అన్వేషించండి

Tarun Ghulati Meets Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దతు కోరిన లండన్ మేయర్ అభ్యర్ధి

Pawan Kalyan Telugu News: లండన్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త తరుణ్ గులాటీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు.

Tarun Ghulati Meets Pawan Kalyan: హైదరాబాద్: టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రత్యక్షంగా ఆయన రాజకీయాల్లో సంచలనాలు చేయకపోయినా, పరోక్షంగా ఆయన ప్రభావం మాత్రం గట్టిగానే ఉంటుందని తెలిసిందే. ఈ క్రమంలో లండర్ మేయర్ ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని పవన్ కళ్యాణ్ ను పారిశ్రామికవేత్త తరుణ్ గులాటీ (Tarun Gulati) కోరారు.

లండన్ మేయర్ ఎన్నికలలో భారత సంతతికి చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి, పారిశ్రామికవేత్త తరుణ్ గులాటీ పోటీ చేస్తున్నారు. ఆయన బుధవారం హైదరాబాద్ లో జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ ని కలిశారు. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న గులాటీ లండన్ మేయర్ ఎన్నికల్లో తనకు మద్దతు పలకాల్సిందిగా జనసేనాని పవన్ కళ్యాణ్ ని కోరారు. తాను పోటీ చేస్తున్న ప్రాంతంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు భారీ సంఖ్యలులో ఉన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. తరుణ్ గులాటీ అభ్యర్థనను అప్పటికప్పుడూ పవన్ కళ్యాణ్ స్వాగతించారు. 
భారత సంతతికి చెందిన తరుణ్ గులాటి లండన్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేయడం సంతోషదాయకం అన్నారు. తన అభిమానులు, జనసేన శ్రేణులతోపాటు తెలుగువారు, భారతీయులంతా ఆయన విజయానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కోరారు. తనను కలసిన గులాటీకి పవన్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. 

Tarun Ghulati Meets Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ మద్దతు కోరిన లండన్ మేయర్ అభ్యర్ధి

మే 2, 2024న లండన్ మేయర్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి.  బ్రిటన్‌లోని ప్రముఖ రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ విజయం కోసం కసరత్తు మొదలుపెట్టేశారు. అందుకు సంబంధించి పలువురు కీలక వ్యక్తులను కలిసి తమకు ఎన్నికల్లో మద్దతు తెలపాలని కోరుతున్నారు. మేయర్ పదవికి 63 ఏళ్ల తరుణ్ గులాటీ పోటీ చేస్తున్నారని తెలిసిందే.  తరుణ్ గులాటీ మూలాలు ఢిల్లీలో ఉన్నాయి. అయితే యూకే వెళ్లి ఆయన కుటుంబం లండన్ లో స్థిరపడింది.  గులాటీ వ్యాపారవేత్త, సనాతన ధర్మాన్ని పాటిస్తారు. మెరుగైన పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేయడం, పేదలకు తక్కువ ధరలో ఇళ్ల నిర్మాణం లాంటి కీలకాంశాలతో తరుణ్ గులాటీ మేయర్ రేసులో ముందంజలో ఉన్నారు. ప్రస్తుత మేయర్ సాదిక్ ఖాన్ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను రద్దు చేయాలని భావిస్తున్నారు గులాటీ.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget