Singapore : ఫుట్ బాల్ మ్యాచ్ టిక్కెట్లు గిఫ్టుగా తీసుకోవడమే నేరం - సింగపూర్ మాజీ మంత్రికి ఏడాది జైలు
Iswaran : సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్‌కు 12 నెలల జైలు శిక్షను కోర్టు విధించింది. పదవిలో ఉంటూ మూడు లక్షల డాలర్ల విలువైన గిఫ్టులు తీసుకున్నాని కేసులు నమోదు చేస్తున్నారు.
Singapore disgraced former transport minister jailed for 12 months in landmark case : సింగపూర్ సీనియర్ మాజీ మంత్రి ఈశ్వరన్‌కు ఏడాది జైలు శిక్ష విధించారు. సింగపూర్‌కు పదమూడేళ్ల పాటు మంత్రిగా పని చేశారు. అయన పదవి లో ఉన్నప్పుడు మూడు లక్షల డాలర్ల విలువన బహుమతుల్ని ఇతరుల దగ్గర నుంచి తీసుకున్నారని ఆరోపణలు రావడంతో కేసులు పెట్టారు. విచారణ జరిపి నిజమని నిర్ధారణ కావడంతో శిక్ష విధించారు. అరవై రెండేళ్ల ఈశ్వరన్ సోమవారం నుంచి జైలు శిక్షను అనుభవించాల్సి ఉంది.
బిజినెస్ మ్యాన్ నుంచి గిఫ్టులు తీసుకున్న ఈశ్వరన్
సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కు మంచి పేరు ఉంది. ఆయన మూడు లక్షల డాలర్ల విలువైన బహుమతులు తీసుకున్నారని తెలిసిన తర్వాత సింగపూర్ షాక్‌కు గురైంది. సింగపూర్‌లో అవినీతి తావులేని బ్యూరోక్రసీ ఉంది. ఇప్పటి వరకూ రాజకీయ నేతలు, అధికారులపై వచ్చే ఆరోపణలు చాలా తక్కువ. ప్రపంచంలోనే అతి తక్కువ అవినీతి ఉండే టాప్ ఫైవ్ దేశాల్లో సింగపూర్ ఒకటి. సింగపూర్ మంత్రి ఒకరు అవినీతికి పాల్పడిన కేసు చివరి సారిగా 1986లో నమోదయింది. అప్పట్లో ఓ మంత్రి ఇలాగే లంచాలు తీసుకున్న మంత్రిపై కేసులు నమోదయ్యాయి. కోర్టుల్లో చార్జెస్ ఫైల్ చేయక ముందే ఆయన చనిపోయారు. అందుకే శిక్ష విధించే పరిస్థితి రాలేదు.
నేరం రుజువు కావడంతో ఏడాది జైలు శిక్ష
ట్రాన్స్ పోర్టు మినిస్టర్ గా ఉంటూ.. ఆయన ఓ బిజినెస్ మ్యాన్ నుంచి తీసుకున్న గిఫ్టుల్లో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ ఫుట్ బాల్ టిక్కెట్లు కూడా ఉన్నాయి. అలాగే సింగపూర్ ఫార్ములా వన్ గ్రాండ్ ప్రిక్స్, లండన్ మ్యూజికల్స్ అలాగే ఓ ప్రైవేట్ జెట్‌లో ఓ ప్రయాణాన్ని కూడా గిఫ్టులుగా ఆంగీకరించారు. ఈ విషయంలో వెలుగులోకి వచ్చిన తర్వాత గత జనవరిలో తన పదవికి ఈశ్వరన్ రాజీనామా చేశారు. తాను ఎలాంటి గిఫ్టులు తీసుకోలేదని ఈశ్వరన్ వాదించారు. కానీ ఆధారాలతో సహా నిరూపించడంతో ఆయనకు జైలు శిక్ష తప్పలేదు. మొత్తంగా ఆయనపై 35 అభియోగాలు మోపారు.. చివరికి ఐదింటిలో ఆధారాలు చూపించగలిగారు.
అవినీతిని సహించని దేశాల్లో సింగపూర్ టాప్ ఫైవ్‌లో
సింగపూర్ చాలా చిన్న దేశమే అయినా అభివృద్ధి పరంగా వేగంగా ముందుకెళ్లింది. దానికి కారణం అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ ఉండటమే. అవినీతిని అసలు సహించరు. సింగపూర్ లో అధికారులు కానీ.. ప్రభుత్వ పెద్దలు కానీ ఒక్క రూపాయి అవినీతి చేసినా దొరికిపోతామనే భయంతో ఉంటారు. అందుకే ఎలాంటి అవినీతి చేయరు. ఈశ్వరన్ తనకు గిఫ్టులుగా ఇచ్చిన వాటిని ఎవరూ గుర్తించరని అనుకున్నారు.