Cloud Flare Down: ప్రపంచవ్యాప్తంగా వెబ్‌సైట్స్ డౌన్ - క్లౌడ్‌ఫ్లేర్‌లో సమస్యతో ఆగిన సర్వీస్
ఒక్కసారిగా వెబ్‌సైట్స్ ఆగిపోయాయి. అన్నింటిలో 500 ఎర్రర్ రావడంతో కాసేపు టెన్షన్ టెన్షన్.
ప్రపంచవ్యాప్తంగా చాల వెబ్‌సైట్స్ పని చేయడం లేదు. వెబ్‌సైట్ క్లిక్ చేస్తే 500 ఎర్రర్ చూపిస్తున్నాయి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ట్రేడింగ్ యాప్ జెరోధా, అప్‌స్టాక్స్ లాంటి ఫేమస్ యాప్స్ కూడా కనెక్టివిటీ సమస్యను ఎదుర్కొంటున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సమస్యపై జెరోధా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో స్పందించాల్సి వచ్చింది. కొన్ని ISPలలోని క్లౌడ్‌ఫ్లేర్ నెట్‌వర్క్ ద్వారా కైట్‌లో కనెక్టవిటీ సమస్య వచ్చినట్టు తమ దృష్టికి వచ్చిందని సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దయచేసి ప్రత్యామ్నాయ ఇంటర్నెట్ కనెక్షన్‌ని ఉపయోగించుకోవాలని సూచించింది.
-
Cloudflare (network transit, proxy, security provider) used by most of the internet businesses around the world, is having a global outage. If you are unable to use our websites or apps, please try switching to a different ISP as a different route may work. pic.twitter.com/5NYsDJw6Vv
— Zerodha (@zerodhaonline) June 21, 2022
ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాపార సంస్థలు ఈ క్లౌడ్‌ఫ్లేర్ (నెట్‌వర్క్ ట్రాన్సిట్, ప్రాక్సీ, సెక్యూరిటీ ప్రొవైడర్) ఉపయోగించుకుంటున్నాయి. దీంట్లోనే సమస్య ఏర్పడింది. ఒక వేళ ఎవరైనా జెరోధా వెబ్‌సైట్‌లు లేదా యాప్‌లను ఉపయోగించడంలో సమస్య ఉంటే... వేరే ISPకి మారడానికి ప్రయత్నించాలని జెరోధా ట్వీట్టర్‌లో అభ్యర్థించింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
డౌన్ డైరెక్టర్‌లో చూస్తే జెరోధా కాకుండా చాలా వ్యాపార సంస్థలు ఈ సమస్యను ఎదుర్కొన్నాయి. క్లౌడ్‌ఫ్లేర్ వచ్చిన సమస్య కారణంగానే ఈ సమస్య తలెత్తినట్టు చూపిస్తోంది. అమెజాన్ సర్వర్ కూడా ఇదే తలనొప్పి తప్పలేదు.
గంట తర్వాత పరిస్థితి కూల్‌డౌన్ అయింది.
Cloudflare network is back to normal and all sites are functional now.
— Zerodha (@zerodhaonline) June 21, 2022