అన్వేషించండి

Nepal Earthquake: నేపాల్ లో భూకంపం, మరోవైపు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!

Nepal Earthquake 2023 : ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేలుతుండగా నేపాల్ వాసులకు భూకంపం షాకిచ్చింది.

Earthquake In Nepal:  ఖాట్మండు: ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేలుతుండగా నేపాల్ వాసులకు భూకంపం షాకిచ్చింది. నేపాల్ లో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. పదకొండున్నర గంటల ప్రాంతంలో పలు చోట్ల భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. నేపాల్ రాజధాని ఖాట్మండుకు తూర్పున 56 కిలోమీటర్ల దూరంలో తాజాగా భూకంపం సంభవించింది. ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేస్తున్నవారు సైతం కాస్త ఆందోళన చెందారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

నేపాల్ లో నవంబర్ నెల తొలి వారంలో భారీ భూకంపం సంభవించింది. అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు వణికిపోయారు. 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి 128 మంది మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు.

నేపాల్‌ భూకంపం అంతం కాదు ఆరంభమే! నిపుణుల వార్నింగ్!
నేపాల్‌లో 2015న వచ్చిన భూకంపం నాటి విషాదఛాయలు ఇప్పటికీ అక్కడి ప్రజలను కలవరపెడుతూనే ఉంటాయి. అయితే.. దానికి మించిన ప్రకృతి విలయం రాబోతోందని  హెచ్చరిస్తున్నారు నిపుణులు. నేపాల్‌లో నెల రోజుల్లో మూడు సార్లు భూమి కంపించింది. నిన్న రాత్రి వచ్చిన బలమైన ప్రకంపనలు పెను విషాదాన్ని మిగిల్చాయి. వందలాది  మందిని మింగేశాయి. నేపాల్ భూకంపం ప్రభావం ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశం మొత్తం కనిపించింది. అయితే... ఇది అంతం కాదని అంటున్నారు నిపుణులు. నేపాల్‌లో  మరిన్ని భారీ భూప్రకంపనలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. 

హిమాలయాలు, నేపాల్ మధ్య ప్రాంతంలోని ప్రజలు మరిన్ని భూకంపాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని భూకంప శాస్త్రవేత్త అజయ్ పాల్ హెచ్చరించారు. నవంబర్ 3న అర్థరాత్రి వచ్చిన భూ ప్రకంపనల మూలం నేపాల్‌లోని దోటీ జిల్లాకు సమీపంలో ఉందని ఆయన తెలిపారు. నిన్న ఒకే ప్రాంతంలో వరుసగా పలుమార్లు ప్రకంపనలు వచ్చాయని  చెప్పారు. భూకంపం వచ్చిన ఈ ప్రాంతం నేపాల్ మధ్య భాగంలో ఉందని... అది ఆందోళన కలిగించే విషయమని అంటున్నారు భూకంప శాస్త్రవేత్త అజయ్ పాల్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget