అన్వేషించండి

France New PM Resigns: ఫ్రాన్స్ కొత్త ప్రధాని రాజీనామా.. తొలి కేబినెట్ భేటీ తర్వాత ఎందుకీ కీలక నిర్ణయం

France New PM Sebastian Lecornu | ఫ్రాన్స్ కొత్త ప్రధాని సెబాస్టియన్ లెకోర్నూ రాజీనామా చేశారు. తొలి కేబినెట్ సమావేశం తర్వాత ఆశ్చర్యకరంగా ప్రధాని తన పదవికి రాజీనామా చేశారు.

France Political Crisis | ప్యారిస్: ఫ్రాన్స్ తీవ్ర రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. ఫ్రాన్స్ నూతన ప్రధానమంత్రి సెబాస్టియన్ లెకోర్నూ నెల తిరగక ముందే తన రాజీనామా చేశారు. తన మంత్రివర్గాన్ని ప్రకటించి, తొలి సమావేశం నిర్వహించిన గంటల వ్యవధిలోనే సెబాస్టియన్ ఫ్రాన్స్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని రాజీనామాను అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వెంటనే ఆమోదించారు. కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన కొద్ది గంటల్లోనే రాజీనామా చేయడంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అధ్యక్షుడి సన్నిహితుడైనా ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా అందర్నీ ఆశ్చర్యానికి లోను చేసింది.

రాజకీయ ఆందోళనల మధ్య కొత్త క్యాబినెట్ ప్రకటన
ఫ్రాన్స్ కొత్త క్యాబినెట్‌ను ఆదివారం ప్రకటించారు.  గతంలో మంత్రులుగా చేసిన వారికి ఎక్కువగా అవకాశం ఇచ్చారు. అసలే దేశం తీవ్ర రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటుందని యూరోన్యూస్ పేర్కొంది. ఫ్రాన్స్ కొత్త ప్రధాన మంత్రి సెబాస్టియన్ లెకోర్ను లెస్ రిపబ్లికన్స్ (LR) నుండి పలువురు నేతలను మంత్రులను తిరిగి నియమించారు. నమ్మదగిన మాక్రోనిస్టులను కేబినెట్ లోకి తీసుకున్నారు. బ్రూనో లె మైర్, ఎరిక్ వోర్త్ వంటి కీలక నేతలు సెబాస్టియన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 

నిరసనలు, మరోవైపు రాజకీయ సంక్షోభం 
ఫ్రాన్స్ రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో నెల రోజుల కిందట సెబాస్టియన్ లెకోర్ను ప్రధాని పదవి చేపట్టారు. ప్రజా వ్యయ కోతలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతుండగా లెకోర్ను తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. న్యాయ వివాదం కొనసాగుతుండగా రచిడా దాటి పదవిలో కొనసాగుతారా, ఆర్మీ, సాయుధ దళాల పోర్ట్‌ఫోలియోను శాఖ ఎవరికి అప్పగిస్తారనే దానిపై పలు దఫాలుగా తీవ్రంగా చర్చించారు. 

ప్రతిపక్షంతో పాటు పార్టీలోనూ ఉద్రిక్తతలు
ప్రతిపక్షంతో పాటు కూటమిలో ఉన్న మిత్రపక్ష పార్టీలు ఆర్థిక విధానాలపై ఒత్తిడిని పెంచాయి.  రిపబ్లికన్ల నేత, రాజీనామా చేస్తున్న ఇంటర్నల్ మినిస్టర్ బ్రూనో రిటైల్లూ, తన పార్టీ భాగస్వామ్యం మంత్రివర్గంలో కనిపించడం లేదు అని సెటైర్లు వేశారు. ప్రతిపక్ష పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మంగళవారం జరగనున్న జనరల్ పాలసీ స్పీచ్ కంటే ముందు కొత్త ప్రభుత్వం కేబినెట్ ప్రకటన కీలకమని భావించింది. కానీ మంత్రి పదవులపై రాద్ధాంతం, ప్రతిపక్షాల విమర్శలు, ఆర్థిక విధానాలలో అస్పష్టత కారణంగా ఫ్రాన్స్ కొత్త ప్రధాని సెబాస్టియన్ తన పదవి నుంచి తప్పుకున్నారు. 

ప్రధాని పదవికి లెకోర్ను రాజీనామా
చివరకు కొత్త ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను తన మంత్రివర్గాన్ని ప్రకటించారు. తొలి కేబినెట్ భేటీ నిర్వహించారు. అనంతరం ప్రతిపక్షంతో పాటు సొంత కూటమిలో రేగిన అసంతృప్తి, రాజకీయ ఒత్తిడి మధ్య కొన్ని గంటల్లోనే సెబాస్టియన్ లెకోర్ను ప్రధాని పదవికి సోమవారం నాడు రాజీనామా చేశారు. జాతీయ అసెంబ్లీలో మెజారిటీ లేకుండా పాలన ఎంత కష్టమో ఆయన అంగీకరించారు.  బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ఫ్రాన్స్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 49.3ని ఉపయోగించకుండా ఉంటానని చెప్పారు. కానీ పార్లమెంటులో ఏకాభిప్రాయం అవసరాన్ని నొక్కి చెబుతూ తాను అత్యంత బలహీనమైన ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్ను అభివర్ణించుకున్నారు. తన సన్నిహితుడు, ప్రధాని రాజీనామా లేఖను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ఆమోదించడం చకచకా జరిగిపోయాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Advertisement

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Virat Kohli Anushka Sharma Trolls: అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
Train Tickets: ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి గుడ్ న్యూస్ - ఇక పది గంటల ముందే ఆ సమాచారం !
Bigg Boss Telugu Emmanuel Promo : స్పెషల్ AVలు వచ్చేస్తున్నాయి.. మొదటిది Unstoppable Emmanuelదే, పొగడ్తలతో ముంచేసిన బిగ్​బాస్
స్పెషల్ AVలు వచ్చేస్తున్నాయి.. మొదటిది Unstoppable Emmanuelదే, పొగడ్తలతో ముంచేసిన బిగ్​బాస్
Nagarjuna: ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
ఏయన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం... మేం ఇవ్వకపోతే బాగోదు - నాగార్జున సంచలన ప్రకటన
Embed widget