Sore Throat: గొంతు నొప్పి అనుకొని యాంటీబయోటిక్ ఇచ్చారు- ప్రాణాలు పోతేగానీ తెలియలేదు ఆ వ్యాధి ఏంటో?
Sore Throat: వ్యాధిని సకాలంలో గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే నయం అవుతుంది. అయితే కొన్ని జబ్బులు గుర్తించేలోపే అవి మనుషుల ప్రాణాలు తీసేస్తున్నాయి. అందుకు ఉదాహరణే ఈ ల్యూక్ అబ్రహాం జీవితం.
![Sore Throat: గొంతు నొప్పి అనుకొని యాంటీబయోటిక్ ఇచ్చారు- ప్రాణాలు పోతేగానీ తెలియలేదు ఆ వ్యాధి ఏంటో? England Doctor considers sore throat to be minor, this dangerous virus took Life of young man in few days Sore Throat: గొంతు నొప్పి అనుకొని యాంటీబయోటిక్ ఇచ్చారు- ప్రాణాలు పోతేగానీ తెలియలేదు ఆ వ్యాధి ఏంటో?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/21/022be5141510a4f9c2f8d24bd9a0820b1676965685815543_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sore Throat: మన శరీరం ప్రతి దశలో ఏదో ఒక వ్యాధితో పోరాడుతూనే ఉంటుంది. వైరస్ లు, బ్యాక్టీరియాలతో నిత్యం సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. వైద్య విజ్ఞాన రంగం ఎంత అభివృద్ధి చెందుతోందో.. అలాగే ఈ బ్యాక్టీరియా, వైరస్ లు అంతకంటే ఎక్కువ వృద్ధి చెందుతూ కొత్త కొత్త రోగాలను తెచ్చిపెడుతున్నాయి. వ్యాధిని సకాలంలో గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే నయం అవుతుంది. అయితే కొన్ని జబ్బులు గుర్తించేలోపే అవి మనుషుల ప్రాణాలు తీసేస్తున్నాయి. రోగాన్ని గుర్తించడంలో, తగిన మందులు తీసుకోవడంలో కొంచెం అలసత్వం ప్రదర్శించిన దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.
అందుకు ఉదాహరణే ఈ ల్యూక్ అబ్రహాం జీవితం.
ఇంగ్లండ్ కు చెందిన 20 ఏళ్ల ల్యూక్ అబ్రహాం వృత్తిరీత్యా రైల్వేస్ లో ఇంజనీర్. అలాగే ఫుట్ బాల్ ఆటగాడు కూడా. చాలా సంతోషంగా గడిచిపోతున్న అబ్రహాం జీవితం ఉన్నట్లుండి ఆగిపోయింది. అందుకు కారణం అతనికి వచ్చిన వ్యాధికి సరైన చికిత్స అందకపోవడమే. అసలేం జరిగిందంటే.. ఈ ఏడాది జనవరిలో అబ్రహాం గొంతు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి డాక్టర్ సాధారణ గొంతు నొప్పి, ఇతర లక్షణాల ఆధారంగా చిన్న సమస్యగా పరిగణించి అందుకు తగిన మందులు ఇచ్చారు. అయితే ఆ మందులు వాడినా అబ్రహాంకు గొంతు నొప్పి తగ్గకపోగా కాళ్ల నొప్పులు వచ్చాయి. సమస్య తీవ్రమవటంతో అతని కుటుంబసభ్యులు వేరే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే అబ్రహాం చనిపోయాడు.
అతనికి వచ్చిన అనారోగ్యం ఏంటి?
అతని మరణం అనంతరం వైద్యులు అసలు అతనికి వచ్చిన వ్యాధి ఏంటో కనుక్కోవడానికి ప్రయత్నించారు. అది బ్యాక్టీరియా లేదా వైరస్ వలన వచ్చిన ఒక కొత్త ఇన్ ఫెక్షన్ అని గుర్తించారు. ఇది మొదట గొంతు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత రక్తం, నరాలను ప్రభావితం చేస్తుంది. సరైన చికిత్స తీసుకోకపోతే ఇది పెరిగి శరీరంలో రక్తం గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా కాలేయం, మూత్రపిండాలు, ఇతర ముఖ్యమైన అవయవాలు విఫలమవుతాయి. ఈ వ్యాధిని 2 రకాలుగా గుర్తించవచ్చు. ఒకటి.. దాని లక్షణాలను నిశితంగా గమనించడం. రెండు.. రక్తపరీక్ష.
అయితే ల్యూక్ మొదట వెళ్లిన ఆసుపత్రి వైద్యులు అతనికి వచ్చింది సాధారణ గొంతునొప్పి అని భావించి అందుకు తగ్గ మందులు ఇచ్చారు. దీంతో అతని ఆరోగ్యం మెరుగుపడకపోగా.. కొత్త ఇన్ ఫెక్షన్ తో మరింత క్షీణించి చివరికి అతను మరణించాడు.
కాబట్టి సరైన సమయంలో వ్యాధిని గుర్తించి అందుకు తగిన చికిత్స తీసుకోవడం మంచిది.
బ్రెజిల్‌లో ఘటన..
బ్రెజిల్‌లో ఓ శిశువు తోకతో జన్మించింది. ఇది చూసి వైద్యులు షాక్ అయ్యారు. ఆ తోక 6 సెంటీమీటర్ల పొడవు ఉన్నట్టు చెప్పారు డాక్టర్లు. గర్భంలో ఉండగానే ఈ లోపం తలెత్తిందని, ఆ తోక పెరుగుతూ వచ్చిందని వివరించారు. దీన్నే వైద్య పరిభాషలో spina bifidaగా పిలుస్తారు. అంటే వెన్నముకతో పాటుగా అదనంగా ఓ తోక పెరుగుతుంది. స్పైనల్ కార్డ్ ఎదిగే క్రమంలో గ్యాప్ వస్తుందని, అదే తోకలా పెరుగుతుందని చెప్పారు వైద్యులు. అయితే...ఈ తోకను వెంటనే సర్జరీ చేసి తొలగించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)