Gaza News: ఇకపై హాస్పిటల్స్‌పై దాడి చేయం, ఆ చిన్నారులను రక్షిస్తాం - ఇజ్రాయేల్ కీలక ప్రకటన
Israel Gaza Attack: ఇకపై గాజాలోని హాస్పిటల్స్‌పై దాడి చేయమని ఇజ్రాయేల్ సైన్యం వెల్లడించింది.
![Gaza News: ఇకపై హాస్పిటల్స్‌పై దాడి చేయం, ఆ చిన్నారులను రక్షిస్తాం - ఇజ్రాయేల్ కీలక ప్రకటన Israel Gaza Hamas Palestine Attack Israel says ready to evacuate babies from Gaza hospitals Gaza News: ఇకపై హాస్పిటల్స్‌పై దాడి చేయం, ఆ చిన్నారులను రక్షిస్తాం - ఇజ్రాయేల్ కీలక ప్రకటన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/12/6fa7e64a79b2e6e88671cfa31af481e11699765393801517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Israel Gaza War:
హాస్పిటల్‌పై దాడి..
Gaza News: ఇజ్రాయేల్, హమాస్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో (Israel Hamas War) వేలాది మంది పౌరులు బలి అవుతున్నారు. గాజాలోని అతిపెద్ద హాస్పిటల్‌పై (Al Shafa Hospital)ఇజ్రాయేల్ దాడి చేయడం యుద్ధ తీవ్రతను మరింత పెంచింది. ఐసీయూలోని రోగులు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచి వేసింది. గాజాపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు దాడులు చేస్తున్నట్టు ఇజ్రాయేల్ సమర్థించుకుంటున్నప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయేల్ కీలక నిర్ణయం తీసుకుంది. హాస్పిటల్‌లోని చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొస్తామని హామీ ఇచ్చింది. ఈ దాడుల్లో ఇద్దరు పసికందులు మృతి చెందారు. పదుల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలతో పోరాడుతున్నారు. వాళ్లకు వైద్యం అందించేందుకూ వీల్లేకుండా పోయింది. అందుకే ఇజ్రాయేల్ మిగతా చిన్నారుల ప్రాణాలకు భరోసా ఇస్తోంది. అంతే కాదు. వాళ్లకు అవసరమైన చికిత్స అందించేందుకూ సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయేల్ సైన్యం (Israel Army) ప్రకటించింది. పాలస్తీనా అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం...చాలా మంది చిన్నారులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వాళ్లకు వైద్యం అందించాలన్నా హాస్పిటల్‌లో కరెంట్ లేదు. ఫ్యుయెల్ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల వైద్యులు చేతులెత్తేశారు.
WHO ఆందోళన..
ఇకపై హాస్పిటల్స్‌పై దాడులు చేయకూడదని నిర్ణయించుకుంది ఇజ్రాయేల్ సైన్యం. ఈ ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. Al Shafa హాస్పిటల్‌తో కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయిందని వెల్లడించింది. ఐక్యరాజ్య సమితి కూడా ఆవేదన వ్యక్తం చేసింది. గాయపడ్డ వాళ్లకు మెరుగైన చికిత్స అందించాలని సూచించింది. ఇజ్రాయేల్ తక్షణమే దాడులు ఆపేయాలని చెప్పింది. అటు అమెరికా ఇజ్రాయేల్‌కి మద్దతునిస్తున్నప్పటికీ మానవతా సాయం అందించేందుకైనా యుద్ధానికి విరామం ఇవ్వాలని కోరుతోంది. అందుకు ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) అంగీకరించడం లేదు. పైగా ఫుల్ ఫోర్స్‌తో యుద్ధం చేస్తామని స్పష్టం చేశారు.
"హమాస్, ఐసిస్ ఉగ్రవాదులపై మేం పూర్తి స్థాయిలో యుద్ధం చేస్తున్నాం. ఇది మున్ముందు మరింత పెరిగే అవకాశముంది. మేం విజయం సాధించడం తప్ప మరే ప్రత్యామ్నాయమూ లేదు. హమాస్‌ని పూర్తిగా అంతం చేసి వాళ్ల బందీలో ఉన్న మా పౌరులను విడిపించుకుంటాం. ఇప్పటికే గాజా సిటీని IDF చుట్టుముట్టింది. నా ఆదేశాలకు తగ్గట్టుగానే సైన్యం పని చేస్తోంది. బందీలుగా ఉన్న ఇజ్రాయేల్ పౌరులను విడిపించేంత వరకూ యుద్ధం ఆగదు"
- బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయేల్ ప్రధాని
ఉత్తర గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్ షిపాపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. దీంతో బాంబుల మోతతో హాస్పిటల్ అంధకారంలోకి వెళ్లింది. ఆస్పత్రి వద్ద హమాస్ దళాలపై బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దీంతో ఆస్పత్రి అంధకారంలోకి వెళ్లగా.. రోగులు కూడా చనిపోతున్నారు. కరెంట్, ఇంధనం లేకపోవడంతో జనరేటర్ ఆగిపోవడంతో ఐసీయూలోని రోగులు మరణిస్తున్నారు. కరెంట్ లేకపోవడంతో ఓ పసికందుతో పాటు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఆస్పత్రిలోని పౌరులు భయంతో వణికిపోతున్నారు.
Also Read: Iceland Earthquakes: 14 గంటల్లోనే 800 సార్లు కంపించిన భూమి, ఐస్‌లాండ్‌లో ఎమర్జెన్సీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)