Imran Khan: పాక్ ప్రధానికి ఇమ్రాన్ ఖాన్ డెడ్‌లైన్- 6 రోజుల్లోగా చేయకపోతే!

Imran Khan:

FOLLOW US: 

Imran Khan: 

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ సర్కార్‌కు డెడ్‌లైన్ విధించారు. పాకిస్థాన్‌లో ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఆరు రోజుల్లోగా ప్రకటన చేయాలని అల్టిమేటం జారీ చేశారు. ప్రావిన్సుల్లోని ప్రభుత్వాలను రద్దు చేసి సాధారణ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

లేదంటే

పాకిస్థాన్ ప్రధాని ఈ ప్రకటన చేయకపోతే దేశం మొత్తాన్ని రాజధాని ఇస్లామాబాద్‌కు తీసుకొచ్చి నిరసన చేపడుతానని హెచ్చరించారు. గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో పీటీఐ పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

" ఆజాదీ మార్చ్‌ పేరిట తలపెట్టిన మార్చ్‌కు సుప్రీం కోర్టు అనుమతించినా ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంది. అయినా సరే దీన్ని నిర్వహించాం. సర్కార్‌కు ఆరు రోజులు టైం ఇస్తున్నాం. ఆలోపు దేశంలో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించకపోతే రాజధానిలో భారీ ఎత్తున నిరసన చేపడతాం.                                             "
-ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ మాజీ ప్రధాని

మరోవైపు విదేశాల్లో స్థిరపడిన పాకిస్థాన్‌ సంతతి వారు ఓటు వేసేలా ఇటీవల ఇమ్రాన్‌ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలను ప్రస్తుత పాక్‌ ప్రభుత్వం రద్దు చేస్తూ బిల్లు తీసుకొచ్చింది. దీంతో పాటు ఎన్నికల్లో ఈవీఎంలపై నిషేధం విధిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు జాతీయ అసెంబ్లీ దిగువ సభ ఆమోదం తెలిపింది. బిల్లును ఎగువ సభ అయిన సెనేట్‌కు ఆమోదానికి పంపనున్నారు.

కొత్త ప్రభుత్వం

పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడుసార్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా పని చేసిన నవాజ్ షరీఫ్‌ సోదరుడు షెహబాజ్ షరీఫ్. నవాజ్ షరీఫ్ 2017లో పదవీచ్యుతుడయ్యారు. అవినీతి కేసుల్లో ఆయన జైలు జీవితం గడిపారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్‌లో ఉంటున్నారు. 

షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా పని చేశారు. పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు కూడా ఆయనే. ప్రస్తుతం పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే వీటన్నింటిని మించి షెహబాజ్ ప్రసంగాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడే సమయంలో చేతులను చాలా వేగంగా కదిలిస్తారు. అంతేకాకుండా చాలా ఆవేశంగా మాట్లాడతారు. చాలా సార్లు ఆయన మాట్లాడే సమయంలో ముందు ఉన్న మైకులను కూడా పడేస్తుంటారు.
 
Published at : 27 May 2022 01:47 PM (IST) Tags: Imran Khan Pakistan govt announcing polls

సంబంధిత కథనాలు

UN Spokesperson on Zubair Arrest: జర్నలిస్ట్ జుబైర్ అరెస్ట్‌పై ఐక్యరాజ్య సమితి స్పందన

UN Spokesperson on Zubair Arrest: జర్నలిస్ట్ జుబైర్ అరెస్ట్‌పై ఐక్యరాజ్య సమితి స్పందన

Viral Video: మీరు క్యాచ్‌లు బాగా పడతారా? అయితే గిన్నిస్ రికార్డ్ కొట్టేయొచ్చు!

Viral Video: మీరు క్యాచ్‌లు బాగా పడతారా? అయితే గిన్నిస్ రికార్డ్ కొట్టేయొచ్చు!

Russia-Ukraine War: పుతిన్ కనుక ఓ మహిళ అయి ఉంటే: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

Russia-Ukraine War: పుతిన్ కనుక ఓ మహిళ అయి ఉంటే: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

G7 Summit: భారత కళా నైపుణ్యాన్ని చాటి చెప్పిన మోదీ- జీ7 దేశాధినేతలకు అరుదైన బహుమతులు

G7 Summit: భారత కళా నైపుణ్యాన్ని చాటి చెప్పిన మోదీ- జీ7 దేశాధినేతలకు అరుదైన బహుమతులు

The Diary of a Young Girl : హిట్లర్‌పై అసలైన గెలుపు ఈ చిన్నారిదే ! ఇది కథ కాదు

The Diary of a Young Girl : హిట్లర్‌పై అసలైన గెలుపు ఈ చిన్నారిదే ! ఇది కథ కాదు

టాప్ స్టోరీస్

LPG Cylinder Price: గుడ్ న్యూస్-కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది, ఎంతంటే?

LPG Cylinder Price: గుడ్ న్యూస్-కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది, ఎంతంటే?

Maharashtra News: అసలైన శివసైనికుడు సీఎం అయ్యాడని, ప్రజలు హ్యాపీగా ఉన్నారు-సీఎం షిండే కామెంట్స్

Maharashtra News: అసలైన శివసైనికుడు సీఎం అయ్యాడని, ప్రజలు హ్యాపీగా ఉన్నారు-సీఎం షిండే కామెంట్స్

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

Palnadu Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - స్పాట్‌లో ఇద్దరు వ్యక్తులు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

Palnadu Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - స్పాట్‌లో ఇద్దరు వ్యక్తులు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు