Attack on Shinzo Abe: జపాన్ మాజీ ప్రధానిపై తుపాకీ కాల్పులు, కుప్పకూలిన షింజో అబే! వీడియో
Attack On Shinzo Abe: పశ్చిమ జపాన్ లోని నారా అనే నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో షింజో అబే ప్రసంగిస్తుండగా, ఆయనపై కాల్పులు జరిగాయి.
Gun Fire On Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని అయిన షింజో అబేపై కాల్పులు జరిగాయి. శుక్రవారం పశ్చిమ జపాన్‌లో ఈ ఘటన జరిగినట్లుగా ఆ దేశ ప్రముఖ మీడియా సంస్థ NHK వెల్లడించింది. ఈ నేరానికి పాల్పడ్డ అనుమానితుడ్ని పోలీసులు అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నట్లుగా తెలిపింది. అతని నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ జపాన్ లోని నారా అనే నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో షింజో అబే ప్రసంగిస్తుండగా, ఆయనపై కాల్పులు జరిగాయి. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అక్కడే ఉన్న NHK రిపోర్టర్ మాట్లాడుతూ.. అదే సమయంలో ఒక గన్ షాట్ శబ్దం తాను విన్నానని తెలిపారు. కాల్పుల వల్ల మాజీ ప్రధాని పడిపోయారని, ఆయనకు చాలా బ్లీడింగ్ కూడా అయిందని చెప్పారు.
Must See: షింజో అబేపై కాల్పులు జరిపింది ఇతనే, 10 అడుగుల దూరంలోనే, పట్టేసిన పోలీసులు - ఫోటోలు చూడండి
Shinzo Abe shot in the chest in Nara. Attacker caught. pic.twitter.com/WfkUDH9lfo
— Gordon Knight (@GordonlKnight) July 8, 2022
అక్కడి అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. షింజో అబే స్పృహ తప్పి పడిపోయారని, ఆయన ఎలాంటి కదలిక లేకుండా ఉన్నారని చెప్పారు. తుపాకీ కాల్పుల అనంతరం ఆయనకు బాగా రక్తం కారుతుండగా, వెంటనే ఆస్పత్రికి తరలించినట్లుగా చెప్పినట్లుగా అక్కడి వార్తా పత్రికలు రిపోర్ట్ చేశాయి.
ఘటనా స్థలం పరిసర ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లుగా ‘ది జపాన్ టైమ్స్’ రిపోర్ట్ చేసింది.
Must See: షింజో అబేపై కాల్పులు జరిపింది ఇతనే, 10 అడుగుల దూరంలోనే, పట్టేసిన పోలీసులు - ఫోటోలు చూడండి
Due to heavy traffic caused by news of an assassination attempt on Shinzo Abe, users may experience difficulty loading pages on The Japan Times. Please try again later. We will update you when the site stabilizes.
— The Japan Times (@japantimes) July 8, 2022