Google Fine: వినియోగదారులను మోసం చేసిన గూగుల్, భారీ జరిమానా
Google Fine: మీకు తెలుసా? గూగుల్ నిత్యం మనల్ని ట్రాక్ చేస్తుంది. ఫోన్‌లో లొకేషన్ ఆన్‌లో ఉంటే చాలు మన చరిత్ర అంతా సేకరించేస్తుంది.
Google Fine: మీకు తెలుసా? గూగుల్ నిత్యం మనల్ని ట్రాక్ చేస్తుంది. ఫోన్‌లో లొకేషన్ ఆన్‌లో ఉంటే చాలు మన చరిత్ర అంతా సేకరించేస్తుంది. ఏదైనా కొనాలని రెండు నిమిషాలు మాట్లడితే చాలు దానికి సంబంధించిన యాడ్స్ నిమిషాల్లో మీకు కనిపిస్తాయి. ఏదైనా వస్తువు గురించి ఒక సెకన్ వెతికితే చాలు, దానికి సంబంధించిన ప్రకటనలను చూపిస్తూనే ఉంటుంది. ఈ విషయం ఎప్పుడైనా గమనించారా? వినియోగదారుల డేటాను గూగుల్ ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకుని అమ్ముకుంటోంది. కానీ వినియోగదారులకు మాత్రం అబద్దాలను చెబుతోంది. ట్రాకింగ్‌ను నిలిపివేస్తే లొకేషన్‌ను ట్రాక్ చేయమని గూగుల్ చెబుతోంది.
ఇటీవల గూగుల్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైంది. వినియోగదారుల లొకేషన్ సమాచారం నిరంత్రం ట్రాక్ అవుతుంటాయి. దానిని వివరాలను నిల్వ చేస్తోందని, పైగా వినియోగదారులను తప్పుదారి పట్టించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం సెటిల్‌మెంట్‌లో భాగంగా, గూగుల్ 93 మిలియన్ డాలర్లు జరిమానా విధించింది. దీని విలువ భారత కరెన్సీలో అక్షరాల దాదాపు రూ. 7,000 కోట్లకు పైమాటే.
కాలిఫోర్నియా అటార్నీ జనర రాబ్ బొంటా ఈ పిటిషన్ దాఖల చేశారు. లొకేషన్ డేటాపై గూగుల్ వినియోగదారులను మోసం చేసిందని ఆరోపించించారు. లొకేషన్ ఆఫ్ చేయడం ద్వారా వారి స్థానాన్ని ట్రాక్ చేయమని గూగుల్ చెబుతోందని, కానీ దానికి విరుద్ధంగా, సొంత వాణిజ్య లాభం కోసం దాని వినియోగదారుల కదలికలను ట్రాక్ చేస్తోందని బొంటా పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ దర్యాప్తులో గూగుల్ వినియోగదారుల లొకేషన్ వివరాలను ఎప్పటిప్పుడు సేకరిస్తున్నట్లు తేలిందన్నారు. ఇది వినియోగదారులకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.
నివేదిత ప్రకారం.. గూగుల్ యూజర్ లొకేషన్ డేటాను ఎలా మేనేజ్ చేస్తుందో అటార్నీ జనరల్ కార్యాలయం దానిని ఉదాహరణలతో వివరించింది. లొకేషన్ హిస్టరీని నిలిపివేయడానికి వినియోగదారులను గూగుల్ అనుమతించిందని, అలా చేయడం ద్వారా ఆచూకీని ట్రాక్ చేయదని హామీ ఇచ్చిందన్నారు. కానీ గూగుల్ ఇప్పటికీ వినియోగదారుడి వెబ్, యాప్ యాక్టివిటీ ద్వారా లొకేషన్ ఈ డేటాను సేకరించి, సేవ్ చేసిందని అటార్నీ జనరల్ వాదించారు. అంతేకాకుండా ఈ టెక్ దిగ్గజం లొకేషన్-టార్గెటెడ్ ప్రకటనల ద్వారా వినియోగదారులను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు
అయితే ఈ ఆరోపణలను గూగుల్ అంగీకరించలేదు. కానీ ఇతర అభ్యంతరాలను సెటిల్ చేయడానికి, $93 మిలియన్ చెల్లించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా లొకేషన్ ట్రాకింగ్ ప్రాక్టీసులకు సంబంధించి పారదర్శకతను మెరుగుపరచడం, టార్గెట్ చేసిన యాడ్ ప్రొఫైల్‌లను రూపొందించడానికి లొకేషన్ డేటాను ఉపయోగించే ముందు వినియోగదారులకు ముందస్తు నోటిఫికేషన్‌లు ఇవ్వడం, ఏదైనా గణనీయమైన గోప్యత సంబంధిత మార్పులను అమలు చేయడానికి ముందు గూగుల్ అంతర్గత గోప్యతా వర్కింగ్ గ్రూప్ నుంచి ఆమోదం పొందడం వంటివి ఉన్నాయి. గూగుల్ ప్రతినిధి జోస్ కస్టనెడా మాట్లాడుతూ.. ఇటీవలి సంవత్సరాలలో చేసిన మార్పులకు అనుగుణంగా సమస్యను పరిష్కరించినట్లు చెప్పారు.
వినియోగదారుల అనుమతి లేకుండా గూగుల్‌తో పాటు చాలా కంపెనీలు డేటాను సేకరించి ఉపయోగిస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా కూడా ఇదే విధమైన పరిస్థితిని ఎదుర్కొంది. 1.2 బిలియన్ యూరోలు జరిమానా చెల్లించాలని, అలాగే యూరప్‌లోని ఫేస్‌బుక్ వినియోగదారుల నుంచి సేకరించిన డేటాను యునైటెడ్ స్టేట్స్‌కు తరలించడం నిలిపివేయాలని ఆదేశించింది. యూరోపియన్ యూనియన్ డేటా రక్షణ నిబంధనలను ఉల్లంఘించినందుకు సోషల్ మీడియా దిగ్గజానికి భారీ జరిమానా పడింది.