(Source: Poll of Polls)
Coronavirus: దేశంలో కొత్తగా 2,710 కరోనా కేసులు- 14 మంది మృతి
Coronavirus: భారత్‌లో కరోనా కేసులు క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 2,710 కరోనా కేసులు నమోదయ్యాయి.
Coronavirus: దేశంలో కొత్తగా 2,710 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 14 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 2,296 మంది కరోనాను జయించారు. రికవరీ రేటు 98.75గా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
#AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) May 27, 2022
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/IPRc9Q8HMC pic.twitter.com/fuvLfYwbRB
- మొత్తం కరోనా కేసులు: 4,31,47,544
- మొత్తం మరణాలు: 5,24,539
- యాక్టివ్ కేసులు: 15,814
- మొత్తం రికవరీలు: 4,26,07,177
వ్యాక్సినేషన్
దేశవ్యాప్తంగా కొత్తగా 14,41,072 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 192,97,74,973కు చేరింది. ఒక్కరోజే 4,65,840 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
కీలక నిర్ణయం
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ 19 వ్యాక్సిన్ డోసుల మధ్య కాల వ్యవధిని తగ్గించారు. కరోనా వ్యాక్సిన్ రెండో డోసు, మూడో డోసుకు మధ్య కాల వ్యవధిని 9 నెలల నుంచి 90 రోజులకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొవిన్ యాప్ (COWIN App)లో మార్పులు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
బీఎంసీ పరిధిలోని అన్ని ప్రైవేట్ & ప్రభుత్వ టీకా కేంద్రాలకు వ్యాక్సిన్ కోసం ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే అంతర్జాతీయ ప్రయాణం చేయాల్సిన వ్యక్తులకు మాత్రమే కరోనా వ్యాక్సిన్ రెండో, మూడో డోసుల మధ్య తగ్గించిన గ్యాప్ టైమ్ వర్తిస్తుందని బీఎంసీ స్పష్టం చేసింది.
Also Read: MK Stalin With PM : తమిళాన్ని అధికార భాషగా గుర్తించాలి - మోదీని స్టేజ్‌పైనే అడిగిన స్టాలిన్ !