Home In Office : ఇంటి రెంట్ ఎక్కువైందని ఆఫీస్ క్యాబిన్‌లోనే కాపురం పెట్టేశాడు ! మరి ఓనర్ ఊరుకున్నాడా ?
ఇంటి అద్దె కట్టుకోలేకపోతున్నామని వెళ్లి ఆఫీసులో సెటిలైపోవాలనే ఆలోచన మనకెవరికైనా వచ్చి ఉంటుందా ? రానే రాదు. కానీ అతనికి వచ్చింది. చేసేశాడు. చివరికి ఏం జరిగిందంటే ?
ఓ పదిపెద్ద పుస్తకాలను కాలేజీ లైబ్రరీ నుంచి తీసుకెళ్తూ.. లెక్చరర్ ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి కనిపిస్తాడు సునీల్. దాంతో ఆశ్చర్యపోతాడు ధర్మవరపు.ఎందుకంటే ఎప్పుడూ పుస్తకం పట్టినట్లే ఉండడు సునీల్. అందుకే ఏందిరా అన్ని పుస్తకాలు.. చదవడానికేనా అని ప్రశ్నిస్తాడు. అవును సార్ అని చెబితే సునీల్ ఎందుకవుతాడు.. కాదు సార్.." డబ్బులకు టైట్‌గాఉందని" సమాధానం చెబుతాడు సునీల్. కాసేపటికి కానీ ధర్మవరపుకు బల్బ్ వెలగదు. వాటిని తీసుకెళ్లి అమ్మేసి టైట్‌ను లూజ్ చేసుకుంటాడని. ఇలాంటి క్యారెక్టర్లు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఉంటాయి. అలాంటి వాడే మనం చెప్పుకోబోయే సిమోన్.
సిమోన్ చిరుద్యోగి. తన జీతం ఇంటి అద్దె కట్టుకుని జీవించడానికి సరిపోవడం లేదు. అందుకే తీవ్రంగా ఆలోచించి ఓపరిష్కారం కనుగొన్నాడు. అదేమిటంటే.. ఆఫీసుకు షిఫ్ట్ అయిపోవడం. ఆఫీసులోని తన చాంబర్‌కు అన్నీ మార్చేసుకున్నాడు. ఆ వీడియోను టిక్ టాక్‌లో షేర్ చేసుకున్నాడు. ఆ వీడియోలు.. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సిమోన్ బతక నేర్చిన వాడని అందరూ అభినందించారు. తన పరిస్థితిని నిజాయితీగానే చెప్పుకున్నాడు సిమోన్. అది నిజంగా చిరుద్యోగులు బతకడం ఎంత కష్టమవుతుందో తెలియ చెప్పేలానే ఉన్నాయి.
సిమెన్ టిక్ టాక్ వీడియోస్ వైరల్ అయ్యాయి.అయితే హఠాత్తుగా వాటిని తీసేశాడు. ఏం జరిగిందా అని ఆయన ఫాలోయర్లు కంగారు పడ్డారు. ఇంటి అద్దె మిగుల్చుకోవడానికి ఆఫీసులో సెటిల్ అయ్యి.... ఓనర్‌కి కోపం తెప్పించి..ఆ ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడా అని కంగారు పడ్డారు. అలాంటిదేమీ జరగలేదు కానీ జరగబోయింది. టిక్ టాక్ వీడియోలు వైరల్ కావడం.. ఆఫీస్ గురించి రచ్చ కావడంతో.. హెచ్ ఆర్ వాళ్లు పద్దతినే సిమోన్‌కు నోటీసులు ఇచ్చారు. ఉన్న పళంగా తన వస్తువుల్ని ఆఫీసు నుంచి తరలించడమే కాకుండా.. వీడియోలను కూడా సోషల్ మీడియా నుంచి తీసేయాలని హెచ్చరించారు. లేకపోతే ఏం జరుగుతుందో సిమోన్‌కు తెలుసు. జీతం చాల్లేదని ఆఫీసును వాడుకుంటే.. మళ్లీ ఆ ఆఫీసుకు కూడా వచ్చే పరిస్థితి ఉండదని కంగారు పడి వారు చెప్పినట్లే చేశాడు. ఎంతో కొంత భరించి.వేరే ఇంటికి వెళ్లిపోయాడు.
సిమెన్ చేసింది కామెడీ కాదు. సీరియస్‌గానే తన పరిస్థితిని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా చిరు ఉద్యోగుల బాధలు అలానే ఉన్నాయని సిమోన్‌కు చాలా మంది సంఘిభావం చెప్పారు. ఈ వార్త వైరల్ అవడం.. వెంటనే తొలగించడంతో వీడియోనూ చూసే అవకాశాన్ని చాలా మంది కోల్పోయారు. ఆఫీసులోనే ఇల్లు పెట్టుకునే ఆలోచన ఇచ్చినందుకు చాలా మంది సిమోన్‌కు ధ్యాంక్స్ చెప్పారు.