Malasian Reptile Cafe: ఇక్కడ పాములు, బల్లులు, ఉడతలతో కలిసి భోజనం చేయొచ్చు - ఓ లుక్కేయండి!
Malasian Reptile Cafe: ఆ కేఫ్ కు వెళ్లాలంటే పాములు, ఉడతలు, బ్లలులు వంటి వాటిపై కచ్చితంగా ప్రేమ ఉండాలి. లేకుండా వెళ్తే ఏం అవుతుంది అంటారా.. ఏం కాదు కానీ ఆ కేఫ్ లో అవన్నీ ఉంటాయి.
![Malasian Reptile Cafe: ఇక్కడ పాములు, బల్లులు, ఉడతలతో కలిసి భోజనం చేయొచ్చు - ఓ లుక్కేయండి! Malasian Reptile Cafes Where You Eat Food With Snake Lizards Watch Video Malasian Reptile Cafe: ఇక్కడ పాములు, బల్లులు, ఉడతలతో కలిసి భోజనం చేయొచ్చు - ఓ లుక్కేయండి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/06/b8aed1ebcc1483fb8e9d62c60f383c591678111732012519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Malasian Reptile Cafe: పెట్ కేఫ్ ల గురించి మనందరికీ తెలిసిన విషయమే. ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇలాంటి కేఫ్ లు ఉండగా.. తాజాగా సరీసృపాల కేఫ్ గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆ కేఫ్ నకు వెళ్తే పాములు, బల్లులు, ఉడతలు వంటి సరిసృపాలను చేత్తో పట్టుకొని, ఒంటిపై పాకించుకుంటూ, టేబుల్ పై పెట్టుకుని భోజనం కూడా చేయొచ్చు. మలేషియాకు చెందిన సరీసృపాల ప్రేమికుడు యాప్ మింగ్ యాంగ్.. ప్రీమియం సరీసృపాల కేఫ్‌ను ప్రారంభించాడు.
ఈ కేఫ్ పేరు ఫెంగ్ బాయి డెకోరి. ఇక్కడకు వచ్చే సరిసృపాల ప్రేమికులు.. పెంపుడు జంతువులపై ఎంత ప్రేమను కనబరుస్తారో, వీటిపై కూడా అంతే ప్రేమను చూపిస్తుంటారు. వాటిని ప్రేమగా తాకుతూ, ముద్దులు పెట్టుకుంటూ.. ఒంటిపై పాకించుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. అంతేకాదు కాస్త భయపడే వారు కూడా ఆ కేఫ్ కు వెళ్లి.. సరిసృపాలపై ప్రేమను పెంచుకుంటారని హోటల్ కేఫ్ యజమాని యాప్ మింగ్ యాంగ్ చెబుతున్నాడు. కేఫ్ దేశ రాజధాని కౌలాలంపూర్ శివార్లలో ఉన్నప్పటికీ ఎ్కకువ మంది ఇక్కడకు వస్తుంటారు.
View this post on Instagram
సరిసృపాలను ఎవరూ పట్టించుకోరు - జంతువులను మాత్రమే పట్టించుకుంటారు!
ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మలేషియాలో కిరీటం పెట్టుకున్న పాములు, చిరుత పులి గెక్కోలు మరియు గడ్డం గల డ్రాగన్‌లను చూడొచ్చని హోటల్ నిర్వాహకుడు యాప్ మింగ్ యాంగ్ చెబుతున్నాడు. పిల్లలతో సహా పెద్ద వాళ్లు ఈ కేఫ్ కు వచ్చి ఎంజాయ్ చేస్తుంటారని అందులో వివరించారు. కస్టమర్లు తమకు కావాల్సినవి ఆర్డర్ చేసి అవి వచ్చే వరకు అక్కడున్న సరిసృపాలతో ఆడుకుంటారు. వాటిని చేతులతో పట్టుకొని ఒంటికి హత్తుకుంటారు. కేఫ్ యజమాని యాప్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. ప్రజలు పిల్లులు, కుక్కలు వంటి అందమైన జంతువులను మాత్రమే పట్టించుకుంటారని తెలపారు. కానీ సరీసృపాలు ముఖ్యంగా పాములు వంటి వాటిని వదిలేస్తారని వివరించారు. సరీసృపాల అధ్యయనంలో ఆసక్తి ఉన్న మలేషియన్ల సంఘంలో కేఫ్ యజమాని కూడా ఒకరు.
జపాన్‌లో కూడా వివిధ రకాల కేఫ్‌లు
అదేవిధంగా, జపాన్‌లోని ఒక కేఫ్.. అక్కడికి వచ్చే వినియోగదారులను ఆవరణలోని కొలను నుండి చేపలు పట్టడానికి అనుమతిస్తుంది. ఒసాకాలోని జావు రెస్టారెంట్ ప్రజలను చేపలు పట్టడానికి లేదా రెస్టారెంట్ నుంచి పడవలో కూర్చోవడానికి అనుమతి లభిస్తుంది. కస్టమర్ చేపలను పట్టుకుంటే.. హోటల్ సిబ్బంది ఆ విషయాన్ని మైక్ ద్వారా చెబుతూ.. వారి విజయాన్ని సెలబ్రేట్ చేస్తుంది. అనంతరం వారు చేపలు పడుతుండగా ఫొటోలు తీసి వారికి అందిస్తారు. అంతేకాకుండా తమకు నచ్చి వంటను ఆర్డర్ చేస్తే ఫ్రీగా చేసిస్తారు హోటల్ సిబ్బంది. వీటిలో ముఖ్యంగా సాషిమి, డీప్ ఫ్రైడ్ ఫిష్ ఎక్కువగా ఉంటాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)