Putin Nuclear: అమెరికాపై అణుబాంబులేయడానికి పుతిన్ రెడీ - కొత్త ఫైల్‌పై సంతకం - బైడెనే కారణం !
Russia: అమెరికాపై అణుదాడి చేసేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉక్రెయిన్‌కు రష్యాపై లాంగ్ రేంజ్ క్షిపణులు ప్రయోగించేందుకు అనుమతి ఇవ్వడమే కారణం.
Putin Responds To Biden Missile Approval By Changing Moscow Nuclear Doctrine: పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు బైడెన్ .. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను రెచ్చగొట్టారు. తాము అందజేసే లాంగ్‌రేంజ్ క్షిపణులను రష్యాపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అనుమతి ఇచ్చారు. దీంతో పుతిన్ తమ అణుపాలసీని మరింత సరళీకృతం చేస్తూ కొత్తగా నిర్ణయం తీసుకున్నారు. నూతన అణ్వాయుధ సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ పాలసీ ప్రకారం ఉక్రెయిన్ కు తమపై దాడి చేసేందుకు ఆయుధాలు ఇచ్చే దేశాలపైనా రష్యా అణుదాడి చేస్తుంది.అలాంటి దేశాలు తమ శత్రువులేనని రష్యా ప్రకటించింది.అంటే ఇప్పుడు ఉక్రెయిన్ కు లాంగే రేజ్ క్షిపణులు ఇస్తోంది.. దాడికి అనుమతులు ఇచ్చింది అమెరికా కాబట్టి.. రష్యా అమెరికైపైనా దాడి చేస్తుందన్నమాట.
ఉక్రెయిన్ పై రష్యా దాడులకు వెయ్యి రోజులు
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించి వెయ్యి రోజులు అయ్యింది. ఉక్రెయిన్ కు నాటో దేశాలు సహకారం అందిస్తూండటంతో పుతిన్ కొత్త ముసాయిదాకు లైన్ క్లియర్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఏ దేశం కవ్వింపు చర్యకు పాల్పడినా.. ఆ దేశంపై అటాక్ చేసేందుకు వెనుకాడమోమని రష్యా తేల్చి చెప్పింది. సరిహద్దు వద్ద ఎటువంటటి సైనిక నిర్మాణం చేపట్టినా అది కవ్వింపు చర్యే అవుతుందని రష్యా తెలిపింది. శత్రు దేశాలకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్, మిస్సైళ్లు, డ్రోన్లు, ఆయుధాలు ఏవైనా రష్యా వైమానిక క్షేత్రంలోకి వస్తే సహించేది లేదని అణుదాడికి సిద్ధమని స్పష్టం చేసింది.
Also Read: నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్
రష్యాపై దాడి చేయడానికి కొత్త ఆయుధాలిచ్చిన అమెరికా
అణుబాంబులు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే..దాన్ని ఆ రెండు దేశాలు కలిసి దాడిగానే రష్యా పరిగణించనుంది. ఇలాంటి సందర్భాల్లో అణ్వాయుధాలు లేని దేశంపైనా రష్యా దాడి చేయనుంది. అణ్వాయుధాలపై పుతిన్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.ఉక్రెయిన్‌కు మద్దతుగా రష్యాపై ఒకవేళ పశ్చిమదేశాలు నేరుగా దాడి చేస్తే వాటిపై అణ్వాయుధాలు వాడటానికి వీలుగా నిబంధనలు సవరించిందని సులువుగానే అర్థమవుతుంది.
Also Read; టెలిగ్రామ్ సీఈవో రియల్ విక్కీ డోనర్ - స్పెర్మ్ ఇచ్చి ఉచితంగా ఐవీఎఫ్ చేయిస్తాడట - ఒకటే కండిషన్
తమపై దాడులు చేయడానికి ఆయుధాలిచ్చే వారినీ శత్రువుగా చూస్తామన్న పుతిన్
పుతిన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న ట్రంప్ జనవరిలో అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ లోపు బైడెన్ దూకుడుగా ఉక్రెయిన్ కు ఆయుధాలివ్వడం.. వాటిని రష్యాపై ప్రయోగించేందుకు అనుమతి ఇవ్వడంతో పరిస్థితి మారిపోయింది. ఈ పరిస్థితి పుతిన్‌కు చెలగాటం .. అమెరికాకు ప్రాణసంకటంగా మారనుంది.