Suicide Bombers: టిక్ టాక్ ద్వారా సూసైడ్ బాంబర్స్ రిక్రూట్‌మెంట్.. అక్కడ ఆత్మాహుతి దాడులకు ISIS భారీ కుట్ర!
ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమమైన టిక్ టాక్ సాయంతో ఐఎస్ఐఎస్ సంస్థ రిక్రూట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మాహుతి దాడులకు ఉగ్రసంస్థ ప్లాన్ చేసింది.
పరిస్థితుల ప్రభావమో లేక ఏమీ దక్కలేదని కొన్ని విషయాల్లో సహనంతోనో కొందరు చెడుదారి పడుతుంటారు. నిరుద్యోగం లాంటి సమస్యలతో, ఇతర మతాలపై రగిలిపోయే కొందరు ఈ ఉగ్రవాదం వైపు వెళ్తున్నారు. ఇదే అదనుగా భావించి ఉగ్రసంస్థలు టెక్నాలజీ సాయంతో అమాయకులును తమ వైపు తిప్పుకుంటోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐఎస్ఐఎస్) ఆన్‌లైన్ ద్వారా రిక్రూట్ చేసుకుందని షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.
ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమమైన టిక్ టాక్ సాయంతో ఐఎస్ఐఎస్ సంస్థ రిక్రూట్ చేసుకున్నట్లు గుర్తించారు. టిక్ టాక్ యాప్ లో వీడియోలు చేసి వాటి ద్వారా యువకులను తమ వైపు తిప్పుకునేందుకు ఉగ్రసంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ముస్లిమేతరులపై ద్వేషం, ఈర్ష్య, అసూయ ఉండే యువకులను లక్ష్యంగా చేసుకుని ఐఎస్ఎస్ టిక్ టాక్ ద్వారా నియామకాలు చేపట్టి ఉగ్రసంస్థలో శిక్షణ ఇస్తుందట. సన్ మీడియాలో దీనిపై ఓ వచ్చిన కథనం ప్రకారం.. ఐఎస్ఎస్ డజన్ల కొద్ది టిక్ టాక్ ఖాతాలను క్రియేట్ చేసింది. క్రిస్మస్ పండుగ, సెలబ్రేషన్స్ సమయంలో ఉగ్రదాడులకు ఐఎస్ఎస్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Hyderabad: రూ.99కే బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్.. టెంప్ట్ అయినందుకు రూ.33 లక్షలు హాంఫట్, ఏం జరిగిందంటే..
#EXCLUSIVE: ISIS using TikTok to recruit young suicide bombers in bid to carry out Christmas attacks https://t.co/hxwA5p39IO pic.twitter.com/vDAWL3ieLC
— The US Sun (@TheSunUS) November 21, 2021
క్రిస్మస్ టార్గెట్‌గా దాడులు..
ఉగ్రసంస్థలు క్రిస్మస్ సెలబ్రేషన్స్ సమయంలో ఆత్మాహుతి దాడులు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు టిక్ టాక్ యాప్ ద్వారా రిక్రూట్‌మెంట్ చేపట్టి ఉగ్రదాడులకు ప్లాన్ చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా వీడియోలు రూపొందించి ఐఎస్ఎస్ తమ గ్రూపులలో పోస్ట్ చేసింది. పాశ్చాత్య దేశాల్లో క్రిస్మస్ సమయంలో భారీ సమూహాలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులు చేసేందుకు ఐఎస్ఐఎస్ ప్రత్యేకంగా శిక్షణ ఇస్తోంది. అమెరికా, యూరప్ దేశాల్లో క్రిస్మస్ సంబరాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. కొన్ని నెలల ముందుగానే ఉగ్రవాదులు అమాయకులైన యువతను ప్రలోభపెట్టి రిక్రూట్ మెంట్ చేసుకుంటున్నారు.
Also Read: పరాయి వ్యక్తితో బెడ్‌రూంలో భార్య, భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయి.. చివరికి ఏమైందంటే..
‘వారికి అల్లాపై నమ్మకం లేదు. అలాంటి వారిని భయపెట్టాలి. ఆ బానిసలకు శిక్ష విధించాలంటూ’ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. క్రిస్మస్ సంబరాలను ఆ వీడియోలో చూపించారు. వీరులారా సిద్ధంగా ఉండండి. అల్లా సేవకులు ఇందుకు వెనుకాడరంటూ ప్రచారం జరిగింది. అంటే క్రిస్మస్ టైమ్ లో ఆత్మాహుతి దాడులు చేసేందుకు ఐఎస్ఎస్ ప్లాన్ చేసినట్లు సన్ మీడియా రిపోర్ట్ చేసింది. గత 18 నెలలుగా ఆ సోషల్ మీడియా అకౌంట్ రన్ చేస్తున్నారు. మరికొన్ని ఖాతాల్లోనూ ఈ తరహా వీడియోలతో సూసైడ్ బాంబర్స్‌ను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. లివర్ పూల్ లో కారు బాంబు దాడితో యూకేలో అధికారులు అప్రమత్తమయ్యారు. నవంబర్ 17న ఇటలీలోని మిలాన్ పోలీసులు 19 ఏళ్ల యువతిని ఉగ్రదాడులకు కుట్ర ఆరోపణలతో అరెస్ట్ చేశారు. కాబూల్‌లో జరిగిన బాంబు దాడిలో 183 మంది మరణించడం ఇలాంటి ఘటనలకు నిదర్శనం.
2019లో ఈస్టర్ సందర్భంగా ఐఎస్ఐఎస్ శ్రీలంకలో వరుస బాంబు దాడులకు పాల్పడింది. వందలాది మంది దుర్మరణం చెందడా, వేలాది మంది గాయపడ్డారు. మొత్తం 8 చోట్ల లంకలో బాంబు దాడులు జరగడం తెలిసిందే.