US Presidential Election 2024: అమెరికా ఎన్నికల్లో దూసుకెళ్తున్న ట్రంప్ - వెనుకబడ్డ హారిస్
US Election 2024 Updates: అమెరికా ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటికే పూర్తైన రాష్ట్రాల్లో లెక్కింపు జరుగుతోంది.
US Election 2024 Results: యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తున్న అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికలు పూర్తైన రాష్ట్రాల్లో ఫలితాలు ఒక్కొక్కటిగా వెల్లడిస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను గమనిస్తే డొనాల్డ్ ట్రంప్ లీడింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన పది రాష్ట్రాల్లో విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి కమలా హారిస్ 8 రాష్ట్రాల్లో విజయం సొంతం చేసుకున్నారు.
డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన రాష్ట్రాలు:- ఇండియానా ,కెంటకీ, వెస్ట్ వర్జీనియా, మిస్సౌరి, ఫ్లోరిడా, మిస్సిసిపీ, సౌత్ కరోలినా, టెన్నెసీ, అలబామా, ఓక్లహామా
కమలాహారిస్ విజయం సాధించిన రష్ట్రాలు:- మేరీలాండ్, మస్సాచుసెట్స్, కెనక్టికట్, న్యూజెర్సీ, గోడ్ ఐలాండ్, వెర్మాంట్, డెలావర్, ఇల్లినాయిస్
ఆయా రాష్ట్రాలలో ఉన్న ఎలక్టోరల్‌ను బట్టి విజేతను ప్రకటిస్తారు. ఇప్పటి వరకు ట్రంప్ విజయం సాధించిన రాష్ట్రాలను బట్టి ట్రంప్ 178 ఎలక్టోరల్‌ను గెలుచుకున్నారు. కమలా హారిస్ 113 మాత్రమే విజయం సాధించారు. దీంతో ఫలితం ఆసక్తిగా మారింది. .
ఫలితాలు డిసైడ్ చేసే స్వింగ్ స్టేట్స్‌లో కమలా హారిస్ వెనుకబడ్డారని సమాచారం. పెన్సిల్వేనియా, అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్‌లో ట్రంప్ దూసుకెళ్తున్నట్టు సమాచారం. ఇక్కడ ట్రంప్ 58.2 శాతం ఓట్లు సాధించగా... హారిస్‌కు 41.3 శాతం ఓట్లే పోలైనట్టు తెలుస్తోంది.
అమెరికాలో ఇంకా పోలింగ్ ప్రక్రియ ముగియలేదు. ఓటు వేసేందుకు వందల మంది క్యూలైన్‌లలో నిలబడి ఉన్నారు. ఇది కొన్ని రాష్ట్రాల్లో కనిపిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయింది. అందుకే అక్కడ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఎన్నికలు పూర్తైన రాష్ట్రాల్లో ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు.
అందుకే ఓట్లు వేసేందుకు క్యూలైన్‌లోఉన్న వాళ్లంతా తమ హక్కును వినియోగించుకొని వెళ్లాలని ట్రంప్ వీడియో విడుదల చేశారు. ఎంత సమయమైనా సరే ఓట్లు వేయండని సూచించారు. 'ఎన్నికల్లో సులభంగా గెలుస్తాను' అని డొనాల్డ్ ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఓటింగ్ తర్వాత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను ఎన్నికల్లో గెలుస్తానని "చాలా నమ్మకం" కలిగి ఉన్నానని అన్నారు. టఫ్ ఏం లేదని అని అన్నారు. ఫలితాలు ప్రకటించడానికి కొంత సమయం పట్టవచ్చని నిరాశ వ్యక్తం చేశారు. "మేం ప్రతిచోటా చాలా బాగా పనిచేస్తున్నాం " అని ట్రంప్ అన్నారు. తాను నిర్వహించిన మూడు ప్రచారాల్లో ఇదే అత్యుత్తమమని అన్నారు. "ఇద్దరి మధ్య హోరాహోరీ ఏం లేదు, ఇది రుజువు కావడానికి కాస్త సమయం పడుతుంది" అని ట్రంప్ అన్నారు.
'ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది' అమెరికాలోని 73 శాతం ప్రజల అభిప్రాయం
US ఎన్నికల కోసం నిర్వహించిన తాజా సర్వేల్లో ఓటర్లు ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థలో మార్పులు పెద్ద సమస్యలుగా పేర్కొన్నారు. దాదాపు మూడింట ఒక వంతు మంది ప్రజలు దీనిని ఆందోళనకరమైన విషయంగా పేర్కొన్నారు. అబార్షన్, ఇమ్మిగ్రేషన్ కూడా ముఖ్యమైన సమస్యలుగా చెప్పారు. 73 శాతం మంది ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, 25 శాతం మంది మాత్రమే సురక్షితమని అభిప్రాయపడ్డారని సర్వే వెల్లడించింది.