పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ ఉల్ హక్, మాజీ ప్రధాని ఆమోదంతో అధికారికంగా ప్రకటన
Pakistan Crisis: పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వార్ ఉల్ హక్ ఎన్నికయ్యారు.
Pakistan Crisis:
ఆపద్ధర్మ ప్రధాని అన్వార్
పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ ఇటీవలే రద్దైంది. ఎన్నికలు జరిగేలోగా ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా ఎవరు ఉంటారన్న ఉత్కంఠకు తెరపడింది. సెనేటర్ అన్వర్ ఉల్ హక్ కకర్ (Anwaar-ul-Haq Kakar)ఆపద్ధర్మ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇదే విషయాన్ని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. నేషనల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత రాజా రియాజ్ అన్వర్ నియామకానికి ఆమోదం తెలిపారు. మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా అంగీకరించిన తరవాత అధికారికంగా అన్వర్ పేరుని ప్రకటించారు. బలూచిస్థాన్‌కి చెందిన అన్వార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేని వ్యక్తిని ఆపద్ధర్మ ప్రధానిగా ఎన్నుకోవడం కీలకంగా మారింది. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక, రాజకీయ అనిశ్చితిని ఆయన ఎలా డీల్ చేస్తారన్న దానిపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాకిస్థాన్ రాజ్యాంగం ప్రకారం...ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎన్నికల బాధ్యత తీసుకుంటారు. 90 రోజుల్లోగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పార్లమెంట్ దిగువ సభ రద్దైన తరవాత కచ్చితంగా మూడు నెలల్లోగా ఎన్నికలు జరగాలి. ఆ లెక్కన చూసుకుంటే ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశం దాదాపు మునిగిపోయే స్థితిలో ఉంది. ఈ తరుణంలోనే అన్వర్‌కి అదనపు అధికారాలు ఇచ్చే అవకాశాలున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడం సహా, ఆర్థిక సంక్షోభాన్ని తీర్చే ప్రయత్నాలు చేయడమూ ఆయన ముందున్న సవాళ్లు. అయితే...ఎన్నికలు ఆలస్యంగా జరిగే అవకాశాలున్నాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
Senator Anwaar-ul-Haq Kakar, a lawmaker from Balochistan, has been selected as caretaker prime minister, a statement from the Prime Minister's Office said, reports Pakistan's Geo News
— ANI (@ANI) August 12, 2023
ఇప్పటికే పాక్‌లో ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరుకుంది. ఆర్థికంగా పూర్తిగా చతికిలపడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతుండటం ఉత్కంఠగా మారింది. ఆ దేశ భవిష్యత్‌ని ఈ ఎన్నికలే నిర్ణయించనున్నాయి. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఓ కేసులో అరెస్ట్ అయ్యారు. ఫలితంగా ఆయనకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ మొత్తం పరిణామాల్లో ప్రస్తుతం పాక్ అధ్యక్షుడు అల్వీ పాత్రే కీలకంగా మారనుంది. మరో మూడు రోజుల్లో మధ్యంతర ప్రధానిని నియమించాలని ఇప్పటికే ఆదేశించారు. మరో 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలనీ తేల్చి చెప్పారు. అయితే..ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఓ బాంబు పేల్చింది. వచ్చే ఏడాది వరకూ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండకపోవచ్చని స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ ప్రకటనతో మరోసారి పాక్‌లో రాజకీయ అనిశ్చితి మొదలైంది. ప్రస్తుత సమాచారం ప్రకారం...పాకిస్థాన్‌లో ఎన్నికలు ఆలసమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న రాజకీయ, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోడం కష్టంగా ఉంది. దీనికి తోడు ప్రభుత్వం మారితే మరింత గందరగోళ పరిస్థితులు దారి తీస్తుందని భావిస్తున్నారు.
Also Read: PM Modi: బెంగాల్ పంచాయతీ ఎన్నికలపై మోదీ మండిపాటు, రక్తంతో ఆడుకున్నారంటూ మమత సర్కారుపై ధ్వజం