Shehbaz Sharif Update: 'థాంక్యూ మోదీ జీ- కశ్మీర్ సమస్యపై కూర్చొని మాట్లాడుకుందాం'
భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెెలిపారు. కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందామని ట్వీట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్‌కు పాకిస్థాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్ రిప్లై ఇచ్చారు. భారత్‌తో శాంతి, పరస్పర సహకార బంధాన్నే పాక్ కోరుకుంటోందని ఆయన అన్నారు.
Thank you Premier Narendra Modi for felicitations. Pakistan desires peaceful & cooperative ties with India. Peaceful settlement of outstanding disputes including Jammu & Kashmir is indispensable. Pakistan's sacrifices in fighting terrorism are well-known. Let's secure peace and.. https://t.co/0M1wxhhvjV
— Shehbaz Sharif (@CMShehbaz) April 12, 2022
పాకిస్థాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సుస్థిరతలను భారత్ కోరుకుంటోందని మోదీ ట్వీట్ చేశారు.
ఏకగ్రీవంగా
పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధానిని ఎన్నుకునేందుకు నేషనల్ అసెంబ్లీ సోమవారం సమావేశం కాగానే ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ సభ్యులు హంగామా సృష్టించారు. షెహబాజ్ ఎన్నిక సమయానికి సభనుంచి పీటీఐ సభ్యులందరూ వాకౌట్ చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.
Also Read: Modi Congratulates New Pak PM: పాకిస్థాన్ ప్రధానికి తనదైన స్టైల్‌లో మోదీ శుభాకాంక్షలు