అన్వేషించండి

Elon Musk News:ఎలాన్ మస్క్‌ సంచలన నిర్ణయం - డోనాల్డ్ ట్రంప్‌కు థాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు

Elon Musk News: అమెరికా ప్రభుత్వ ఇచ్చిన పదవి నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్ ట్రంప్‌కి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఖర్చు విధానంపై విమర్శలు చేశారు.

Elon Musk News: టెస్లా, స్పేస్‌ఎక్స్‌కు అధినేత అయిన ఎలాన్ మస్క్, అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగి (SGE)గా ఆయన 130 రోజుల పదవీకాలం ముగిసిందని ప్రకటించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (పూర్వం ట్విట్టర్)లో ఆయన ఇలా రాసుకొచ్చారు, "ప్రభుత్వ ఖర్చులను తగ్గించే అవకాశం కల్పించినందుకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. DOGE మిషన్ కాలక్రమేణా మరింత బలపడుతుంది" అని పేర్కొన్నారు.

ప్రభుత్వ సామర్థ్య విభాగం (DOGE) ఒక పరిపాలనాపరమైన ఆవిష్కరణ, ఇందులో మస్క్‌కు ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, సామర్థ్యాన్ని పెంచే బాధ్యత అప్పగించారు.  ఈ కార్యక్రమం ద్వారా అనవసరమైన ప్రభుత్వ ఖర్చులను గుర్తించారు. విదేశీ సహాయం, ప్రజాప్రసారంపై ఖర్చులను తగ్గించే సూచనలు చేశారు.  NPR, PBS, విదేశీ సహాయ కార్యక్రమాలలో $9.4 బిలియన్లు తగ్గించాలని ప్రతిపాదనలు చేశారు. ప్రభుత్వ సంస్కరణ, అనవసరమైన ఖర్చులను తొలగించే దిశగా ఈ చర్య తీసుకున్నారు.  

ఎలాన్ మస్క్  పెద్ద ప్రకటన

ట్రంప్  "బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్"పై ఎలాన్ మస్క్ విమర్శలు చేసిన సమయంలో వైదొలిగారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్‌లో బహుళ-ట్రిలియన్ డాలర్ల పన్ను తగ్గింపులు, రక్షణ ఖర్చులలో భారీ పెరుగుదల, వలస నియంత్రణ చర్యలతో సంబంధిత ఖర్చులు ఉన్నాయి. దీని గురించి మస్క్, "ఈ బిల్ DOGE పనితీరును బలహీనపరుస్తుంది. దీని వల్ల నష్టం పెరిగే అవకాశం ఉంది" అని అన్నారు. దీనిపై ట్రంప్ ఓవల్ ఆఫీసులో, "నేను కొన్ని విభాగాలతో సంతోషంగా లేను, కానీ భవిష్యత్‌లో ఏమి జరుగుతుందో చూద్దాం" అని అన్నారు. 
 
కాంగ్రెస్, సెనేట్‌లోనూ అభిప్రాయ భేదాలు

మస్క్ ప్రకటనకు కొంతమంది రిపబ్లికన్ నేతలు మద్దతు ఇచ్చారు. సెనేటర్ రాన్ జాన్సన్ (విస్కాన్సిన్) మాట్లాడుతూ, "ఎలాన్ నిరుత్సాహపడటంపై నాకు కన్సర్న్‌ ఉంది. అయితే, అధ్యక్షుడిపై ఇది ఎలాంటి ప్రభావం చూపదు" అని అన్నారు. హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్, సెనేట్‌లో బిల్‌లో తక్కువ మార్పులు చేయాలని, తద్వారా సమతుల్యత ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే, బిల్ విషయంలో సెనేట్ మార్పులు చేస్తే, తర్వాత దాన్ని హౌస్ ఆఫ్ రిప్రజెంటెటివ్స్‌లో ఓటింగ్‌కు తీసుకురావాలి.

 రాజకీయాలు తగ్గిస్తా: మస్క్‌ 

ప్రభుత్వ పదవి నుంచి వైదొలుగుతూ, ఎలాన్ మస్క్, "నేను ఇప్పుడు పూర్తిగా టెస్ల, స్పేస్‌ఎక్స్‌కు అంకితం అవుతాను. నేను నా రాజకీయాలు కూడా తగ్గిస్తాను, ఎందుకంటే నేను నావంతు కృషి చేశానని నేను నమ్ముతున్నాను" అని అన్నారు. ఆయన ప్రకటన, రాజకీయాల నుంచి తప్పుకుని తన కంపెనీలపై దృష్టి పెడతానని స్పష్టం చేస్తుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Embed widget