అన్వేషించండి

ఉక్రెయిన్‌లోని మిలటరీ అవార్డు వేడుకపై రష్యా దాడి, 19 మంది సైనికులు మృతి

Russia Attack: ఉక్రెయిన్‌లో ఓ మిలిటరీ అవార్డుల వేడుకపై రష్యా క్షిపణితో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో  19 మంది సైనికులు మృతి చెందారు.

Russia Attack: ఉక్రెయిన్ పై రష్యా బాంబు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు సంవత్సరాలుగా ఉక్రెయిన్ పై బాంబులను ప్రయోగిస్తోంది క్రెమ్లిన్. ఉక్రెయిన్‌లో ఓ మిలిటరీ అవార్డుల వేడుకపై రష్యా క్షిపణితో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో  19 మంది సైనికులు మృతి చెందారు. జపోరిజియాలో రాకెట్ ఫోర్సెస్, ఆర్టిలరీ డేని ఉక్రెయిన్ నిర్వహించింది. అవార్డుల వేడుకలో జకార్‌పట్టియాలోని 128వ ప్రత్యేక పర్వత ప్రాంత దాడుల బ్రిగేడ్‌ సైనికులు పాల్గొన్నారు. మిలిటరీ సిబ్బందితో కిటకిటలాడిన వేడుకపై రష్యా క్షిపణితో దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. 19 మంది సైనికులు మృతి చెందడంపై ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జపోరిజియాలో యుద్ధక్షేత్రానికి సమీపంలో ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహించడంపై అనేక విమర్శలు వచ్చాయి. రక్షణశాఖ మంత్రి రుస్తెం ఉమెరోవ్‌ దర్యాప్తునకు ఆదేశించారు. 

ఒడెసాపై డ్రోన్‌, క్షిపణులతో రష్యా దాడి
రాకెట్ ఫోర్సెస్, ఆర్టిలరీ డేపై దాడికి ముందు ఉక్రెయిన్‌ ఓడరేవు నగరం ఒడెసాపై డ్రోన్‌, క్షిపణులతో రష్యా దాడి చేసింది. ఈ దాడుల్లో ఎనిమిది మంది గాయపడ్డారు. యునెస్కో వారసత్వ జాబితాలోని ఒడెసా నేషనల్‌ ఆర్ట్‌ మ్యూజియం కూడా ఈ దాడుల్లో దెబ్బతింది. అనేక కళాఖండాలకు నెలవైన ఈ మ్యూజియంకు 124 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. రష్యా ఆధీనంలోని క్రిమియాలో ఉన్న కెర్చ్‌ నగరంపై ఉక్రెయిన్‌ సైన్యం విరుచుకుపడింది. ఒకేసారి 15 క్షిపణులను ప్రయోగించింది. వీటిలో 13 అస్త్రాలను రష్యా కూల్చేసింది. ఓ క్షిపణి రష్యాకు చెందిన అత్యాధునిక యుద్ధనౌకను ధ్వంసం చేసింది. ఈ నష్టం తీవ్రత ఎంతన్నది వెల్లడి కాలేదు. దెబ్బతిన్న నౌకలో కల్బిర్‌ క్షిపణులు ఉన్నట్లు ఉక్రెయిన్‌ వాయుసేన తెలిపింది. గతేడాది ఏప్రిల్‌లో ఉక్రెయిన్‌ దళాలు చేసిన క్షిపణి దాడిలో మాస్కోవా అనే భారీ యుద్ధనౌక మునిగిపోయిది.  తాజా దాడిలో రష్యా క్రూజ్‌ మిసైల్‌ క్యారియర్‌ అస్కోల్డ్‌ తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ దాడులకు ప్రతీకారంగానే ఒడెసాపై మాస్కో సేనలు విరుచుకుపడినట్లు ఉక్రెయిన్‌ అధికారులు భావిస్తున్నారు.

ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన రష్యా
అణు వార్‌హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యమున్న ఖండాంతర క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించింది. సరికొత్త అణు జలాంతర్గామి నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఉక్రెయిన్‌ అంశంపై పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ రష్యా ప్రయోగం జరిపింది. తాజా పరీక్షలో బులావా అనే క్షిపణిని ఇంపరేటర్‌ అలెగ్జాండర్‌-3 అనే జలాంతర్గామి నుంచి ప్రయోగించారు. ఇంపరేటర్‌ అలెగ్జాండర్‌-3, బొరెయ్‌ తరగతికి చెందిన జలాంతర్గామి. 16 బులావా క్షిపణులను మోసుకెళ్లగళ్ల సామర్థ్యం దాని సొంతం. ఇప్పటికే అణు పరీక్షల నిషేధ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు పుతిన్‌ ప్రకటించారు. బిల్లుపై ఇటీవల సంతకం చేశారు. 1996లో ఈ ఒప్పందం అమెరికా సంతకం చేసినప్పటికీ, దాన్ని ఆమోదించలేదు. దీంతో రష్యా కూడా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచం అమెరికా నుంచి ముప్పు ఎదుర్కొంటోందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Delhi Minister Kailash Gehlot Resigns : ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Delhi Minister Kailash Gehlot Resigns : ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
IPL 2025 Mega Auction: 2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఐపీఎల్‌ మెగా ఆక్షన్‌కు వచ్చే ప్లేయర్ల లిస్ట్ ఇదే
2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఐపీఎల్‌ మెగా ఆక్షన్‌కు వచ్చే ప్లేయర్ల లిస్ట్ ఇదే
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Pushpa 2 Trailer Launch Live Updates: అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
Embed widget