షిస్తామని హెచ్చరించారు. దీంతో తాలిబన్ల పాలనలో ఎవరైనా మహిళలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు.
UN Spokesperson on Zubair Arrest: జర్నలిస్ట్ జుబైర్ అరెస్ట్‌పై ఐక్యరాజ్య సమితి స్పందన
Viral Video: మీరు క్యాచ్‌లు బాగా పడతారా? అయితే గిన్నిస్ రికార్డ్ కొట్టేయొచ్చు!
Russia-Ukraine War: పుతిన్ కనుక ఓ మహిళ అయి ఉంటే: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
G7 Summit: భారత కళా నైపుణ్యాన్ని చాటి చెప్పిన మోదీ- జీ7 దేశాధినేతలకు అరుదైన బహుమతులు
The Diary of a Young Girl : హిట్లర్‌పై అసలైన గెలుపు ఈ చిన్నారిదే ! ఇది కథ కాదు
Maharashtra News: అసలైన శివసైనికుడు సీఎం అయ్యాడని, ప్రజలు హ్యాపీగా ఉన్నారు-సీఎం షిండే కామెంట్స్
Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!
TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల
PM Modi Tour: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని టూర్ షెడ్యూల్ ఇదే- భారీ ఏర్పాట్లు చేసిన బీజేపీ