News
News
X

సూర్యుడికి దగ్గరగా వెళ్తే...చల్లగా ఉంటుంది తెలుసా..?

సూర్యుడి ఉపరితలం మీద ఉష్ణోగ్రత పదివేల డిగ్రీల ఫారన్ హీట్ దాకా ఉంటే ...సూర్యుడి వాతావరణంలో ఉష్ణోగ్రత ముఫై లక్షల డిగ్రీల ఫారన్ హీట్ దాకా ఉంటుందని అంచనా.

FOLLOW US: 

ఈరోజు కొంచెం ఎండ బాగా కాసింది అనుకోండి...భానుడు ప్రతాపం చూపించాడు అని న్యూస్ హెడ్ లైన్స్ చూస్తుంటాం కదా. కానీ ఆ భానుడి బిహేవియర్ చాలా చిత్ర విచిత్రంగా ఉంటుందని మీకు తెలుసా. సాధారణంగా మనకున్న అబ్జర్వేషన్ ఏంటి...సూర్యుడి కి దగ్గర ఉన్న గ్రహాల్లో భీభత్సమైన టెంపరేచర్ ఉంటుంది అని. దూరంగా ఉండే గ్రహాల్లో చాలా చల్లగా ఉంటుందని మైనస్ డిగ్రీల టెంపరేచర్ లో గడ్డ కుట్టుకుని పోయి ఉంటుందని. ఇక్కడ వరకూ ఈ రూల్స్ కరెక్టే కానీ ఈ రూల్ సూర్యుడికి వర్తించదు. అంటే సూర్యుడి ఉపరితలం మీద ఉండే ఉష్ణోగ్రత కంటే సూర్యుడి వాతావరణంలో ఉండే ఉష్ణోగ్రత చాలా చాలా ఎక్కువ. అంటే సూర్యుడి వాతావరణం మీద ఉన్న ఉష్ణోగ్రత దాటుకుని సూర్యుడి సర్ ఫేస్ మీదకు వెళ్తున్న కొద్దీ టెంపరేచర్ తగ్గుతుంది.
 
 చిత్రవిచిత్ర పరిస్థితి :
వినటానికి వింతంగా ఉన్నా ఇది నిజం. సూర్యుడి ఉపరితలం మీద ఉష్ణోగ్రత పదివేల డిగ్రీల ఫారన్ హీట్ దాకా ఉంటే ...సూర్యుడి వాతావరణంలో ఉష్ణోగ్రత ముఫై లక్షల డిగ్రీల ఫారన్ హీట్ దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు . దీన్నే శాస్త్రవేత్తలు Coronal Heating Problem గా గుర్తించారు. దీన్ని మొదటిసారిగా 19 వ శతాబ్దంలోనే గ్రహించినా...పరిశోధనలు, పరిశీలనలు చేయటానికి అప్పటి సాంకేతికత సరిపోయింది కాదు. సూర్యుడిని నేరుగా మనం చూడలేం. అందులోనూ మధ్యాహ్నం నడినెత్తి మీద ఉన్న సమయంలో అస్సలు చూడలేం. సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చిన రోజు మాత్రమే..సూర్యుడిని నేరుగా చూసే వీలు కలుగతుుంది మనకు. ఈ చిత్రవిచిత్రమైన బిహేవియర్ ను అబ్జర్వ్ చేయటానికి మన శాస్త్రవేత్తలు చాలా సూర్యగ్రహణాల పాటు వేచి చూశారు. భూమ్మీద దొరికే మెటీరియల్స్ కెమికల్ ప్రాపర్టీస్ ను స్టడీ చేస్తూ సూర్యుడి నుంచి వస్తున్న కాంతి కిరణాల్లో ఏం ఉన్నాయో పరిశోధించేందుకు చాలా కాలమే పట్టింది.

సూర్యుడిపై మిస్టరీ మెటిరీయల్ :
 ఎప్పుడైతే స్ప్రెక్ట్రోస్కోపుల వాడకం మొదలైందో. అప్పుడే సూర్యుడి పై పరిశోధనలు ఊపందుకున్నాయి. మెటీరియల్స్ ను వేడి చేయటం ద్వారా విడుదలయ్యే వాటి కాంతి మీద స్పెక్ట్రోస్కోపులు బ్రహ్మాండంగా పనిచేయటం మొదలుపెట్టాయి. స్పెక్ట్రో స్కోప్ లోని చిన్న హోల్ లోకి కాంతిని ప్రవేశపెట్టి...దాన్ని ఓ సర్ఫేస్ మీద రిఫ్లైక్ట్ అయ్యేలా చేసేవారు. దీన్నే గ్రేటింగ్ అనే వాళ్లు.అలా సర్ఫేస్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి వచ్చే లైట్ ను డిటెక్టర్ ద్వారా గుర్తించి ఆ లైట్ లో ఏం మెటీరియల్స్ ఉన్న వాళ్లో గుర్తుపట్టేందుకు ప్రయత్నించేవారు. సూర్యుడి కాంతిలో దాదాపు అన్ని వేల్ లెంత్ లైట్ ఉంటుంది. తద్వారా హీలియం, హైడ్రోజన్, కార్బన్ లాంటివి సూర్యుడి కాంతిలో ఉన్నాయని కనిపెట్టారు.  ఇలా సమాచారాన్ని సేకరిస్తున్న సైంటిస్టులకు 1869 లో ఓ సూర్యగ్రహణం రోజు వింత అనుభవం ఎదురైంది. ఆ రోజు స్పెక్ట్రో స్కోప్ ద్వారా సూర్యుడి మీద ప్రయోగం చేస్తున్న ఇద్దరు శాస్త్రవేత్తలు గతంలో గుర్తించిన ఎలిమెంట్స్ తో పోలిస్తే మరొకటి ఏదో ప్రత్యేకమైనది సూర్య కాంతిలో ఉందని గ్రహించారు. ఇదుగో ఇక్కడ గ్రీన్ లైన్ గతంలో ఎప్పుడూ శాస్త్రవేత్తలు గమనించలేదు. అసలు అలాంటి మెటీరియల్ ఏదీ భూమి మీదే లేదు. సూర్యుడి కరోనా ప్రాంతం నుంచి వచ్చింది కనుక ఆ కనిపిస్తున్న మెటీరియల్ కు కొరోనియమ్ అని పేరు పెట్టారు.

ఎలక్ట్రాన్ల వింత :
1939 లో Bengt Edlen అనే సైంటిస్ట్  ఈ కొరోనియమ్ కు కారణం సూర్యుడిపై ఉన్న ఐరన్ లో ఎలక్ట్రాన్లు తగ్గిపోతుండటమే అని కనిపెట్టారు. మాములుగా ఏ పదార్థంలోనైనా దాని న్యూక్లియస్ చుట్టూ నిర్దిష్టమైన ఎలక్ట్రాన్లు ఉంటాయి. కానీ సూర్యుడిపై ఐరన్ లో ఆ ఎలక్ట్రాన్లు బలవంతంగా తొలిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు గ్రహించారు. మొత్తం 26 ఎలక్ట్రాన్స్ లో 13 ఎలక్ట్రాన్లు తొలిగిపోతున్నాయి. మాములుగా ఇలా ఎలక్ట్రాన్లను న్యూక్లియస్ నుంచి వేరు చెయ్యాలంటే ఇంకా ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాల్సి వస్తుంది. సో అందుకే సూర్యుడి ఉపరితలంపై కంటే సూర్యుడి వాతావరణం ఇంకా ఇంకా వేడిగా తయారవుతోందని గుర్తించారు.

మరిన్ని కారణాలు
సూర్యుడిపైన ఉన్న Alfeven వేవ్స్ కారణంగా..సూర్యుడిపైన సోలార్ ఫ్లేర్స్ ఏర్పడుతూ అవి పైకి ఎగజిమ్ముతూ వాతావరణం వేడెక్కేలా చేస్తున్నాయని కొంత మంది శాస్త్రవేత్తలు గుర్తించారు. మరికొందరు శాస్త్రవేత్తలు Nano Flares ను ప్రస్తావించారు. సూర్యుడి మ్యాగ్నటిక్ ఫీల్డ్ కారణంగా నానో ఫ్లేర్స్ సూర్యుడి వాతావరణంలో ఢీకొట్టుకుని మరింత ఉష్ణోగ్రతకు కారణమవుతున్నాయని గుర్తించారు. ఇప్పటికీ సూర్యుడి మీద ఉన్న ఈ మిస్టరీని ఛేధించటానికి ఇంకా బలమైన కారణాల కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. 

Published at : 19 Sep 2022 05:58 PM (IST) Tags: sun Alfven Bengt Edlen Coronal Heating Problem

సంబంధిత కథనాలు

Kabul Blast: కాబూల్‌లో మరో భారీ పేలుడు, 100 మంది చిన్నారులు మృతి!

Kabul Blast: కాబూల్‌లో మరో భారీ పేలుడు, 100 మంది చిన్నారులు మృతి!

US President Joe Biden: మిస్టర్ ప్రెసిడెంట్ అని అరుస్తున్నా పట్టించుకోని బైడెన్, షాక్ అయిన అధికారులు

US President Joe Biden: మిస్టర్ ప్రెసిడెంట్ అని అరుస్తున్నా పట్టించుకోని బైడెన్, షాక్ అయిన అధికారులు

Iran Hijab Protest: హిజాబ్‌ నిరసనలపై అధ్యక్షుడి ఫైర్- గీత దాటితే కఠిన శిక్ష తప్పదని వార్నింగ్

Iran Hijab Protest: హిజాబ్‌ నిరసనలపై అధ్యక్షుడి ఫైర్- గీత దాటితే కఠిన శిక్ష తప్పదని వార్నింగ్

Russian Ukraine War: ఉక్రెయిన్‌లోని ఆ నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనం, అధికారికంగా పుతిన్ సంతకాలు

Russian Ukraine War: ఉక్రెయిన్‌లోని ఆ నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనం, అధికారికంగా పుతిన్ సంతకాలు

Emotional Video: 45 ఏళ్ల తరవాత తన చిన్ననాటి కేర్‌ టేకర్‌ను కలుసుకున్నాడు, ఎంత ఎమోషనల్ అయ్యాడో చూడండి

Emotional Video: 45 ఏళ్ల తరవాత తన చిన్ననాటి కేర్‌ టేకర్‌ను కలుసుకున్నాడు, ఎంత ఎమోషనల్ అయ్యాడో చూడండి

టాప్ స్టోరీస్

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం - కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

యాదాద్రీశునికి కేజీ 16 తులాల బంగారం విరాళం -  కేటీఆర్ కుమారుడి చేతుల మీదుగా ఇచ్చిన కేసీఆర్ !

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

Bandla Ganesh: 'భార్యని, బిడ్డల్ని ప్రేమించనోడు అసలు మనిషేనా' - పూరీ జగన్నాథ్‌పై బండ్ల గణేష్ కామెంట్స్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ