Imran Khan's No-trust Vote: ఇమ్రాన్ ఖాన్ కౌంట్ డౌన్ మొదలు- ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానపై ఈరోజు ఓటింగ్ జరగనుంది.
![Imran Khan's No-trust Vote: ఇమ్రాన్ ఖాన్ కౌంట్ డౌన్ మొదలు- ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్ Imran Khan's No-trust Vote Ahead Of No-Trust Vote, Section 144 In Pak's Islamabad, District Admin Bans Pillion Riding Imran Khan's No-trust Vote: ఇమ్రాన్ ఖాన్ కౌంట్ డౌన్ మొదలు- ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/03/531f8a1c5b698e6dc071d3cbbd266e68_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం కాసేపట్లో ఆ దేశ జాతీయ అసెంబ్లీ ముందు ఓటింగ్‌కు రానుంది. ఈ సందర్భంగా జాతీయ అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇస్లామాబాద్ నగరంలో ప్రభుత్వం సెక్షన్ 144 విధించింది. ఈ ప్రాంతాల్లో ఎలాంటి ప్రదర్శనలు, నిరసనలు నిర్వహించొద్దని ఇస్లామాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా నలుగురి కంటే ఎక్కుమ గుమికూడొద్దన్నారు.
స్పీకర్‌పై
మరోవైపు అవిశ్వాస తీర్మానం ఓటింగ్ జరిగే చివరి నిమిషంలో ప్రతిపక్షాలు మరో ట్విస్ట్ ఇచ్చాయి. నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అసర్ ఖైసర్‌పైనా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.
మెజార్టీకి దూరంలో
పాక్ సంకీర్ణ ప్రభుత్వంలో పీటీఐకి ప్రధాన మిత్ర పక్షం ఎంక్యూఎమ్. ఈ పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులు ఇమ్రాన్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. అయితే వీరంతా ఇప్పుడు ప్రతిపక్ష కూటమికి మద్దతివ్వనున్నారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ మెజార్టీ మార్క్‌ను కోల్పోయారు.
ఎంక్యూఎమ్ సభ్యులు రాజీనామా చేస్తే ఇమ్రాన్ బలం 164కు తగ్గుతుంది. ప్రతిపక్షాల బలం 176కు పెరుగుతుంది. వీరితో పాటు పీటీఐ పార్టీకే చెందిన 24 మంది సభ్యులు ఇమ్రాన్‌పై తిరుగుబాటు చేశారు .
ఎంత కావాలి?
ప్రస్తుత బలాల ప్రకారం ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం నెగ్గేలానే కనిపిస్తోంది. 342 మంది సభ్యులున్న పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ తన బలం నిరూపించుకోవాలంటే 172 మంది సభ్యుల మద్దతు అవసరం.
Also Read: Swiggy Delivery Boy: వీడియో - లవర్స్ మధ్య ఫైట్, వారి మధ్యలోకి దూరి యువతిని చితకబాదిన ‘స్విగ్గి’ బాయ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)