By: ABP Desam | Updated at : 19 Mar 2023 03:21 PM (IST)
ఈక్వెడార్లో భూకంప తీవ్రతకు కుప్పకూలిన భవనాలు
Ecuador Earthquake: ఈక్వెడార్, ఉత్తర పెరూ తీరప్రాంతంలో శనివారం మధ్యాహ్నం సంభవించిన భారీ భూకంపం కారణంగా అనేక గృహాలు, పాఠశాలలు, ఆస్పత్రులు నేలమట్టమయ్యాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. ఈ ప్రమాదంలో పెద్ద పెద్ద భవనాలు, ప్రభుత్వ పాఠశాలలు, వైద్య కేంద్రాలు దెబ్బతిన్నాయని, తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ విపత్తు కారణంగా ఈక్వెడార్లో 13 మంది మరణించగా.. పెరూలో ఒకరు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 126 మందికిపైగా గాయలపాలయ్యారని తెలిపారు. యూఎస్ జియోలాజికల్ సర్వే ఈక్వెడార్లోని రెండవ అతిపెద్ద నగరమైన గ్వాయాక్విల్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్ తీరంలో 6.8 తీవ్రతతో భూకంపం ఏర్పడిందని వెల్లడించింది.
ఈ భూకంపం ప్రభావానికి పలు నివాసాలు, స్కూల్స్, కాలేజీలు, ఆరోగ్య కేంద్రాలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. క్యూన్కా నగరంలో ఓ వ్యక్తి వాహనంలో ఉండగా.. ఒక్కసారిగా గోడ కూలి మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈక్వెడార్ సరిహద్దులోని టుంబెస్ ప్రాంతంలో ఓ ఇల్లు కూలిపోవడం వల్ల 4 ఏళ్ల బాలిక తలకు గాయమై చనిపోయిందని పెరు ప్రధాని అల్బెర్టో ఒటారోలా తెలిపారు. మనాబి, మాంటా, రాజధాని క్విటోతో సహా అనేక ప్రధాన నగరాల్లో భూకంప ప్రభావం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నందున మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ భూకంపం నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని తెలిపారు.
అతి తక్కువ జనాభా ఉన్న ఈక్వెడార్ ప్రాంతం ఎక్కువగా భూకంపాలకు గురవుతుంది. 2016లో ఈ దేశంలో వచ్చిన భూకంపం కారణంగా దాదాపు 600 మందికి పైగా మరణించారు. ఆ తర్వాత సంభవించిన అతిపెద్ద భూకంపం ఇదే అని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఈక్వెడార్ అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో స్పందిస్తూ.., “బాధితులైన వారికి తమ అన్ని రకాల సహాయ, సహకారాలను అందించడానికి అత్యవసర బృందాలు కృషిచేస్తున్నాయని ట్వీట్ చేశారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.
Sugar: తీపి తగ్గుతున్న చక్కెర, ప్రపంచ దేశాల్లో ఇదో పెద్ద సమస్య
Swedish National Arrested: మద్యం మత్తులో ఎయిర్ హోస్టెస్‌తో అసభ్య ప్రవర్తన, అరెస్ట్ చేసిన పోలీసులు
ChatGPT Banned: చాట్ జీపీటీ టూల్‌పై బ్యాన్, ప్రైవసీపై అనుమానాలు
Canada-US Border: అక్రమంగా అమెరికాలోకి వచ్చేందుకు ప్రయత్నం, ప్రాణాలు కోల్పోయిన భారతీయులు
India-China Border: చైనా కావాలనే గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది, భారత్‌కే మా ఫుల్ సపోర్ట్ - అమెరికా
Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...
BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్
AP News : ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...
PBKS Vs KKR: కోల్‌కతాపై పంజాబ్ భారీ స్కోరు - భానుక రాజపక్స మెరుపు ఇన్నింగ్స్!