Mauna Loa Eruption : బద్దలైన అతి పెద్ద అగ్నిపర్వతం, నిప్పుల నదిలా మావోనా లోవా!
Mauna Loa Eruption : ప్రపంచంలోనే అతి పెద్ద అగ్ని పర్వతం మావోనా లోవా బద్దలైంది. 38 ఏళ్లుగా సైలెంట్ గా ఉన్న ఈ అగ్నిపర్వతం ఇప్పుడు లావా వెదజల్లుతోంది.
Mauna Loa Eruption : ప్రపంచంలోనే అతి పెద్ద యాక్టివ్ వాల్కనో బద్దలైంది. హవాయి దీవుల్లో మావోనా లోవా అగ్నిపర్వతం చాలా ఫేమస్. 38 ఏళ్లుగా చాలా సైలెంట్ గా ఉన్న ఈ అగ్నిపర్వతం మళ్లీ బద్దలైంది. ఆకాశంలో ఉవ్వెత్తున ఉబుకుతున్న లావాతో చూడటానికి అద్భుతంగా కనిపిస్తోంది మావోనా లోవా. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు, నాసా చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాయి ఈ ఎరప్షన్ ను. ఎందుకంటే ఇది బద్దలైతే ఎలా ఉంటుందో అనే భయంతో ఇన్నాళ్లు ఉన్నా హవాయి దీవులు కొంచెం ఊపిరి తీసుకున్నాయనే చెప్పాలి. అనుకున్నంత ప్రమాదకరంగా అయితే ఈ విస్ఫోటనం. ఇంటర్నేషనల్ మీడియా, నాసా సైంటిస్టులు మావునా లోవా ఎరప్ట్ అవుతున్నప్పుడు బయటకు ఉబుకుతున్న లావాను ఇదుగో ఇంత అద్భుతంగా క్యాప్చర్ చేస్తున్నారు.
తక్కువ కార్బన్ డై ఆక్సైడ్
అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఎంత ప్రమాదకరమో మన భూమికి అంత మంచిది కూడా. చాలా మంది అనుకునేది ఏంటంటే అగ్నిపర్వతం బద్దలైతే వచ్చే దట్టమైన పొగ వల్ల కార్బన్ డై ఆక్సైడ్ మొత్తం కమ్మేస్తుంది అని. కానీ ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే...అగ్నిపర్వతం నుంచి విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ ఒక సింగిల్ మనిషి నుంచి విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ కన్నా చాలా తక్కువ. ఉదాహరణకు 1980లో మౌంట్ సెయిన్ హెలెన్స్ బద్దలైనప్పుడు 9 గంటల్లో పది మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ను గాల్లోకి పంప్ చేసింది. చాలా ఎక్కువ అనిపిస్తోంది కదా. కానీ ఓ మనిషి పది మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ను గాల్లోకి వదలటానికి తీసుకునే టైమ్ కేవలం రెండున్నర గంటల మాత్రమే. ఇప్పుడు చెప్పండి ఎవరు డేంజరస్.
యాక్టివ్ అగ్నిపర్వతాలు డేంజరస్ కాదు
ఇంకో అద్భుతమైన విషయం చెప్పనా...అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఆ వోల్కనిక్ ఎరప్షన్స్ గాల్లోకి 33 వేల అడుగుల ఎత్తు వరకూ వెళతాయి. కానీ అక్కడకు వెళ్లాక అవి కూల్ అయిపోతాయి. 1991 లో ఇలానే అగ్నిపర్వతం బద్ధలైనప్పుడు అక్కడ ఉష్ణోగ్రత 0.4 నుంచి 0.5 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గింది. 1992-1993 గడచిన 35 ఏళ్లలో అత్యంత చల్లగా ఉన్న సంవత్సరాలుగా హవాయిలో రికార్డ్ అయ్యింది. ఇంకో ఫ్యాక్ట్ చెబుతా హవాయిలో ఉండే అగ్నిపర్వతాలు ప్రపంచంలో చాలా పెద్దవి. యాక్టివ్ అయినా కూడా డేంజరస్ కాదు. ఎందుకంటే స్ట్రాటో స్పియర్ లోకి ఈ ఎరప్షన్స్ పార్టికల్స్ ను పంపించవు. అలానే పెద్దగా కార్బన్ డై ఆక్సైడ్ కూడా గాల్లోకి కలవదు మనుషులతో పోల్చుకుంటే. బట్ సల్ఫర్ డై ఆక్సైడ్ తో ప్రాబ్లం ఉంటుంది. కానీ అదృష్టం కొద్దీ ఇప్పుడు మావునా లోవా నుంచి వస్తున్న సల్ఫర్ డై ఆక్సైడ్ కూడా గుడ్ అండ్ యాక్సెప్టబుల్ లెవల్స్ లో నే ఉంది. నాసా క్లైమేట్ విడుదల చేసిన ఈ మ్యాప్ ఆల్ సేఫ్ అని ఉంది.