యాక్సిడెంట్‌లో వేరైన బాలుడి తల మొండెం, సర్జరీ చేసి మళ్లీ అతికించిన వైద్యులు - మెడికల్ మిరాకిల్
Reattach Head: యాక్సిడెంట్‌లో ఓ బాలుడి తల మొండెం వేరుకాగా ఇజ్రాయేల్ వైద్యులు సర్జరీ చేసి మళ్లీ అతికించారు.
Reattach Head:
ఇజ్రాయేల్‌లో ఘటన..
గతంలో మెడికల్ మిరాకిల్స్ అప్పుడప్పుడూ జరిగేవి. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చిన తరవాత ఇలాంటి అద్భుతాలు తరచూ జరుగుతున్నాయి. ఇజ్రాయేల్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. అసలు ఊహకు కూడా అందని సర్జరీని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు వైద్యులు. ఓ 12 ఏళ్ల బాలుడు సైకిల్ తొక్కుతుండగా కార్ వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల,మొండెం మధ్య కనెక్షన్ కట్ అయింది. దీన్ని సైంటిఫిక్ పరిభాషలో బైలాటరల్ అట్లాంటో ఆసిపిటల్ జాయింట్ డిస్‌లొకేషన్ అంటారు. గత నెల ఈ యాక్సిడెంట్ అయింది. వెంటనే ఎమర్జెన్సీ సర్జరీ కోసం ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని గమనించిన వైద్యులు, తల మొండెం నుంచి దాదాపు వేరైపోవడాన్ని గుర్తించారు. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఒహాడ్ ఎయినవ్ లీడ్ తీసుకుని సర్జరీకి ముందుకొచ్చారు. గంటల పాటు శ్రమించి చాలా జాగ్రత్తగా సర్జరీ పూర్తి చేశారు. డ్యామేజ్ అయిన ప్రాంతంలో కొత్త ప్లేట్‌లు అమర్చి మళ్లీ తల, మొండెం ఒకటయ్యేలా చూశారు. "మాకు సర్జరీ ఎలా చేయాలో తెలుసు. కానీ అలాంటి టెక్నాలజీ మా వద్ద ఉండాలిగా. అది అందుబాటులో ఉంది కాబట్టే ఇది సాధ్యమైంది" అని వెల్లడించారు డాక్టర్ ఒహాడ్. బాలుడి ప్రాణాలు కాపాడేందుకు తాము యుద్ధం చేసినట్టు స్పష్టం చేశారు.
"బాలుడు బతుకుతాడన్న ఆశలు లేవు. కేవలం 50% మాత్రమే ఛాన్స్ ఉందని ఫిక్స్ అయిపోయాం. అయినా సర్జరీ మొదలు పెట్టాం. అంతా పూర్తయ్యాక బాలుడు కోలుకున్నాడు. ఇది చూసి మేమే నమ్మలేకపోయాం. ఇదో మిరాకిల్"
- వైద్యులు
గత నెలలోనే సర్జరీ..
నిజానికి ఈ కాంప్లికేటెడ్ సర్జరీ గత నెలలోనే పూర్తైనా ఇప్పటి వరకూ ఆ వివరాలు బయటకు చెప్పలేదు. ఇప్పుడా బాధితుడు పూర్తిగా కోలుకుని బయటకు వచ్చాక అప్పుడు ఈ సర్జరీ గురించి చెప్పారు. ఇకపై కూడా ఆ బాలుడి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తామని వైద్యులు స్పష్టం చేశారు. ఇంత పెద్ద సర్జరీ చేశాక కూడా...ఎలాంటి సపోర్ట్ లేకుండా బాలుడు నడవగలగడం మరో అద్భుతం అని అంటున్నారు. ఎంతో అనుభవం, నైపుణ్యం ఉంటే తప్ప ఇలాంటి కష్టమైన సర్జరీలు చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. ఆ బాలుడి తండ్రి క్షణం కూడా వదిలి పెట్టకుండా కొడుకు వద్దే ఉన్నాడు. సర్జరీ సక్సెస్ అవ్వగానే వైద్యులందరికీ థాంక్స్ చెప్పాడు.
అమెరికాలో అరుదైన సర్జరీ..
అమెరికన్ వైద్యులు ఇటీవలే ఓ అరుదైన సర్జరీ చేశారు. మెడికల్ హిస్టరీలోనే ఇలాంటి శస్త్రచికిత్స ఇంకెక్కడా జరిగి ఉండదు. ఓ మహిళ గర్భంలోని శిశువు మెదడులో సమస్య వచ్చింది. అబ్‌నార్మల్‌గా ఉందని గుర్తించిన వైద్యులు వెంటనే సర్జరీ చేయాలని చెప్పారు. కానీ చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం కనుక కాస్త వెనకడుగు వేశారు. ఆ తరవాత ధైర్యం చేసి సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో జరిగిందీ ఘటన. మెదడు నుంచి గుండెకు రక్త ప్రసరణ సరిగ్గా జరగడం లేదని గుర్తించి సర్జరీ చేశారు. ఈ సమస్య అలాగే ఉండి ఉంటే...నరాలపై ఒత్తిడి పెరిగి అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని వైద్యులు చెప్పారు. చిన్నారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వెంటనే చికిత్స అందించినట్టు వెల్లడించారు.
Also Read: Chandrayaan 3 Launched: మూన్ రేస్‌లో దూసుకుపోతున్న ఇండియా, చంద్రయాన్ 3 సక్సెస్ అయితే మరింత జోష్