Nobel Prize 2024: భౌతికశాస్త్రంలో ఇద్దరిని వరించిన నోబెల్ బహుమతి, ఈ ఏడాది విజేతలుగా జాన్ ఎఫ్ హోప్‌ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్
Physics Nobel Prize 2024 | భౌతికశాస్త్రంలో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలు జాన్ ఎఫ్ హోప్‌ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్ లకు 2024 ఏడాదికిగానూ నోబెల్ బహుమతి మంగళవారం నాడు ప్రకటించారు.
Nobel Prize 2024 In Physics: ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ విజేతలను ప్రకటిస్తున్నారు. ఇదివరకే వైద్యశాస్త్రంలో విశేషంగా కృషిచేసిన అమెరికా శాస్త్రవేత్తలు అంబ్రోస్, గ్యారీ రువ్ కున్‌కి ఈ ఏడాదికిగానూ నోబెల్ బహుమతి ప్రకటించడం తెలిసిందే. తాజాగా భౌతికశాస్త్రంలో నోబెల్ అవార్డు ఇద్దరిని వరించింది. జాన్ హోప్‌ఫీల్డ్, జెఫ్రీ హింటన్ లకు ఫిజిక్స్ లో నోబెల్ బహుమతిని స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో ప్రకటించారు. కృత్రిమ న్యూరల్ నెట్‌వర్క్‌లతో మెషిన్ లెర్నింగ్‌ను ఆవిష్కరించేందుకు చేసిన కృషికిగానూ వీరిని అత్యున్నత పురస్కారం వరించింది. భౌతికశాస్త్రంలో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలు కు 2024కుగానూ నోబెల్ బహుమతి ప్రకటించారు. ఫిజిక్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని మంగళవారం నాడు ప్రకటించారు.
ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ ప్రకటన ఈవెంట్ లైవ్ ఇక్కడ వీక్షించండి
WATCH LIVE: Join us for the 2024 #NobelPrize in Physics announcement.
— The Nobel Prize (@NobelPrize) October 8, 2024
Hear the breaking news first – see the live coverage from 11:45 CEST.
Where are you watching from?https://t.co/RTaKszmof4
భౌతిక శాస్త్రంలో నోబెల్ గ్రహీత జెఫ్రీ హింటన్, మరో నోబెల్ విజేత జాన్ హాప్‌ఫీల్డ్ బోల్ట్జ్‌మాన్ మెషిన్ అభివృద్ధి చేయడానికి నెట్‌వర్క్‌ను కొత్త నెట్‌వర్క్‌ను ఉపయోగించారు. దీని ద్వారా మనం ఇచ్చిన మూలకాల లక్షణాలను ఈజీగా గుర్తించవచ్చు.
బోల్ట్జ్‌మాన్ మెషీన్ ను ఫొటోలను వర్గీకరించడానికి ఉపయోగిస్తారు. శిక్షణ పొందిన నమూనా రకాలకు చెందిన ఆవిష్కరణగా చెప్పవచ్చు. హింటన్ డెవలప్ చేసిన విధానంతో మెషిన్ లెర్నింగ్ మరింత తేలిక అవుతుందని తెలిపారు. వారు చేసిన ఈ ఆవిష్కరణకుగానూ నోబెల్ వరించింది.
అతిపిన్న వయస్కుడు, అతిపెద్ద వయస్కులు వీరే
అతి పిన్న వయసులో ఫిజిక్స్ లో నోబెల్ బహుమతి అందుకున్న శాస్త్రవేత్త లారెన్స్ బ్రాగ్. ఆ సమయలో ఆయన వయసు కేవలం 25 ఏళ్లు కాగా, ఫిజిక్స్ లో నోబెల్ బహుమతి అందుకున్న అతిపెద్ద వయస్కుడు ఆర్థర్ యాస్కిన్. 96 ఏళ్ల వయసులో యాస్కిన్ నోబెల్ అందుకున్నారు.