Viral Video: విమానంలో అయినా వీధిపోరాటాలు కామన్ - ఆకాశంలో ప్రవాస భారతీయుడితో అమెరికన్ల స్ట్రీట్ ఫైట్ - వీడియో వైరల్
US Flight: పక్క సీటులో కూర్చున్న వ్యక్తి మిస్ తప్పుగా అర్థం చేసుకోవడంతో ఘర్షణ జరిగింది. విమానం గాల్లో ఉన్నప్పుడు ఇద్దరు ఫైటింగ్ కు దిగారు.

High Voltage Drama On US Flight: పక్కనోళ్లతో గొడవ పెట్టుకుని తన్నుకోవడం సిటీ బస్సుల్లో, రైళ్లల్లో కనిపిస్తూ ఉంటాయి. అమెరికాలో అయితే విమానాల్లోనూ ఇలాగే కొట్టుకుంటారు. తాజాగా విమానంలో స్ట్రీట్ ఫైట్ చేసుకుంటున్న ప్యాసింజర్ల వీడియో ఒకటి వైరల్ అయింది.
అమెరికాలో ఫిలడెల్ఫియా నుంచి మయామీకి వెళ్తున్న ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానంలో, విమానం గాలిలో ఉండగా ఇద్దరు ప్రయాణికులు కొట్టుకోవడం ప్రారంభిచారు. నెవార్క్‌కు చెందిన 21 ఏళ్ల భారత సంతతి వ్యక్తి ఇషాన్ శర్మ, మరో ప్రయాణికుడు కీను ఎవాన్స్ ఈ ఫైటర్లు. ఇషాన్ శ్రమ ఇబ్బంది పెడుతున్నాడని ఎవాన్స్ అతనిపై దాడి చేశాడు. ఇషాన్ శర్మ రివర్స్ లో ఎటాక్ చేశారు.
New: Ishaan Sharma, 21, was arrested for allegedly committing an unprovoked assault on a fellow passenger aboard a Frontier flight to Miami.
— The Facts Dude (@The_Facts_Dude) July 3, 2025
Sharma faces charges of battery and a $500 bond, per jail records.
The victim reported to police that the attack was unprovoked,… pic.twitter.com/9xwPmKNHaF
శర్మ విచిత్రంగా ప్రవర్తించాడని, చంపేస్తానని బెదిరించాడని ఎవాన్స్ పోలీసులకు చెప్పాడు. ఇ,ాన్ శర్మ "హ హ హ హ హ" అని భయంకరంగా నవ్వుతూ నాతో పెట్టుకుంటే చచ్చిపోతావని బెదిరించినట్లుగా వాంగ్మూలం ఇచ్చాడు. ఎవాన్స్ ఈ ప్రవర్తన గురించి ఫ్లైట్ అటెండెంట్లకు తెలియజేసి, సహాయం కోసం అసిస్టెన్స్ బటన్‌ను నొక్కాడు. దీంతో శర్మ ఎవాన్స్ గొంతు పట్టుకుని దాడి చేశాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు, శర్మ ఎవాన్స్ గొంతు పట్టుకోగా, ఎవాన్స్ రివర్స్‌లో దాడి చేశాడు. శర్మకు కంటి పైభాగంలో , కనుబొమ్మపై గాయాలయ్యాయి. ఎవాన్స్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.
अमेरिका में एक भारतीय मूल के 21 वर्षीय व्यक्ति, ईशान शर्मा को फिलाडेल्फिया से मियामी जाने वाली फ्रंटियर एयरलाइंस की उड़ान के दौरान अपने सहयात्री कीनू इवांस पर हमला करने के आरोप में गिरफ्तार किया गया। वायरल वीडियो में दोनों को एक-दूसरे की गर्दन पकड़ने की कोशिश करते देखा गया, जबकि… pic.twitter.com/3tXDEbNpga
— Ashish rai (@journorai) July 4, 2025
విమానం మయామీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే ఇషాన్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 500 డాలర్ల బాండ్‌తో కోర్టు అతన్ని విడుదల చేసింది. శర్మ ధ్యానం చేస్తున్న దాన్ని చూసి ఎవాన్స్ తప్పుగా అర్థం చేసుకున్నాడని శర్మ లాయర్లు కోర్టులో వాదించారు. మయామీ-డేడ్ సర్క్యూట్ జడ్జి గెరాల్డ్ హబ్బర్ట్ ఈ వాదనతో ఒప్పుకోలేదు. అభియోగాలు కొనసాగించాలని నిర్ణయించారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.





















