By: ABP Desam | Updated at : 14 Sep 2023 07:27 PM (IST)
Edited By: Pavan
100 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టిన కారు, 100 అడుగుల దూరంలో ఎగిరిపడ్డ జాహ్నవి శరీరం
Jaahnavi Kandula: తెలుగమ్మాయి జాహ్నవి కందుల మృతి అమెరికా పోలీసు అధికారి తీరు ఇప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రజాప్రతినిధులు స్పందిస్తూ ఈ విషయంలో అమెరికా పోలీసు అధికారి తీరును తప్పుపడుతున్నారు. అమెరికాలోని సియాటిల్ నగరంలో పోలీసు వాహనం ఢీకొనడంతో జాహ్నవి కందులా అనే తెలుగమ్మాయి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మరో పోలీసు అధికారి మాట్లాడుతూ నవ్వుకున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో ప్రతి ఒక్కరూ దీనిపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే జాహ్నవి మృతిపై మరికొన్ని వివరాలు బయటకు వచ్చాయి.
జాహ్నవి మృతి చెందిన సమయంలో ఆ పోలీసు వాహనాన్ని కెవిన్ డేవ్ అనే పోలీసు అధికారి డ్రైవ్ చేస్తున్నట్లు తేలింది. ఆయన బాడీకామ్ ఫుటేజ్ ను సియాటిల్ పోలీసులు రిలీజ్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో పోలీసు కారు వేగం గంటకు 119 కిలోమీటర్లుగా ఉంది. కారు ఢీకొన్న తర్వాత జాహ్నవి శరీరం దాదాపు 100 అడుగుల దూరంలో పడింది. క్రాస్ వాక్ వద్ద జాహ్నవి రోడ్డు దాటుతున్న సమయంలో అతి వేగంగా వచ్చిన పోలీసు కారు ఆమెను ఢీకొట్టింది. జీబ్రా క్రాసింగ్ వద్ద కాకుండా, మరో చోటు నుంచి జాహ్నవి రోడ్డు క్రాస్ చేసినట్లు తెలుస్తోంది.
జాహ్నవిని ఢీకొట్టడానికి ఒక్క సెకను ముందు డ్రైవర్ డేవ్ బ్రేకులు వేశాడని, ఆ సమయంలో కారు 101 కిలోమీటర్ల వేగంతో ఉందని పోలీసు రిపోర్టులో పేర్కొన్నారు. కారు బలంగా తాకడం వల్ల జాహ్నవి శరీరం 100 అడుగుల దూరంలో పడినట్లు రిపోర్టులో తెలిపారు. వాహనం ఢీకొన్న తర్వాత జాహ్నవిని హార్బర్‌వ్యూవ్ మెడికల్ సెంటర్ కు తీసుకెళ్లారు. కాగా.. జాహ్నవిని ఢీకొన్న ప్రాంతంలో స్పీడ్ లిమిట్ గంటకు 40 కిలోమీటర్లు మాత్రమే ఉండాలి.
కేంద్రమంత్రికి సీఎం జగన్ లేఖ
యూఎస్ పోలీసులు మాట్లాడిన తీరుపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే కేంద్ర మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు. ఏపీకి చెందిన కందుల జాహ్నవి 23వ తేదీన రోడ్డు దాటుతుండగా... వేగంగా వచ్చి పోలీసులు వాహనం ఢీకొట్టి చనిపోయినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఏపీ సర్కారు వెంటనే స్పందించిందని.. తెలుగు అసోసియేషన్ ను సంప్రదించి ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అలాగే హైదరాబాద్ విమానాశ్రయం నుంచి కర్నూలు వరకు ప్రత్యేక అంబులెన్సు కూడా కేటాయించినట్లు లేఖలో పేర్కొన్నారు.
అయితే కందుల జాహ్నవి మృతిపై యూఎస్ పోలీసులు కామెంట్లు చేయడం దారుణం అన్నారు. అమాయక యువతి మరణాన్ని అపహాస్యం చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అమెరికాలో ఉండే భారతీయ విద్యార్థుల్లో ధైర్యం కల్పించాలంటే... తప్పు చేసిన పోలీసు అధికారిపై కఠిన చర్యలకు సిఫార్సు చేయాలని కేంద్రమంత్రి జైశంకర్ కు సూచించారు. అలాగే ఈ కేసును పూర్తిగా దర్యాప్తు చేయించాలని, వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని సీఎం జగన్ అభ్యర్థించారు. నిజాలను బయటకు తీసుకొచ్చి జాహ్నవిక న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ముఖ్యమంగా ఈ సమస్యను యూఎస్ ప్రభుత్వంలోని సంబంధిత అధికారులతో తక్షణమే చేపట్టడానికి, భారత దేశంలోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాయబారితో సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు సూచించాలని కోరుతూ.. అభ్యర్థిస్తున్నట్లు లేఖలో వెల్లడించారు.
కెనడా ఆర్మీ వెబ్‌సైట్‌ని హ్యాక్ చేసిన ఇండియన్ హ్యాకర్స్! మరింత పెరిగిన ఉద్రిక్తతలు
బిచ్చగాళ్లను ఎగుమతి చేస్తున్న పాకిస్థాన్, వీసాలు తీసుకుని మరీ విదేశాలకు!
Jaishankar-Blinken Meet: కాసేపట్లో జైశంకర్, బ్లింకెన్ భేటీ-మళ్లీ పాత పాటే పాడిన అమెరికా
World University Rankings 2024: వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల్లో 91 భారతీయ విశ్వవిద్యాలయాలకు చోటు
India-Canada Row: కెనడా, భారత్ మధ్య విభేదాల వేళ అమెరికా విదేశాంగ మంత్రితో సమావేశం కానున్న జైశంకర్
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - దానం ఇలా కూడా చేయొచ్చు
Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
/body>