(Source: ECI/ABP News/ABP Majha)
India on Pakistan: పాకిస్థాన్ తీరుపై భారత్ మరోసారి గరం గరం.. ఇమ్రాన్ తీరు ప్రస్తావించి గట్టి షాక్
‘‘పాక్ శాశ్వత ప్రతినిధి శాంతి గురించి యూఎన్‌లో మాట్లాడుతున్నారు. కానీ, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రంఒసామా బిన్ లాడెన్ వంటి ప్రపంచ ఉగ్రవాదులను అమరవీరులుగా కీర్తించారు.’’ అని భారత్ ఆరోపించింది.
ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్ లక్ష్యంగా భారత్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఐక్యరాజ్యసమితి సూత్రాలను ఏమాత్రం పట్టించుకోకుండా, తన పొరుగు దేశాల పట్ల పాకిస్థాన్ పదేపదే సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతోందని భారత్ ఆరోపించింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి ఎ.అమర్ నాథ్ మాట్లాడారు. సోమవారం ఐరాసలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి శాంతి, భద్రతల గురించి యూఎన్‌లో మాట్లాడుతున్నారు. కానీ, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రంఒసామా బిన్ లాడెన్ వంటి ప్రపంచ ఉగ్రవాదులను అమరవీరులుగా కీర్తించారు. పాకిస్థాన్ చాలా వేదికల వద్ద అసత్యాలను ప్రస్తావించే పని చేస్తోంది. ఇవన్నీ కూడా ధిక్కారానికి అర్హమైనవవే’’ అని ఆయన అన్నారు.
Also Read: అక్కడ బంగారం పెట్టుకుని తరలించాలనుకున్నారు.. కానీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో..
నిరాయుధీకరణ మరియు అంతర్జాతీయ భద్రతా సమస్యలు అనే అంశాలపై మొదటి కమిటీ జనరల్ డిబేట్ జరిగింది. ఈ వేదికపై భారత దౌత్యవేత్త ఎ.అమర్ నాథ్ పాక్‌పై విమర్శలు చేశారు.
జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు సహా లడఖ్‌తోపాటు భారతదేశంపై పాకిస్థాన్ అనేకమైన ఆధారాలు లేని ఆరోపణలు చేసింది. ఇవన్నీ భారతదేశ అంతర్గత విషయాలకు సంబంధించినవి కాబట్టి మేం స్పందించాల్సిన అవసరం లేదు. జమ్మూ కశ్మీర్ మొత్తం భూభాగం భారతదేశంలోని అంతర్భాగమే. అంతేకాక, అది భారత్‌తో విడదీయలేనిదని మరోసారి ఈ వేదికపై నేను పునరుద్ఘాటిస్తున్నాను. చివరికి పాకిస్థాన్ అక్రమ ఆక్రమణలో (పీవోకే) ఉన్న ప్రాంతం కూడా భారత్‌లోనే కలిపి ఉంది. కాబట్టి, అక్రమ ఆక్రమణ చేసిన భూభాగాన్ని పాకిస్థాన్ తక్షణమే వదిలి వెళ్లిపోవాలి.’’ అని భారత దౌత్యవేత్త ఎ.అమర్ నాథ్ పాకిస్థాన్‌ను ఉద్దేశించి గట్టిగా మాట్లాడారు.
Also Read: దసరాకు ఇంటికి వెళ్తున్నారుగా.. టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఉంటాయి .. జర చూసుకోండి
Also Read: వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవలకు అంతరాయం. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల ఆందోళన
#UNGA76
— India at UN, NY (@IndiaUNNewYork) October 4, 2021
Watch 📺:
India's Right of Reply at the 1st committee (Disarmament and International Security issues) General Debate@MeaIndia @IndianDiplomacy pic.twitter.com/2e103LCNtq
#IndiainUNSC
— India at UN, NY (@IndiaUNNewYork) October 4, 2021
UNSC Briefing on #Haiti 🇭🇹
Highlights of remarks by PR @AmbTSTirumurti ⤵️@MeaIndia @IndianDiplomacy pic.twitter.com/JMnGtjhB6A