Kamala Harris: చిన్నప్పుడు ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
US Presidential Election | అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ భారత్ తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. భారత్‌కు వచ్చి దీపావళి చేసుకునేదాన్నని తెలిపారు.
Kamala Harris Recalls How Her Mother Shyamala Harris Take Her To India On Diwali : వాషింగ్టన్: అమెరికాలో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరుకుంది. డొనాల్డ్ ట్రంప్, ఇటు కమలా హ్యారిస్ హోరాహోరాగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. తమను ఎందుకు గెలిపించాలో అమెరికా ఓటర్లకు వివరిస్తున్నారు. ముఖ్యంగా ప్రవాస భారతీయుల ఓట్లకు గాలం వేస్తేనే అధ్యక్ష పీఠంపై కూర్చుంటామని తెలిసి భారత్ తో అనుబంధాన్ని, వారు ఎంత ప్రత్యేకమో గుర్తుచేసుకుంటున్నారు. అమెరికా అధ్యక్ష రేసులో నిలిచిన డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. చిన్నతనంలో తల్లి శ్యామలా హ్యారిస్ తనను ప్రతి ఏడాది దీపావళికి భారత్ కు తీసుకువచ్చేవారని గుర్తు చేసుకున్నారు. మరోవైపు క్యాన్సర్ బారిన పడిన తల్లి పరిస్థితిని తెలిపారు.
కమలా హ్యారిస్ మాట్లాడుతూ.. ‘చిన్నతనంలో దాదాపు ప్రతి సంవత్సరం దీపావళికి మేం భారత్‌కు వచ్చే వాళ్లం. మా అమ్మ మమ్మల్ని దీపావళి పండుగకు సొంతూరుకు తీసుకువచ్చేది. అప్పుడు మేం మా తాతలు, అమ్మమ్మ, అత్తామామలు, పిన్ని బాబాయిలతో కలిసి సరదాగా గడిపేవాళ్లం. అమ్మ నన్ను, నా సోదరిని ఎంతో కష్టపడి పెంచింది. అదే సమయంలో వారసత్వ విలువల్ని మాకు నేర్పించిందని చెప్పడానికి ఎంతో గర్వంగా ఉందని’ దక్షిణాసియాకు చెందిన ది జాగర్‌నాట్ మీడియాతో కమలా హ్యారిస్ తన చిన్నతనంలో భారత్‌కు ఎప్పుడు వచ్చేవారు లాంటి పలు విషయాలు షేర్ చేసుకున్నారు.
తిరువారూర్‌లోని తులసేంద్రపురం గ్రామంలో కమలా హారిస్ బ్యానర్
‘అమెరికా ఉపాధ్యక్షురాలిగా నా ఇంట్లో దీపావళి వేడుకలు నిర్వహించడాన్ని గౌరవంగా భావిస్తా. ఇది కేవలం సెలవుదినాన్ని జరుపుకోవడం మాత్రమే కాదు, దక్షిణాసియా అమెరికన్లకు చెందిన గొప్ప చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని జరుపుకోవడానికి తగిన సమయం. వీరి అభివృద్ది, భాగస్వామ్యం కోసం అమెరికా కట్టుబడి ఉంటుందని వాగ్దానం చేస్తున్న.
కేవలం 19 ఏళ్ల వయస్సులో అమ్మ శ్యామలా హారిస్ ఒంటరిగా భారతదేశం నుంచి అమెరికాకు ప్రయాణించారు. నా తల్లి తన జీవితంలో రెండు లక్ష్యాలను కలిగిఉన్నారు. ఆమె ఇద్దరు కుమార్తెలైన నన్ను, నా సోదరి మాయను పెంచి పెద్దచేయడం. మరోవైపు తన రొమ్ము క్యాన్సర్‌ను నయం చేసుకోవడం ఆమె ముందున్న లక్ష్యాలు.
చిన్నతనంలో మేం భారతదేశానికి (మద్రాస్) వెళ్లినప్పుడు తాత పి.వి. గోపాలన్‌ను కలిసి వారితో సరదాగా గడిపేవాళ్లం. మా తాత రిటైర్డ్ సివిల్ సర్వెంట్. బీచ్‌లో ఎక్కువసేపు నడవడంటో ఆయన దినర్య మొదలవుతుంది. రిటైర్డ్ అయిన ఆయన ప్రజాస్వామ్యం గురించి, పౌర హక్కుల ప్రాముఖ్యతను ఆయన నుంచి నేర్చుకున్నాను. ఆయన వీటిపై నాకు ఎన్నో విషయాలు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కొనసాగించాలని తద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేవారు. ఆ పాఠాల నుంచి స్ఫూర్తి పొందిన నేను ఈరోజు అమెరికా ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నాను. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష రేసులో నిలిచాను. మా తాత చెప్పిన విషయాలను జీవితాంతం గుర్తుంచుకుంటాను, ఆయన మాటలు నాలో స్ఫూర్తిని రగిలించాయి.
Also Read: Hamas Vs Israel: హమాస్ కీలక నేత కసబ్‌ను హతమార్చిన ఇజ్రాయెల్
"దక్షిణాసియా అమెరికన్లు ఆరోగ్య సంరక్షణపై అంతగా ఫోకస్ చేయరు. ముఖ్యంగా గుండె, మధుమేహం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రెసిడెంట్ జో బిడెన్‌తో కలిసి నేను సీనియర్ సిటిజన్లకు ఇన్సులిన్ ధరలను 35 డాలర్లకు తగ్గించాం. నా తల్లికి కేన్సర్ వచ్చినప్పుడు, ఆమె కోసం చేయాల్సినదంతా చేశా. లకు వాటిని తగ్గించడానికి పని చేస్తుంది" అని ఆమె రాసింది. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను సరిదిద్దుతాం. సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేయడం. ద్వైపాక్షిక సరిహద్దు భద్రతా బిల్లు ద్వారా మార్పులు తీసుకొస్తాం. దక్షిణాసియా వాసులకు అమెరికాలో సమస్యలు పరిష్కారం చూపుతాం’ అన్నారు కమలా హ్యారిస్.
ట్రంప్ అధ్యక్షుతై 2025లో ఆర్థిక మాంధ్యం
అమెరికా అధ్యక్ష పదవికి డొనాల్డ్ ట్రంప్ కరెక్ట్ కాదు, అతను వైట్ హౌస్‌కి తిరిగివస్తే పరిణాలు తీవ్రంగా ఉంటాయన్నారు కమలా హ్యారిస్. ట్రంప్, అతని మిత్రులు సామాజిక భద్రతను, వైద్య వ్యవస్థను దిగజార్చే అవకాశం ఉంది. ట్రంప్ విధానాలతో 2025 మధ్యలోనే ఆర్థిక మంద్యం వచ్చే అవకాశం ఉందన్నారు. రోజువారీ అవసరాలపై సైతం కనీసం 20 శాతం పన్ను విధించాలని ట్రంప్ భావిస్తారు. దీనివల్ల అమెరికాలో ఒక్క కుటుంబానికి ఏడాదికి అదనంగా 4,000 డాలర్లు ఖర్చవుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారని కమలా హారిస్ ఆ జర్నల్ లో రాసుకొచ్చారు.